Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 15:2 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

2 ఏడ్చుటకు మోయాబీయులు గుడికిని మెట్టమీదనున్న దీబోనుకును వెళ్లుచున్నారు నెబోమీదను మేదెబామీదను మోయాబీయులు ప్రలాపించుచున్నారు వారందరి తలలమీద బోడితనమున్నది ప్రతివాని గడ్డము గొరిగింపబడి యున్నది

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

2 ఏడవడానికి మోయాబీయులు గుడికీ, మెట్ట మీద ఉన్న దీబోనుకూ వెళ్తున్నారు. నెబో మీద, మేదెబా మీద మోయాబీయులు ప్రలాపిస్తున్నారు. వాళ్ళందరూ తమ తలలు గొరిగించుకున్నారు, గడ్డాలు క్షవరం చేయించుకున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

2 రాజ కుటుంబం, దీబోను ప్రజలు ఉన్నతమైన పూజాస్థలాల్లో మొరపెట్టేందుకు వెళ్తున్నారు. నెబో కోసం, మేదెబా కోసం మోయాబు ప్రజలు మొరపెడ్తున్నారు. ప్రజలంతా వారి విచారం వ్యక్తం చేయటానికి తలలు బోడిగుండ్లు చేసుకొన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

2 దీబోను ఏడ్వడానికి గుడికి తన క్షేత్రాలకు వెళ్తుంది; నెబో మెదెబా బట్టి మోయాబు రోదిస్తుంది. ప్రతి తల క్షౌరం చేయబడింది ప్రతివాని గడ్డం గొరిగించబడింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

2 దీబోను ఏడ్వడానికి గుడికి తన క్షేత్రాలకు వెళ్తుంది; నెబో మెదెబా బట్టి మోయాబు రోదిస్తుంది. ప్రతి తల క్షౌరం చేయబడింది ప్రతివాని గడ్డం గొరిగించబడింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 15:2
34 ပူးပေါင်းရင်းမြစ်များ  

అంతట హానూను దావీదు పంపించిన సేవకులను పట్టుకొని, సగము గడ్డము గొరిగించి, వారు తొడుగు కొనిన బట్టలను నడిమికి పిఱ్ఱలమట్టుకు కత్తిరించి వారిని వెళ్లగొట్టెను.


హానూను దావీదు సేవకులను పట్టుకొని, వారిని గొరిగించి, వారి వస్త్రములు పిరుదులు దిగకుండునట్లు నడిమికి కత్తిరించి వారిని పంపివేసెను.


అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తలవెండ్రుకలు గొరిగించుకొని నేలమీద సాష్టాంగపడి నమస్కారముచేసి ఇట్లనెను


గుమ్మమా, ప్రలాపింపుమీ, పట్టణమా, అంగలార్పుమీ. ఫిలిష్తియా, నీవు బొత్తిగా కరిగిపోయియున్నావు ఉత్తరదిక్కునుండి పొగ లేచుచున్నది వచ్చువారి పటాలములలో వెనుకతీయువాడు ఒకడును లేడు.


తమ సంత వీధులలో గోనెపట్ట కట్టుకొందురువారి మేడలమీదను వారి విశాలస్థలములలోను వారందరు ప్రలాపించుదురు కన్నీరు ఒలకపోయు దురు.


మోయాబీయులు ఉన్నతస్థలమునకు వచ్చి ఆయాస పడి ప్రార్థన చేయుటకు తమ గుడిలో ప్రవేశించునప్పుడువారికేమియు దొరకకపోవును.


కావున మోయాబీయులు మోయాబునుగూర్చి అంగలార్చుదురు అందరును అంగలార్చుదురు మోయాబీయులారా కేవలము పాడైయున్న కీర్హరెశెతు ద్రాక్షపండ్ల అడలు దొరకక మీరు మూలుగుదురు.


ఆ దినమున ఏడ్చుటకును అంగలార్చుటకును తలబోడి చేసికొనుటకును గోనెపట్ట కట్టుకొనుటకును సైన్యములకధిపతియు ప్రభువునగు యెహోవా మిమ్మును పిలువగా


అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడును నడికట్టుకు ప్రతిగా త్రాడును అల్లిన జడకు ప్రతిగా బోడితలయు ప్రశస్తమైన పైవస్త్రమునకు ప్రతిగా గోనెపట్టయు అందమునకు ప్రతిగా వాతయును ఉండును.


ఆలకించుడి, చెట్లులేని మెట్టలమీద ఒక స్వరము వినబడుచున్నది; ఆలకించుడి, తాము దుర్మార్గులై తమ దేవుడైన యెహోవాను మరచినదానినిబట్టి ఇశ్రాయేలీయులుచేయు రోదన విజ్ఞాపనములు వినబడుచున్నవి.


–యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –జలములు ఉత్తరదిక్కునుండి పొర్లి వరదలై మనుష్యులు మొఱ్ఱపెట్టునట్లుగాను దేశనివాసులందరు అంగలార్చునట్లుగాను, దేశముమీదను అందున్న సమస్తముమీదను పట్టణము మీదను దానిలో నివసించువారిమీదను ప్రవహించును.


గాజా బోడియాయెను, మైదానములో శేషించిన అష్కెలోను నాశనమాయెను. ఎన్నాళ్లవరకు నిన్ను నీవే గాయపరచుకొందువు?


మోయాబునుగూర్చినది. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడు. –నెబోకు శ్రమ, అది పాడైపోవుచున్నది. కిర్యతాయిము పట్టబడినదై అవమానము నొందుచున్నది ఎత్తయిన కోట పడగొట్టబడినదై అవమానము నొందుచున్నది ఇకను మోయాబునకు ప్రసిద్ధియుండదు.


దేబోనులో ఆసీనురాలై యుండుదానా, మోయాబును పాడుచేసినవాడు నీ మీదికి వచ్చు చున్నాడు. నీ కోటలను నశింపజేయుచున్నాడు. నీ గొప్పతనము విడిచి దిగిరమ్ము ఎండినదేశములో కూర్చుండుము.


కాబట్టి మోయాబు నిమిత్తము నేను అంగలార్చు చున్నాను మోయాబు అంతటిని చూచి కేకలు వేయుచున్నానువారు కీర్హరెశు జనులు లేకపోయిరని మొఱ్ఱపెట్టుచున్నారు.


ఉన్నతస్థలమున బలులు అర్పించువారిని దేవతలకు ధూపమువేయువారిని మోయాబులో లేకుండజేసెదను ఇదే యెహోవా వాక్కు.


హెష్బోనూ, అంగలార్చుము, హాయి పాడాయెను, మల్కోమును అతని యాజకులును అతని యధిపతులును చెరలోనికి పోవు చున్నారు; రబ్బా నివాసినులారా, కేకలువేయుడి, గోనెపట్ట కట్టుకొనుడి, మీరు అంగలార్చి కంచెలలో ఇటు అటు తిరుగులాడుడి.


తనకు కోపము తెప్పించు తరమువారిని యెహోవా విసర్జించి వెళ్లగొట్టుచున్నాడు; సీయోనూ నీ తలవెండ్రు కలను కత్తిరించుకొనుము, వాటిని పారవేయుము, చెట్లులేని మెట్టలమీద ప్రలాపవాక్య మెత్తుము.


నీకొరకు తలలు బోడి చేసికొని మొలలకు గోనెలు కట్టుకొని మనశ్చింతగలవారై నిన్నుగూర్చి బహుగా అంగలార్చుదురు.


–నరపుత్రుడా, సమాచార మెత్తి ప్రవచింపుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చు నదేమనగా–ఆహా శ్రమదినము వచ్చెనే, అంగలార్చుడి, శ్రమదినము వచ్చెనే,


వారు గోనెపట్టకట్టుకొందురు, వారికి ఘోరమైన భయము తగులును, అందరు సిగ్గుపడుదురు, అందరి తలలు బోడియగును.


తలవెండ్రుకలు రాలినవాడు బట్ట తలవాడు; అయిననువాడు పవిత్రుడు.


వారు తమ తలలు బోడిచేసికొనరాదు. గడ్డపు ప్రక్కలను క్షౌరము చేసికొన రాదు, కత్తితో దేహమును కోసికొనరాదు.


మీ పండుగ దినములను దుఃఖదినములుగాను మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును, అందరిని మొలలమీద గోనెపట్ట కట్టుకొనజేయుదును, అందరి తలలు బోడిచేసెదను, ఒకనికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టింతును; దాని అంత్యదినము ఘోరమైనశ్రమదినముగా ఉండును.


హెష్బోనునుండి అగ్ని బయలువెళ్లెను సీహోను పట్టణమునుండి జ్వాలలు బయలువెళ్లెను అది మోయాబునకు చేరిన ఆరు దేశమును కాల్చెను అర్నోనుయొక్క ఉన్నతస్థలముల ప్రభువులను కాల్చెను.


వాటిమీద గురిపెట్టి కొట్టితిమి దీబోనువరకు హెష్బోను నశించెను నోఫహువరకు దాని పాడు చేసితిమి. అగ్నివలన మేదెబావరకు పాడుచేసితిమి.


–అతారోతు దీబోను యాజెరు నిమ్రా హెష్బోను ఏలాలే షెబాము నెబో బెయోను అను స్థలములు, అనగా


షిబ్మా అను పురములను కట్టి, తాముకట్టిన ఆ పురములకు వేరు పేరులుపెట్టిరి.


మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు గనుక చనిపోయిన వాడెవనినిబట్టి మిమ్మును మీరు కోసికొనకూడదు, మీ కనుబొమ్మలమధ్య బోడిచేసికొనకూడదు.


మోషే మోయాబు మైదానమునుండి యెరికో యెదుటనున్న పిస్గాకొండవరకు పోయి నెబోశిఖరమున కెక్కెను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ