Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 1:28 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

28 అతిక్రమము చేయువారును పాపులును నిశ్శేషముగా నాశనమగుదురు యెహోవాను విసర్జించువారు లయమగుదురు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

28 అతిక్రమం చేసేవాళ్ళూ, పాపులూ కలిసి ఏకంగా నాశనమౌతారు. యెహోవాను విడిచి పెట్టేసిన వాళ్ళు లయమౌతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

28 అయితే నేరుస్థులు, పాపులు అందరూ నాశనం చేయబడతారు. (వారు యెహోవాను వెంబడించని ప్రజలు.)

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

28 అయితే తిరుగుబాటుదారులు, పాపులు నలుగగొట్టబడతారు, యెహోవాను విడిచిపెట్టిన వారు నశిస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

28 అయితే తిరుగుబాటుదారులు, పాపులు నలుగగొట్టబడతారు, యెహోవాను విడిచిపెట్టిన వారు నశిస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 1:28
38 ပူးပေါင်းရင်းမြစ်များ  

సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రియొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటిని సంకల్పములన్నిటిని ఎరిగినవాడునై యున్నాడు. నీవు ఆయనను తెలిసికొని హృదయపూర్వకముగాను మనః పూర్వకముగాను ఆయనను సేవించుము, ఆయనను వెదకినయెడల ఆయన నీకు ప్రత్యక్షమగును, నీవు ఆయనను విసర్జించినయెడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును.


కాగా నేటివరకును జరుగుచున్నట్టు ఎదోమీయులు యూదావారి చేతిక్రింద నుండక తిరుగబడిరి. యెహోరాము తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున ఆ కాలమందు లిబ్నాయును అతనిచేతి క్రిందనుండి తిరుగబడెను.


ఎట్లనగా–సిరియా రాజుల దేవతలు వారికి సహాయము చేయుచున్నవి గనుక వాటి సహాయము నాకును కలుగునట్లు నేను వాటికి బలులు అర్పించెదననుకొని, తన్ను ఓడించిన దమస్కువారి దేవతలకు బలులు అర్పించెను; అయితే అవి అతనికిని ఇశ్రాయేలువారికిని నష్టమునకే హేతువులాయెను.


రెమల్యా కుమారుడైన పెకహు యూదావారిలో పరాక్రమశాలులైన లక్ష ఇరువదివేలమందిని ఒక్కనాడు హతముచేసెను. వారు తమపితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున వారికిట్టి గతి పట్టెను.


దుర్మార్గులకు విపత్తు సంభవించుటే గదా పాపము చేయువారికి దురవస్థ ప్రాప్తించుటయే గదా.


దుష్టులని బహిరంగముగానే ఆయన వారిని శిక్షించును.


ఏలయనగా వారు ఆయనను అనుసరించుట మానిరి ఆయన ఆజ్ఞలలో దేనినైనను లక్ష్యపెట్టకపోయిరి.


నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును దుష్టుల మార్గము నాశనమునకు నడుపును.


పాపులు భూమిమీదనుండి లయమగుదురు గాక భక్తిహీనులు ఇక నుండకపోదురు గాక నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము యెహోవాను స్తుతించుడి.


తమ వంకరత్రోవలకు తొలగిపోవువారిని పాపముచేయువారితోకూడ యెహోవా కొనిపోవును ఇశ్రాయేలుమీద సమాధానముండును గాక.


ఒకడైనను నిలువకుండ అపరాధులు నశించుదురు భక్తిహీనుల సంతతి నిర్మూలమగును.


అబద్ధమాడువారిని నీవు నశింపజేయుదువు కపటము చూపి నరహత్య జరిగించువారు యెహో వాకు అసహ్యులు.


నిన్ను విసర్జించువారు నశించెదరు నిన్ను విడిచి వ్యభిచరించువారినందరిని నీవు సంహ రించెదవు.


నీవు అన్యజనులను గద్దించియున్నావు, దుష్టులను నశింపజేసి యున్నావు వారి పేరు ఎన్నటికి నుండకుండ తుడుపు పెట్టి యున్నావు.


నీ శత్రువులు యెహోవా, నీ శత్రువులు నశిం చెదరు చెడుపనులు చేయువారందరు చెదరిపోవుదురు.


ఎన్నిసారులు గద్దించినను లోబడనివాడు మరి తిరుగులేకుండ హఠాత్తుగా నాశనమగును.


పాపిష్ఠి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్టసంతానమా, చెరుపుచేయు పిల్లలారా, మీకు శ్రమ.వారు యెహోవాను విసర్జించియున్నారు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుని దూషింతురు ఆయనను విడిచి తొలగిపోయి యున్నారు.


భూమి మత్తునివలె కేవలము తూలుచున్నది పాకవలె ఇటు అటు ఊగుచున్నది దాని అపరాధము దానిమీద భారముగా ఉన్నది అది పడి యికను లేవదు. భయంకరమైన వర్తమానము విని పారిపోవువాడు గుంటలో పడును గుంటను తప్పించుకొనువాడు ఉరిలో చిక్కును.


ఈ దోషము మీకు ఎత్తయిన గోడ నుండి జోగిపడబోవుచున్న గోడ అండవలె అగును అది ఒక్క క్షణములోనే హఠాత్తుగా పడిపోవును.


సీయోనులోనున్న పాపులు దిగులుపడుచున్నారు వణకు భక్తిహీనులను పట్టెను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింప గలడు? మనలో ఎవడు నిత్యము కాల్చుచున్నవాటితో నివ సించును?


యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడనున్నది? నా అప్పులవారిలో ఎవనికి మిమ్మును అమ్మివేసితిని? మీ దోషములనుబట్టి మీరు అమ్మబడితిరి మీ అతిక్రమములనుబట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడెను.


ఇదిగో అగ్ని రాజబెట్టి అగ్నికొరవులను మీచుట్టు పెట్టుకొనువారలారా, మీ అగ్ని జ్వాలలో నడువుడి రాజబెట్టిన అగ్ని కొరవులలో నడువుడి నా చేతివలన ఇది మీకు కలుగుచున్నది మీరు వేదనగలవారై పండుకొనెదరు.


తమ దేవుని న్యాయవిధిని విడువక నీతిని అనుసరించువారైనట్టు అనుదినము వారు నాయొద్ద విచారణ చేయుచు నా మార్గములను తెలిసికొన నిచ్ఛ కనుపరచుదురు తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలెనని వారడు గుదురు దేవుడు తమకు ప్రత్యక్షుడు కావలెనని యిచ్ఛ యింతురు.


మేమందరము అపవిత్రులవంటివారమైతిమి మా నీతిక్రియలన్నియు మురికిగుడ్డవలె నాయెను మేమందరము ఆకువలె వాడిపోతిమి గాలివాన కొట్టుకొనిపోవునట్లుగా మా దోషములు మమ్మును కొట్టుకొనిపోయెను


యెహోవాను విసర్జించి నా పరిశుద్ధపర్వతమును మరచి గాదునకు బల్లను సిద్ధపరచువారలారా, అదృష్టదేవికి పానీయార్పణము నర్పించువారలారా, నేను పిలువగా మీరు ఉత్తరమియ్యలేదు


తోటలోనికి వెళ్లవలెనని మధ్యనిలుచున్న యొకని చూచి తమ్ము ప్రతిష్ఠించుకొనుచు పవిత్రపరచు కొనుచున్నవారై పందిమాంసమును హేయవస్తు వును పందికొక్కులను తినువారును ఒకడును తప్పకుండ నశించెదరు ఇదే యెహోవా వాక్కు.


వారు పోయి నామీద తిరుగుబాటు చేసినవారి కళేబర ములను తేరి చూచెదరు వాటి పురుగు చావదు వాటి అగ్ని ఆరిపోదు అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును.


ఇశ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా, నిన్ను విసర్జించి వారందరు సిగ్గునొందుదురు. నాయెడల ద్రోహము చేయువారు యెహోవా అను జీవజలముల ఊటను విసర్జించియున్నారు గనుక వారు ఇసుకమీద పేరు వ్రాయబడినవారుగా ఉందురు.


జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు; ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాని ననుసరించి నడచుకొందురు గాని తిరుగుబాటు చేయువారి దారికి అది అడ్డము గనుక వారు తొట్రిల్లుదురు.


లోకులు – నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని చెప్పుకొను చుండగా, గర్భిణిస్త్రీకి ప్రసవవేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు


అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినమువరకు అగ్నికొరకు నిలువచేయబడినవై, అదే వాక్యమువలన భద్రము చేయబడియున్నవి.


పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రికులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.


మీరు కీడుచేయువారైతే తప్పకుండ మీరును మీ రాజును నాశనమగుదురు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ