Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 1:14 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

14 మీ అమావాస్య ఉత్సవములును నియామక కాలము లును నాకు హేయములు అవి నాకు బాధకరములు వాటిని సహింపలేక విసికియున్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

14 మీ అమావాస్య ఉత్సవాలు, నియామక ఉత్సవాలు నాకు అసహ్యం. అవి నాకు బాధాకరం. వాటిని సహించలేక విసిగిపోయాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

14 మీ నెలసరి సమావేశాలు, సభలు నాకు బొత్తిగా అసహ్యం. ఈ సమావేశాలు నాకు చాలా బరువులా తయారయ్యాయి. ఆ బరువులు మోయటం నాకు విసుగు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

14 మీ అమావాస్య ఉత్సవాలు, నియమించబడిన పండుగలు నా పూర్ణాత్మతో నేను అసహ్యిస్తున్నాను. అవి నాకు భారంగా ఉన్నాయి; వాటిని భరించలేక అలిసిపోయాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

14 మీ అమావాస్య ఉత్సవాలు, నియమించబడిన పండుగలు నా పూర్ణాత్మతో నేను అసహ్యిస్తున్నాను. అవి నాకు భారంగా ఉన్నాయి; వాటిని భరించలేక అలిసిపోయాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 1:14
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

సమాజపు గుడారమును కాపాడుటయు, పరిశుద్ధస్థలమును కాపాడుటయు, యెహోవా మందిరపు సేవతో సంబంధించిన పనులలో వారి సహోదరులగు అహరోను సంతతివారికి సహాయము చేయుటయు వారికి నియమింపబడిన పనియైయుండెను.


అరీయేలుకు శ్రమ దావీదు దండు దిగిన అరీయేలు పట్టణమునకు శ్రమ సంవత్సరము వెంబడి సంవత్సరము గడవనీయుడి పండుగలను క్రమముగా జరుగనీయుడి.


నేను అరీయేలును బాధింపగా దుఃఖమును విలాపమును కలుగును అందుచేత అది నిజముగా నాకు అగ్నిగుండమగును.


నా నిమిత్తము సువాసనగల లవంగపు చెక్కను నీవు రూకలిచ్చి కొనలేదు నీ బలి పశువుల క్రొవ్వుచేత నన్ను తృప్తిపరచలేదు సరే గదా. నీ పాపములచేత నీవు నన్ను విసికించితివి నీ దోషములచేత నన్ను ఆయాసపెట్టితివి.


ఏలయనగా న్యాయముచేయుట యెహోవానగు నాకిష్టము ఒకడు అన్యాయముగా ఒకనిసొత్తు పట్టుకొనుట నాకసహ్యము. సత్యమునుబట్టి వారి క్రియాఫలమును వారికిచ్చుచువారితో నిత్యనిబంధన చేయుదును.


ప్రతి అమావాస్యదినమునను ప్రతి విశ్రాంతిదినము నను నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చె దరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.


అతడు–ఈలాగు చెప్పెను, దావీదు వంశస్థులారా, వినుడి; మనుష్యులను విసికించుట చాలదను కొని నా దేవుని కూడ విసికింతురా?


దాని ఉత్సవకాలములను పండుగలను అమావాస్యలను విశ్రాంతిదినములను నియామకకాలములను మాన్పింతును.


యెహోవాకు విశ్వాసఘాతకులై వారు అన్యులైన పిల్లలను కనిరి; ఇంకొక నెల అయిన తర్వాత వారు వారి స్వాస్థ్యములతోకూడ లయమగుదురు.


ఇదిగో పంటచేని మోపుల నిండుబండి నేలను అణగ ద్రొక్కునట్లు నేను మిమ్మును అణగద్రొక్కుదును.


మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను; వాటిని నీచముగా ఎంచుచున్నాను; మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆఘ్రాణింపనొల్లను.


ఒక నెలలోగా కాపరులలో ముగ్గురిని సంహరించితిని; ఏలయనగా నేను వారి విషయమై సహనము లేనివాడను కాగా వారు నా విషయమై ఆయాసపడిరి.


మీ మాటలచేత మీరు యెహోవాను ఆయాసపెట్టుచు, దేనిచేత ఆయనను ఆయాసపెట్టుచున్నామని మీరడుగుచున్నారే. –దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారియందు ఆయన సంతోషపడును; లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయెను అని చెప్పుకొనుటచేతనే మీరాయనను ఆయాసపెట్టుచున్నారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ