హోషేయ 14:3 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 అష్షూరీయులచేత రక్షణ నొందగోరము, మేమికను గుఱ్ఱములను ఎక్కము–మీరే మాకు దేవుడని మేమికమీదట మా చేతి పనితో చెప్పము; తండ్రిలేనివారి యెడల వాత్సల్యము చూపువాడవు నీవే గదా. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 అష్షూరీయులు మమ్మల్ని రక్షించరు. మేమిక మీదట గుర్రాలెక్కి యుద్ధానికి పోము. ‘మీరే మాకు దేవుడు’ అని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రిలేని వారికి వాత్సల్యం నీ దగ్గరే దొరుకుతుంది.” အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్3 అష్షూరు మమ్మల్ని కాపాడదు. మేమిక యుద్ధగుర్రాలపైన స్వారీ చేయము. మేము మా స్వహస్తాలతో చేసిన విగ్రహాలను ఇంకెప్పుడూ మరల ‘ఇది మా దేవుడు’ అని అనము. ఎందుకంటే, అనాధుల పట్ల జాలి చూపేది నువ్వొక్కడివే.” အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 అష్షూరు మమ్మల్ని రక్షించలేదు; మేము యుద్ధ గుర్రాలను ఎక్కము. మా చేతులు చేసిన వాటితో మేము, ‘మా దేవుళ్ళు’ అని ఇక ఎన్నడు చెప్పము, ఎందుకంటే మీరు తండ్రిలేనివారికి దయ చూపుతారు.” အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 అష్షూరు మమ్మల్ని రక్షించలేదు; మేము యుద్ధ గుర్రాలను ఎక్కము. మా చేతులు చేసిన వాటితో మేము, ‘మా దేవుళ్ళు’ అని ఇక ఎన్నడు చెప్పము, ఎందుకంటే మీరు తండ్రిలేనివారికి దయ చూపుతారు.” အခန်းကိုကြည့်ပါ။ |
వారిని ఏకజనముగా చేసి, వారికందరికి ఒక రాజునే నియమించెదను. తమ విగ్రహముల వలనగాని తాము చేసియున్న హేయక్రియలవలనగాని యే అతి క్రమక్రియలవలనగాని వారికమీదట తమ్మును అపవిత్ర పరచుకొనరు; తాము నివసించిన చోట్లన్నిటిలో వారు మానక పాపములు ఇక చేయకుండ వారిని రక్షించి వారిని పవిత్రపరచెదను, అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారి దేవుడనై యుందును.