ఎజ్రా 7:9 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశమునుండి బయలుదేరి, తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగానున్నందున అయిదవ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 అతడు మొదటి నెల మొదటి రోజున బబులోను దేశం నుండి బయలుదేరి, తన దేవుని కాపుదలతో ఐదో నెల మొదటి రోజుకు యెరూషలేము చేరుకున్నాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్9 ఎజ్రా, అతనితో ఒక బృందం మొదటి నెల మొదటి రోజున బబులోను నుంచి బయల్దేరారు. ఎజ్రా యెరూషలేముకి అయిదవ నెల ఒకటవ రోజున చేరుకున్నాడు. యెహోవా దేవుడు అతనికి తోడుగా వున్నాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 తన దేవుని కరుణాహస్తం అతనికి తోడుగా ఉన్నందుకు అతడు మొదటి నెల మొదటి రోజున బబులోను నుండి బయలుదేరి, అయిదవ నెల మొదటి రోజున యెరూషలేము చేరుకున్నాడు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 తన దేవుని కరుణాహస్తం అతనికి తోడుగా ఉన్నందుకు అతడు మొదటి నెల మొదటి రోజున బబులోను నుండి బయలుదేరి, అయిదవ నెల మొదటి రోజున యెరూషలేము చేరుకున్నాడు. အခန်းကိုကြည့်ပါ။ |
–మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికందరికిని మా దేవుని హస్తముతోడుగా ఉండునుగాని, ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరిమీదికి వచ్చునని మేము రాజుతో చెప్పియుంటిమి గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయునట్లు కాల్బలమును రౌతులును రాజునొద్ద కావలెనని మనవి చేయుటకు సిగ్గుగా నాకు తోచెను.