ఎజ్రా 6:21 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)21 కావున చెరలోనుండి విడుదలనొంది తిరిగివచ్చిన ఇశ్రాయేలీయులును, ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాను ఆశ్రయించుటకై దేశమందుండు అన్యజనులలో అపవిత్రతనుండి తమ్మును తాము ప్రత్యేకించుకొనిన వారందరును వచ్చి,తిని పులియనిరొట్టెల పండుగను ఏడు దినములు ఆనందముతో ఆచరించిరి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201921 చెర నుండి విడుదల పొంది తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయులు వాటిని తిన్నారు. ఇశ్రాయేలీయుల దేశంలో ఉన్న అన్యజాతి ప్రజలు దేవుడైన యెహోవా ఆశ్రయం కోరి అపవిత్రత నుండి తమను తాము ప్రత్యేకించుకుని వారు కూడా వచ్చి పులియని రొట్టెలు తిని ఏడు రోజుల పండగను ఆనందంతో జరుపుకున్నారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్21 అలాగు, నిర్బంధంనుంచి తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయులందరూ పస్కా పండుగ భోజనం చేశారు. ఇతరులు స్నానాదులతో తమని తాము శుభ్రం చేసుకుని, ఆ దేశంలో నివసించే ఇతర మనుష్యుల అపరిశుభ్ర అంశాలనుంచి తమని తాము వేరు చేసుకున్నారు. అలా పరిశుద్ధులైన వాళ్లు కూడా పస్కా పండుగ భోజనంలో పాల్గొన్నారు. వాళ్లు సహాయం కోసం, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా దగ్గరకు పోగలిగేందుకు, వారు తమ్మును తాము వేరు చేసుకొని పరిశుద్ధ పరచుకొన్నారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం21 చెర నుండి విడుదలై వచ్చిన ఇశ్రాయేలీయులు, దేశంలో పొరుగు ప్రజల అపవిత్ర ప్రవర్తను నుండి తమను తాము ప్రత్యేకించుకొని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను కొలిచే వారంతా కలిసి పస్కాను తిన్నారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం21 చెర నుండి విడుదలై వచ్చిన ఇశ్రాయేలీయులు, దేశంలో పొరుగు ప్రజల అపవిత్ర ప్రవర్తను నుండి తమను తాము ప్రత్యేకించుకొని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను కొలిచే వారంతా కలిసి పస్కాను తిన్నారు. အခန်းကိုကြည့်ပါ။ |