Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెహెజ్కేలు 40:2 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

2 దేవుని దర్శనవశుడనైన నన్ను ఇశ్రాయేలీయుల దేశములోనికి తోడుకొని వచ్చి, మిగుల ఉన్నతమైన పర్వతముమీద ఉంచెను. దానిపైన దక్షిణపుతట్టున పట్టణమువంటి దొకటి నాకగు పడెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

2 దేవుడు నన్ను తన దర్శనాలతో నింపి ఇశ్రాయేలు దేశంలోకి తెచ్చి, చాలా ఎత్తయిన కొండ మీద ఉంచాడు. దానికి దక్షిణాన పట్టణం లాంటిది ఒకటి నాకు కనబడింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

2 ఒక దర్శనంలో దేవుడు నన్ను ఇశ్రాయేలు రాజ్యానికి తీసుకొని వెళ్లాడు. చాలా ఎత్తయిన ఒక పర్వతం దగ్గర ఆయన నన్ను దించాడు. ఆ పర్వతం మీద ఒక నగరంలా కన్పించే ఒక దివ్య భవంతి ఉంది. ఆ నగరం దక్షిణ దిశగా ఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

2 దేవుని దర్శనంలో ఆయన నన్ను ఇశ్రాయేలు దేశానికి తీసుకెళ్లి చాలా ఎత్తైన పర్వతం మీద నన్ను ఉంచారు. దాని మీద దక్షిణం వైపున ఒక పట్టణం లాంటిది నాకు కనిపించింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

2 దేవుని దర్శనంలో ఆయన నన్ను ఇశ్రాయేలు దేశానికి తీసుకెళ్లి చాలా ఎత్తైన పర్వతం మీద నన్ను ఉంచారు. దాని మీద దక్షిణం వైపున ఒక పట్టణం లాంటిది నాకు కనిపించింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెహెజ్కేలు 40:2
23 ပူးပေါင်းရင်းမြစ်များ  

వాటి చుట్టునున్న గదులకును దేవుని మందిరపు బొక్కసములకును ప్రతిష్ఠిత వస్తువుల బొక్కసములకును తాను ఏర్పాటుచేసి సిద్ధపరచిన మచ్చులను తన కుమారుడైన సొలొమోనునకు అప్పగించెను.


ఇవియన్నియు అప్పగించి–యెహోవా హస్తము నామీదికి వచ్చి యీ మచ్చుల పనియంతయు వ్రాతమూలముగా నాకు నేర్పెను అని సొలొమోనుతో చెప్పెను.


ఉత్తరదిక్కున మహారాజు పట్టణమైన సీయోను పర్వతము రమ్యమైన యెత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా నున్నది


–నేను ఆకాశమున కెక్కిపోయెదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తరదిక్కుననున్న సభాపర్వతముమీద కూర్చుందును


వారు–మేము పరిశుద్ధ పట్టణస్థులమను పేరు పెట్టు కొని ఇశ్రాయేలు దేవుని ఆశ్రయించుదురు సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు.


ముప్పదియవ సంవత్సరము నాలుగవ నెల అయిదవదినమున నేను కెబారు నదీప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని; ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవునిగూర్చిన దర్శనములు నాకు కలిగెను.


నిజముగా ఇశ్రాయేలీయుల ఉన్నతమైన కొండయగు నా పరిశుద్ధపర్వతమందు దేశములోనున్న ఇశ్రాయేలీయులందరును నాకు సేవచేయుదురు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అచ్చటనే నేను వారిని అంగీకరించెదను. అచ్చటనే మీ ప్రతిష్ఠితమైన యర్పణలను, మీ ప్రథమ ఫలదానములను, ప్రతిష్ఠితములగు మీ కానుకలనన్నిటిని నేనంగీకరించెదను.


వారికమీదట ఎన్నటికిని రెండు జనములుగాను రెండు రాజ్యములుగాను ఉండకుండునట్లు ఆ దేశములో ఇశ్రాయేలీయుల పర్వతములమీద


తరువాత అతడు నన్ను ఆలయమునకు తోడుకొని. వచ్చి దాని స్తంభములను కొలిచెను. ఇరుప్రక్కల అవి ఆరు మూరలాయెను, ఇది గుడారపు వెడల్పు.


ఆ మందిరమునుగూర్చిన విధి యేదనగా పర్వతము మీద దానికి చేరికైన స్థలమంతయు అతిపరిశుద్ధము, మందిరమునుగూర్చిన విధి యిదియే.


మరియు చెయ్యివంటిది ఒకటి ఆయన చాపి నా తలవెండ్రుకలు పట్టుకొనగా ఆత్మ భూమ్యాకాశములమధ్యకు నన్నెత్తి, నేను దేవుని దర్శనములను చూచుచుండగా యెరూషలేమునకు ఉత్తరపువైపుననున్న ఆవరణ ద్వారముదగ్గర రోషము పుట్టించు విగ్రహస్థానములో నన్ను దించెను.


బబులోను రాజగు బెల్షస్సరుయొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలునకు దర్శనములు కలిగెను; అతడు తన పడకమీద పరుండి యొక కలకని ఆ కల సంగతిని సంక్షేపముగా వివరించి వ్రాసెను.


పిమ్మట రాత్రియందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా, ఘోరమును భయంకరమునగు నాలుగవ జంతువొకటి కనబడెను. అది తనకు ముందుగా నుండిన యితర జంతువులకు భిన్నమైనది; అది మహాబల మహాత్మ్యములుగలది; దానికి పెద్ద ఇనుప దంతములును పది కొమ్ములు నుండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తునియలుగా చేయుచు మిగిలినదానిని కాళ్లక్రింద అణగద్రొక్కుచుండెను.


అంత్యదినములలో యెహోవామందిరపర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండలకంటె ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు.


అప్పుడు మాసిదోనియ దేశస్థుడొకడు నిలిచి–నీవు మాసిదోనియకు వచ్చి మాకు సహాయము చేయుమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను.


–అంత్యదినములయందు నేను మనుష్యులందరిమీద నా ఆత్మను కుమ్మరించెదను మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచించెదరు మీ యౌవనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందురు.


అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది; అది మనకు తల్లి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ