Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




నిర్గమ 40:9 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 మరియు నీవు అభిషేకతైలమును తీసికొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నిటిని ప్రతిష్ఠింపవలెను, అప్పుడు అది పరిశుద్ధమగును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 అభిషేక తైలం తీసుకుని దైవ నివాసాన్నీ, అందులోని వాటన్నిటినీ అభిషేకించాలి. దానినీ, దానిలోని సామగ్రి అంతటినీ ప్రతిష్టించాలి. అప్పుడు అది పవిత్రం అవుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

9 “అభిషేకతైలం ఉపయోగించి పవిత్ర గుడారాన్ని, అందులో ఉండే సమస్తాన్ని అభిషేకించు. ఈ వస్తువుల మీద నీవు తైలం పోసినప్పుడు వాటిని నీవు పవిత్రం చేస్తావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 “అభిషేక తైలాన్ని తీసుకుని సమావేశ గుడారాన్ని, దానిలో ఉన్నవాటన్నిటిని అభిషేకించాలి; దానిని, దాని సామాగ్రి అన్నిటిని ప్రతిష్ఠించాలి, అప్పుడు అది పరిశుద్ధం అవుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 “అభిషేక తైలాన్ని తీసుకుని సమావేశ గుడారాన్ని, దానిలో ఉన్నవాటన్నిటిని అభిషేకించాలి; దానిని, దాని సామాగ్రి అన్నిటిని ప్రతిష్ఠించాలి, అప్పుడు అది పరిశుద్ధం అవుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




నిర్గమ 40:9
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్రకంటె హెచ్చ గునట్లుగా నిన్ను ఆనందతైలముతో అభిషేకించియున్నాడు.


అతడు పరిశుద్ధమైన అభిషేక తైలమును స్వచ్ఛమైన పరిమళ ధూపద్రవ్యమును పరిమళ ద్రవ్యముల మేళకునిచేత చేయించెను.


ఇత్తడి బలిపీఠమును దానికుండు ఇత్తడి జల్లెడను దాని మోతకఱ్ఱలను దాని ఉపకరణములన్నిటిని, గంగాళమును దాని పీటను


తెరలచుట్టు ఆవరణమును నిలువబెట్టి ఆవరణద్వారముయొక్క తెరను తగిలింపవలెను.


యెహోవా ఆత్మ జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యెహోవాయెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతనిమీద నిలుచును


ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చియున్నది దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను నలిగిన హృదయముగలవారిని దృఢపరచుటకును చెరలోనున్నవారికి విడుదలను బంధింపబడినవారికి విముక్తిని ప్రకటించుటకును


అభిషేకము నొందిన కెరూబువై యొక ఆశ్రయముగా నీవుంటివి; అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతముమీద నీవుంటివి, కాలుచున్న రాళ్లమధ్యను నీవు సంచరించుచుంటివి.


మరియు మోషే అభిషేకతైలమును తీసికొని మందిరమును దానిలోనున్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠించెను.


మోషే మందిరమును నిలువబెట్టుట ముగించి దాని అభిషేకించి ప్రతిష్ఠించి,


యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను; ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తనమీదికి వచ్చుట చూచెను.


ఆయన మనకు ముద్రవేసి, మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించియున్నాడు.


దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవారమగునట్లు, ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు.


అదేవిధముగా గుడారముమీదను సేవాపాత్రలన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించెను.


అయితే మీరు పరిశుద్ధునివలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ