ఎస్తేరు 9:2 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 యూదులురాజైన అహష్వేరోషుయొక్క సంస్థానములన్నిటిలో నుండు పట్టణములయందు తమకు కీడుచేయవలెనని చూచినవారిని హతముచేయుటకు కూడుకొనిరి. వారిని గూర్చి సకల జనులకు భయము కలిగినందున ఎవరును వారి ముందర నిలువలేకపోయిరి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 యూదులు అహష్వేరోషు పాలనలో ఉన్న సంస్థానాలన్నిటిలో ఉన్న పట్టణాల్లో తమకు కీడు తలపెట్టిన వారిని హతమార్చడానికి సమకూడారు. ఎవరూ వారి ముందు నిలవలేకపోయారు. అన్ని జాతుల ప్రజలకూ వారంటే భయం పట్టుకుంది. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్2 అహష్వేరోషు మహారాజు సామ్రాజ్యంలోని అన్ని నగరాల్లోని యూదులూ సమావేశమయ్యారు. తమను నాశనం చేయాలని కోరినవారి పైన దాడిచేసేటంత బలాన్ని సమకూర్చుకునేందుకుగాను వాళ్లు సమకూడారు. దానితో, వాళ్లని ఎదిరించి నిలబడగల శక్తిగలవారు ఎవ్వరూ లేకపోయారు. యూదులంటే జనం భయపడ్డారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 యూదులు రాజైన అహష్వేరోషు సంస్థానాలన్నిటిలో తమ పట్టణాల్లో సమావేశమై, వారిని నాశనం చేయాలని నిర్ణయించుకున్న వారిపై దాడి చేశారు. వారి ఎదుట ఎవరూ నిలువలేకపోయారు, ఎందుకంటే ఇతర దేశాల ప్రజలందరు వారికి భయపడ్డారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 యూదులు రాజైన అహష్వేరోషు సంస్థానాలన్నిటిలో తమ పట్టణాల్లో సమావేశమై, వారిని నాశనం చేయాలని నిర్ణయించుకున్న వారిపై దాడి చేశారు. వారి ఎదుట ఎవరూ నిలువలేకపోయారు, ఎందుకంటే ఇతర దేశాల ప్రజలందరు వారికి భయపడ్డారు. အခန်းကိုကြည့်ပါ။ |