ఎస్తేరు 7:4 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 సంహరింపబడుటకును, హతము చేయబడి నశించుటకును, నేనును నా జనులును కూడ అమ్మబడినవారము. మేము దాసులముగాను దాసు రాండ్రముగాను అమ్మబడినయెడల నేను మౌనముగా నుందును; ఏలయనగా మా విరోధిని తప్పించుకొనుటకై మేము రాజవగు తమరిని శ్రమపరచుట యుక్తము కాదు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 నేను, నా జాతి ప్రజలు, సమూల నాశనానికి, సంహారానికి, తుడిచి పెట్టి వేయడానికి అమ్ముడుబోయాము. మేమంతా ఆడ, మగ బానిసలుగా అమ్ముడుబోయినట్టైతే నేను నోరు విప్పేదాన్ని కాదు. ఎందుకంటే ఆ మాత్రం ఇబ్బందికి రాజువైన మీకు బాధ ఇవ్వడం భావ్యం కాదు గదా.” အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్4 ఎందుకంటే నాశనం చేయబడేందుకు, చంపివేయబడేందుకు, నిర్మూలించబడేందుకు నేనూ, నా ప్రజలూ అమ్మివేయబడ్డాం. మేము కేవలం బానిసలుగా అమ్మివేయబడివుంటే, నేను ఊరక ఉండి పోదును. ఎందుకంటే, అది మహారాజును విసిగించవలసినంతటి సమస్య అయ్యుండేది కాదు.” အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 ఎందుకంటే నేను, నా ప్రజలు నాశనం చేయబడడానికి, చంపబడడానికి, నిర్మూలించబడడానికి అమ్మబడ్డాము. ఒకవేళ మేము కేవలం దాసదాసీలుగా అమ్మబడి ఉంటే, నేను మౌనంగా ఉండేదాన్ని, ఎందుకంటే అలాంటి బాధ కోసం రాజును అభ్యంతర పెట్టడం భావ్యం కాదు” అని అన్నది. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 ఎందుకంటే నేను, నా ప్రజలు నాశనం చేయబడడానికి, చంపబడడానికి, నిర్మూలించబడడానికి అమ్మబడ్డాము. ఒకవేళ మేము కేవలం దాసదాసీలుగా అమ్మబడి ఉంటే, నేను మౌనంగా ఉండేదాన్ని, ఎందుకంటే అలాంటి బాధ కోసం రాజును అభ్యంతర పెట్టడం భావ్యం కాదు” అని అన్నది. အခန်းကိုကြည့်ပါ။ |