ఎఫెసీయులకు 2:10 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్టింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 మనం దేవుని సృష్టిగా, దేవుడు ముందుగా సిద్ధం చేసిన మంచి పనులు చేయడం కోసం మనలను క్రీస్తు యేసులో సృష్టించాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్10 దేవుడు మన సృష్టికర్త. ఆయన యేసు క్రీస్తులో మనలను సత్కార్యాలు చేయటానికి సృష్టించాడు. ఆ సత్కార్యాలు ఏవో ముందే నిర్ణయించాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 ఎందుకంటే దేవుడు మన కోసం ముందుగా సిద్ధపరచిన మంచి క్రియలు చేయడానికి క్రీస్తు యేసునందు సృష్టింపబడిన మనం దేవుని చేతిపనియై ఉన్నాము. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 ఎందుకంటే దేవుడు మన కోసం ముందుగా సిద్ధపరచిన మంచి క్రియలు చేయడానికి క్రీస్తు యేసునందు సృష్టింపబడిన మనం దేవుని చేతిపనియై ఉన్నాము. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము10 ఎందుకంటే దేవుడు మన కొరకు ముందుగా సిద్ధపరచిన మంచి క్రియలు చేయడానికి క్రీస్తు యేసునందు సృష్టింపబడిన మనం దేవుని చేతిపనియై యున్నాము. အခန်းကိုကြည့်ပါ။ |
సీయోనులో దుఃఖించువారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదెకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతివస్త్రమునువారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనునట్లు నీతి అను మస్తకివృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్ట బడును.
ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు, తన చిత్తప్రకారమైన దయాసంకల్పముచొప్పున, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.