Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ప్రసంగి 12:1 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 దుర్దినములు రాకముందే–ఇప్పుడు వీటియందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 కష్టకాలం రాకముందే, “జీవితం అంటే నాకిష్టం లేదు” అని నువ్వు చెప్పే కాలం రాకముందే,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

1 చెడ్డకాలం దాపురించక ముందు (నీవు ముసలి వాడవు కాకముందు), “నా జీవితం వృథా చేసు కున్నాను” అని నీవు వాపోయే వయస్సు రాక ముందు, నీవింకా యౌవ్వనావస్థలో వుండగానే నీ సృష్టికర్తని నీవు గుర్తుచేసుకో.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1-2 కష్ట దినాలు రాకముందే “వాటిలో నాకు సంతోషం లేదు” అని నీవు చెప్పే సంవత్సరాలు రాకముందే, సూర్యచంద్ర నక్షత్రాలను చీకటి కమ్మక ముందే, వర్షం తగ్గి మరలా మేఘాలు కమ్మక ముందే, నీ యవ్వన ప్రాయంలో నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1-2 కష్ట దినాలు రాకముందే “వాటిలో నాకు సంతోషం లేదు” అని నీవు చెప్పే సంవత్సరాలు రాకముందే, సూర్యచంద్ర నక్షత్రాలను చీకటి కమ్మక ముందే, వర్షం తగ్గి మరలా మేఘాలు కమ్మక ముందే, నీ యవ్వన ప్రాయంలో నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ప్రసంగి 12:1
40 ပူးပေါင်းရင်းမြစ်များ  

యెహోవా యోసేపునకు తోడైయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని యింట నుండెను.


యెహోవా అతనికి తోడైయుండెను గనుక ఆ చెరసాల అధిపతి అతనిచేతికి అప్పగింపబడిన దేనిగూర్చియు విచారణచేయక యుండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను.


నేటికి నాకు ఎనుబది యేండ్లాయెను. సుఖదుఃఖములకున్న భేదమును నేను గుర్తింపగలనా? అన్నపానముల రుచి నీ దాసుడనైన నేను తెలిసికొనగలనా? గాయకులయొక్కయు గాయకురాండ్రయొక్కయు స్వరము నాకు వినబడునా? కావున నీ దాసుడనగు నేను నా యేలిన వాడవును రాజవునగు నీకు ఎందుకు భారముగా నుండవలెను?


నీ దాసుడనైన నేను నీతోకూడ నది దాటి అవతలకు కొంచెము దూరము వచ్చెదనుగాని రాజవగు నీవు నాకంత ప్రత్యుపకారము చేయనేల?


అతని నిమిత్తము ఇశ్రాయేలువారందరు అంగలార్చుచు, సమాధిలో అతనిని పెట్టుదురు; ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా యరొబాము సంబంధులలో ఇతనియందు మాత్రమే అనుకూలమైన దాని కనుగొనెను గనుక యరొబాము సంతతివారిలో ఇతడు మాత్రమే సమాధికి వచ్చును.


అయితే నేను నీయొద్దనుండి పోవు క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొంచుపోవును, అప్పుడు నేను పోయి అహాబునకు వర్తమానము తెలియజెప్పిన తరువాత నీవు అతనికి కనబడని యెడల అతడు నన్ను చంపివేయును, ఆలాగున ఆజ్ఞ ఇయ్యవద్దు, నీ దాసుడనైన నేను బాల్యమునుండి యెహోవాయందు భయభక్తులు నిలిపిన వాడను.


అంతట నేను లేచి చూచి ప్రధానులతోను అధికారులతోను జనులతోను–వారికి మీరు భయపడకుడి, మహా ఘనుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకము చేసికొని, మీ సహోదరుల పక్షముగాను మీ కుమారుల పక్షముగాను మీ కుమార్తెల పక్షముగాను మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటిని.


వారి చేతుల బలము నా కేమి ప్రయోజనమగును?వారి పౌరుషము పోయినది.


యెహోవా, రాత్రివేళ నీ నామమును స్మరణచేయు చున్నాను నీ ధర్మశాస్త్రము ననుసరించి నడుచుకొనుచున్నాను


పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవాయందలి భయభక్తులు మీకు నేర్పెదను.


కాగా నా జీవితకాలమంతయు నేనీలాగున నిన్ను స్తుతించెదను నీ నామమునుబట్టి నా చేతులెత్తెదను.


మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు అధికబలమున్నయెడల ఎనుబది సంవత్సరములగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోవుదుము.


బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు.


నన్ను ప్రేమించువారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు


లేతవయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీహృదయములోనుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపుదాని తొలగించుకొనుము.


ఏడుగురికిని ఎనమండు గురికిని భాగము పంచిపెట్టుము, భూమిమీద ఏమి కీడు జరుగునో నీవెరుగవు.


ఒకడు చాలా సంవత్సరములు బ్రదికినయెడల చీకటిగల దినములు అనేకములు వచ్చునని యెరిగియుండి తాను బ్రదుకుదినములన్నియు సంతోషముగా ఉండవలెను, రాబోవునదంతయు వ్యర్థము.


యెహోవా, నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని మేము నీకొరకు కనిపెట్టుకొనుచున్నాము మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచున్నది.


యౌవనకాలమున కాడి మోయుట నరునికి మేలు.


ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్రప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములగు దర్శనములను స్వప్నభావములను గ్రహించు తెలివిగలవాడై యుండెను.


అన్యులు అతని బలమును మ్రింగివేసినను అది అతనికి తెలియకపోయెను; తన తలమీద నెరసిన వెండ్రుకలు కనబడుచున్నను అది అతనికి తెలియదు.


అయితే యేసు వారిని తనయొద్దకు పిలిచి–చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నాయొద్దకు రానియ్యుడి, దేవుని రాజ్యము ఈలాటివారిది.


తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువుయొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.


కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసికొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటివలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే.


కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను; తాను బ్రదుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను.


అయితే యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను–అతని రూపమును అతని యెత్తును లక్ష్యపెట్టకుము, మనుష్యులు లక్ష్యపెట్టువాటిని యెహోవా లక్ష్యపెట్టడు; నేను అతని త్రోసివేసి యున్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురుగాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును.


బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను.


బాలుడగు సమూయేలు ఇంకను ఎదు గుచు యెహోవా దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ