ద్వితీ 11:2 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 నీ దేవుడైన యెహోవా చేసిన శిక్షను ఆయన మిహమను ఆయన బాహుబలమును ఆయన చాపిన చేతిని အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 మీ దేవుడు యెహోవా పంపిన శిక్షను గురించీ ఆయన గొప్పతనం, ఆయన బాహుబలం, ఆయన ప్రభావం గురించీ తెలియని మీ పిల్లలతో చెప్పడం లేదని మీరు గ్రహించాలి. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్2 మీకు ప్రబోధం చేసేందుకు మీ దేవుడైన యెహోవా చేసిన గొప్ప కార్యాలన్నింటినీ నేడు జ్ఞాపకం చేసుకోండి. ఆ కార్యాలు జరగటం చూచింది, వాటిని అనుభవించింది మీరేగాని మీ పిల్లలు కాదు. యెహోవా ఎంత గొప్పవాడో మీరు చూసారు. ఆయన ఎంత బలంగలవాడో మీరు చూశారు. ఆయన చేసే శక్తివంతమైన కార్యాలు మీరు చూసారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 మీ దేవుడైన యెహోవా క్రమశిక్షణను చూసింది, అనుభవించింది మీ పిల్లలు కాదని ఈ రోజు జ్ఞాపకం చేసుకోండి: ఆయన మహిమను, ఆయన బలమైన హస్తాన్ని, ఆయన చాచిన చేయిని; အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 మీ దేవుడైన యెహోవా క్రమశిక్షణను చూసింది, అనుభవించింది మీ పిల్లలు కాదని ఈ రోజు జ్ఞాపకం చేసుకోండి: ఆయన మహిమను, ఆయన బలమైన హస్తాన్ని, ఆయన చాచిన చేయిని; အခန်းကိုကြည့်ပါ။ |
నీ దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారముగాను నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసిన ప్రకారముగాను, నేడు నిన్ను తనకు స్వజనముగా నియమించుకొని తానే నీకు దేవుడైయుండునట్లు నీ దేవుడైన యెహోవా నేడు నీకు నియమించుచున్న నీ దేవుడైన యెహోవా నిబంధనలోను ఆయన ప్రమాణము చేసినదానిలోను నీవు పాలుపొందుటకై ఇశ్రాయేలీయులలో ప్రతివాడు, అనగా మీలో ముఖ్యులేమి, మీ గోత్రపువారేమి మీ పెద్దలేమి, మీ నాయకు లేమి మీ పిల్లలేమి, మీ భార్యలేమి, నీ పాళెములోనున్న పరదేశులేమి, నీ కట్టెలను నరుకువారు మొదలుకొని నీ నీళ్లు తోడువారివరకును మీరందరు నేడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచియున్నారు.