దానియేలు 4:1 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 రాజగు నెబుకద్నెజరు లోకమంతట నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాటలాడు వారికిని ఈలాగు సెలవిచ్చుచున్నాడు–మీకు క్షేమాభి వృద్ధి కలుగునుగాక. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 లోకమంతటిలో నివసించే అన్ని దేశాల ప్రజలకు, వివిధ భాషలు మాట్లాడే వారికి రాజైన నెబుకద్నెజరు ఇలా రాస్తున్నాడు. “మీకందరికీ పూర్ణ క్షేమం కలుగు గాక. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్1 రాజైన నెబుకద్నెజరు తన లేఖను ప్రపంచంలో అన్ని జనాంగాలకు, ఇతర భాషలు మాటలాడే దేశాలకు, ప్రజలకు ఇలా వ్రాయించాడు: మీ అందరికీ సమాధాన మగుగాక! အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 రాజైన నెబుకద్నెజరు, లోకంలో జీవించే వివిధ భాషలు గల దేశాలకు, ప్రజలకు ఇలా తెలియజేస్తున్నాడు: మీకు గొప్పగా అభివృద్ధి కలుగును గాక! အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 రాజైన నెబుకద్నెజరు, లోకంలో జీవించే వివిధ భాషలు గల దేశాలకు, ప్రజలకు ఇలా తెలియజేస్తున్నాడు: మీకు గొప్పగా అభివృద్ధి కలుగును గాక! အခန်းကိုကြည့်ပါ။ |
మొదటి నెల పదమూడవ దినమందు రాజుయొక్క లేఖికులు పిలువబడిరి; హామాను ఆజ్ఞాపించిన ప్రకారము అంతయు ఆయా సంస్థానములమీద నుంచ బడిన రాజుయొక్క అధిపతులకును అధికారులకును, ఆయా సంస్థానములలోని జనములమీద నుంచబడిన అధిపతులకును అధికారులకును, వారి వారి లిపినిబట్టియు, ఆయా జనములభాషనుబట్టియు, రాజైన అహష్వేరోషు పేరట ఆ లేఖికులచేత తాకీదులు వ్రాయింపబడి రాజు ఉంగరముచేత ముద్రింపబడెను.
సీవాను అను మూడవ నెలలో ఇరువది మూడవ దినమందు రాజుయొక్క వ్రాతగాండ్రు పిలువబడిరి; మొర్దకై ఆజ్ఞాపించిన ప్రకారమంతయు యూదులకును, హిందూ దేశము మొదలుకొని కూషుదేశమువరకు వ్యాపించియున్న నూట ఇరువదియేడు సంస్థానములలోనున్న అధిపతులకును అధికారులకును, ఆయా సంస్థానములకును దాని దాని వ్రాతనుబట్టియు దాని దాని భాషనుబట్టియు తాకీదులు వ్రాయబడెను.