Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ఆమోసు 7:9 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 ఇస్సాకు సంతతివారు ఏర్పరచిన ఉన్నతస్థలములు పాడైపోవును, ఇశ్రాయేలీయుల ప్రతిష్ఠితస్థలములు నాశమగును. నేను ఖడ్గము చేతపట్టుకొని యరొబాము ఇంటివారిమీద పడుదును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 ఇస్సాకు వంశం వారి ఉన్నత స్థలాలు నాశనమవుతాయి. ఇశ్రాయేలీయుల ప్రతిష్ఠిత స్థలాలు పాడైపోతాయి. యరొబాము వంశానికి విరోధంగా కత్తి ఎత్తుతాను.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

9 ఇస్సాకు వంశస్థులు ఏర్పాటు చేసిన ఉన్నత ప్రదేశాలు నాశనం చేయబడతాయి. ఇశ్రాయేలు పవిత్ర స్థలాలన్నీ రాళ్ల గుట్టల్లా మార్చబడతాయి. నేను యరొబాము వంశంమీద పడి వారిని కత్తులతో చంపుతాను.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 “ఇస్సాకు క్షేత్రాలు నాశనమవుతాయి ఇశ్రాయేలు పరిశుద్ధ స్థలాలు పాడైపోతాయి; యరొబాము ఇంటి మీదికి నా కత్తి ఎత్తుతాను.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 “ఇస్సాకు క్షేత్రాలు నాశనమవుతాయి ఇశ్రాయేలు పరిశుద్ధ స్థలాలు పాడైపోతాయి; యరొబాము ఇంటి మీదికి నా కత్తి ఎత్తుతాను.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ఆమోసు 7:9
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతయు తీసికొని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రియైన ఇస్సాకు దేవునికి బలులనర్పించెను.


ఇతడును ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక అనుసరించి యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను.


నీ పరిశుద్ధజనులు స్వల్పకాలమే దేశమును అనుభ వించిరి మా శత్రువులు నీ పరిశుద్ధాలయమును త్రొక్కియున్నారు.


మేము దూషణవాక్యము విని సిగ్గుపడియున్నాము అన్యులు యెహోవా మందిరపు పరిశుద్ధస్థలములలోనికి వచ్చియున్నారు మా ముఖములు తెల్లబోవుచున్నవి


–ఇశ్రాయేలీయుల పర్వతములారా, ప్రభువైన యెహోవా మాట ఆలకించుడి; పర్వతములతోను కొండలతోను వాగులతోను లోయలతోను ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఇదిగో నేను నిజముగా మీ మీదికి ఖడ్గమును రప్పించి మీ ఉన్నతస్థలములను నాశనము చేసెదను.


ఇశ్రాయేలువారి పాప స్వరూపమైన ఆవెనులోని ఉన్నతస్థలములు లయమగును, ముండ్ల చెట్లును కంపయు వారి బలిపీఠములమీద పెరుగును, పర్వతములను చూచి–మమ్మును మరుగుచేయుడనియు, కొండలను చూచి–మామీద పడుడనియు వారు చెప్పుదురు.


ఇశ్రాయేలువారు చేసిన దోషములనుబట్టి నేను వారిని శిక్షించు దినమున బేతేలులోని బలిపీఠములను నేను శిక్షింతును; ఆ బలిపీఠపు కొమ్ములు తెగవేయబడి నేలరాలును.


బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, బెయేర్షెబాకు వెళ్లకుడి; గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోవును, బేతేలు శూన్యమగును.


యరొబాము ఖడ్గముచేత చచ్చుననియు, ఇశ్రాయేలీయులు తమ దేశమును విడిచి చెరలోనికి పోవుదురనియు ప్రకటించుచున్నాడు; అతని మాటలు దేశము సహింపజాలదు అని తెలియజేసెను.


బేతేలు, రాజుయొక్క ప్రతిష్ఠితస్థలము రాజధాని పట్టణమై యున్నందున నీ వికను దానిలో నీ వార్త ప్రకటనచేయకూడదు.


షోమ్రోనుయొక్క దోషమునకు కారణమగుదాని తోడనియు, దానూ, నీ దేవుని జీవముతోడనియు, బెయేర్షెబా మార్గ జీవముతోడనియు ప్రమాణము చేయువారు ఇకను లేవకుండ కూలుదురు.


యెహోవా బలిపీఠమునకు పైగా నిలిచియుండుట నేను చూచితిని. అప్పుడు ఆయన నా కాజ్ఞ ఇచ్చిన దేమనగా–గడపలు కదలిపోవునట్లుగా పై కమ్ములనుకొట్టి వారందరి తలలమీద వాటిని పడవేసి పగులగొట్టుము; తరువాత వారిలో ఒకడును తప్పించుకొనకుండను, తప్పించు కొనువారిలో ఎవడును బ్రదుకకుండను నేను వారినందరిని ఖడ్గముచేత వధింతును.


యాకోబు సంతతి చేసిన తిరుగుబాటునుబట్టియు, ఇశ్రాయేలు సంతతివారి పాపములనుబట్టియు ఇదంతయు సంభవించును. యాకోబు సంతతివారు తిరుగుబాటు చేయుటకు మూలమేది? అది షోమ్రోనేగదా; యూదావారి ఉన్నతస్థలములు ఎక్కడివి? యెరూషలేములోనివే కావా?


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ