2 సమూయేలు 3:27 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)27 అబ్నేరు తిరిగి హెబ్రోనునకు వచ్చినప్పుడు–సంగతి యెవరికి వినబడకుండ గుమ్మము నడుమ ఏకాంతముగా అతనితో మాటలాడవలెనని యోవాబు అతని పిలిచి, తన సహోదరుడగు అశాహేలు ప్రాణము తీసినందుకై అతనిని కడుపులో పొడువగా అతడు చచ్చెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201927 అబ్నేరు తిరిగి హెబ్రోనుకు వచ్చినప్పుడు యోవాబు “విషయాలు ఎవరికీ వినబడకుండా రహస్యంగా మాట్లాడాలి” అని చెప్పి అతణ్ణి ద్వారం దగ్గరికి ఏకాంతంగా తీసుకు వచ్చాడు. అక్కడ తన సోదరుడు అశాహేలు ప్రాణం తీసినందుకు ప్రతీకారంగా అబ్నేరును కడుపులో పొడిచి చంపేశాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్27 అబ్నేరు హెబ్రోనుకు రాగానే, యోవాబు అతనిని సింహద్వారం మధ్యలో ఏదో రహస్యంగా మాట్లాడాలని ఒక పక్కకు తీసుకొని వెళ్లాడు. కాని యోవాబు తన కత్తితో అబ్నేరు పొట్టలో పొడిచాడు. అబ్నేరు చనిపోయాడు. గతంలో యోవాబు సోదరుడైన అశాహేలును అబ్నేరు చంపాడు. కావున యోవాబు అబ్నేరును చంపివేశాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం27 అబ్నేరు తిరిగి హెబ్రోనుకు వచ్చినప్పుడు యోవాబు ఎవరూ వినకుండా అతనితో ఏకాంతంగా మాట్లాడాలని చెప్పి అతన్ని లోపలికి తీసుకెళ్లి తన సోదరుడైన అశాహేలును చంపినందుకు ప్రతీకారంగా యోవాబు అబ్నేరు పొట్టలో కత్తితో పొడవగా అతడు చనిపోయాడు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం27 అబ్నేరు తిరిగి హెబ్రోనుకు వచ్చినప్పుడు యోవాబు ఎవరూ వినకుండా అతనితో ఏకాంతంగా మాట్లాడాలని చెప్పి అతన్ని లోపలికి తీసుకెళ్లి తన సోదరుడైన అశాహేలును చంపినందుకు ప్రతీకారంగా యోవాబు అబ్నేరు పొట్టలో కత్తితో పొడవగా అతడు చనిపోయాడు. အခန်းကိုကြည့်ပါ။ |