Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 సమూయేలు 3:12 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

12 అబ్నేరు తన తరపున దావీదునొద్దకు దూతలను పంపి –ఈ దేశము ఎవరిది? నీవు నాతో నిబంధనచేసినయెడల నేను నీకు సహాయము చేసి, ఇశ్రాయేలు వారినందరిని నీతట్టు త్రిప్పెదనని వర్తమానము పంపగా దావీదు– మంచిది; నేను నీతో నిబంధన చేసెదను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 అబ్నేరు తన మనుషులను దావీదు దగ్గరికి పంపి “ఈ రాజ్యం ఎవరిది? నువ్వు నాతో ఒప్పందం చెయ్యి. నేను నీకు సహాయం చేసి ఇశ్రాయేలు వారినందరినీ నీవైపు తిప్పుతాను” అని కబురు పంపాడు. అప్పుడు దావీదు “మంచిది. నేను నీతో ఒప్పందం చేస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

12 అబ్నేరు దావీదు వద్దకు దూతలను పంపాడు. అబ్నేరు తన మాటగా ఇలా చెప్పమన్నాడు: “నీవు ఈ రాజ్యాన్ని ఏలు. నాతో ఒక ఒడంబడిక చేసుకో. నీవు ఇశ్రాయేలంతటికీ రాజయ్యేలా నేను నీకు సహాయపడతాను.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

12 అప్పుడు అబ్నేరు దావీదు దగ్గరకు దూతలను పంపించి, “ఈ దేశం ఎవరిది? నాతో ఒప్పందం చేసుకో, ఇశ్రాయేలు రాజ్యమంతా నీది కావడానికి నేను నీకు సహాయం చేస్తాను” అని కబురు చేశాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

12 అప్పుడు అబ్నేరు దావీదు దగ్గరకు దూతలను పంపించి, “ఈ దేశం ఎవరిది? నాతో ఒప్పందం చేసుకో, ఇశ్రాయేలు రాజ్యమంతా నీది కావడానికి నేను నీకు సహాయం చేస్తాను” అని కబురు చేశాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 సమూయేలు 3:12
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

అతడు పోయి యెవరును తప్పకుండ యూదావారినందరిని రాజునకు ఇష్టపూర్వకముగా లోబడునట్లు చేయగా–నీవును నీ సేవకులందరును మరల రావలెనన్న వర్తమానము వారు రాజునొద్దకు పంపిరి. రాజు తిరిగి యొర్దాను నదియొద్దకు రాగా


ఇట్లుండగా ఇశ్రాయేలు వారందరును రాజునొద్దకు వచ్చి–మా సహోదరులగు యూదావారు ఎందుకు నిన్ను దొంగిలించుకొని, నీ యింటివారిని నీవారిని యొర్దాను ఇవతలకు తోడుకొని వచ్చిరని యడుగగా


నీ స్నేహితుల యెడల ప్రేమ చూపక నీ శత్రువులయెడల ప్రేమ చూపుచు, ఈ దినమున అధిపతులును సేవకులును నీకు ఇష్టజనులుకారని నీవు కనుపరచితివి. మేమందరము చనిపోయి అబ్షాలోము బ్రదికియుండినయెడల అది నీకు ఇష్టమగునన్న మాట యీ దినమున నేను తెలిసికొనుచున్నాను. ఇప్పుడు లేచి బయటికివచ్చి నీ సేవకులను ధైర్యపరచుము.


కావున ఇష్బోషెతు అబ్నేరునకు భయపడి యిక ఏ మాటయు పలుకలేక పోయెను.


అయితే నీవు ఒకపని చేయవలెను; నా దర్శనమునకు వచ్చునప్పుడు సౌలు కుమార్తెయగు మీకాలును నా యొద్దకు తోడుకొని రావలెను; లేదా నీకు దర్శనము దొరకదనెను.


అంతట అబ్నేరు–నేను పోయి ఇశ్రాయేలువారినందరిని నా యేలినవాడవగు నీ పక్షమున సమకూర్చి, వారు నీతో నిబంధనచేయునట్లును, నీ చిత్తానుసారముగా నీవు రాజరికము వహించి కోరినదాని అంతటిమీద ఏలునట్లును చేయుదునని దావీదుతో చెప్పి దావీదునొద్ద సెలవుపుచ్చుకొని సమాధానముగా వెళ్లిపోయెను.


అబ్నేరు తిరిగి హెబ్రోనునకు వచ్చినప్పుడు–సంగతి యెవరికి వినబడకుండ గుమ్మము నడుమ ఏకాంతముగా అతనితో మాటలాడవలెనని యోవాబు అతని పిలిచి, తన సహోదరుడగు అశాహేలు ప్రాణము తీసినందుకై అతనిని కడుపులో పొడువగా అతడు చచ్చెను.


పిమ్మట రాజు తన సేవకులను పిలిచి వారితో ఈలాగు సెలవిచ్చెను–నేటిదినమున పడిపోయినవాడు ఇశ్రాయేలువారిలో ప్రధానుడనియు పెద్దలలో ఒకడనియు మీకు తెలిసేయున్నది.


అల్పులైనవారు వట్టి ఊపిరియై యున్నారు. ఘనులైనవారు మాయస్వరూపులు త్రాసులో వారందరు తేలిపోవుదురు వట్టి ఊపిరికన్న అలకనగా ఉన్నారు


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ