Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 సమూయేలు 23:8 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

8 దావీదు అనుచరులలో బలాఢ్యులెవరనగా యోషే బెష్షెబెతను ముఖ్యుడగు తక్మోనీయుడు; అతడు ఒక యుద్ధములో ఎనిమిది వందలమందిని హతము చేసెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 దావీదు యోధుల పేర్లు ఇవి: ముఖ్య వీరుల్లో మొదటివాడు యోషే బెష్షెబెతు. ఇతడు తక్మోనీ వంశం వాడు. అతడు ఒక యుద్ధంలో ఎనిమిది వందల మందిని హతం చేశాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

8 దావీదు సైన్యంలో ప్రముఖుల పేర్లు ఇలా వున్నాయి: తక్మోనీయుడగు యోషేబెష్షెబెతు ముగ్గురు యోధుల అధిపతి. ఎస్నీయుడైన అదీనా అని కూడ ఇతడు పిలవబడేవాడు. యోషేబెష్షెబెతు ఒక్క యుద్ధంలోనే ఎనిమిది వందల మందిని చంపివేశాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

8 దావీదు దగ్గర ఉన్న పరాక్రమ యోధుల పేర్లు ఇవే: తక్మోనీయుడైన యోషేబ్-బష్షెబెతు ముగ్గురిలో మొదటివాడు. అతడు ఒకే యుద్ధంలో తన ఈటెతో ఎనిమిదివందల మందిని చంపాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

8 దావీదు దగ్గర ఉన్న పరాక్రమ యోధుల పేర్లు ఇవే: తక్మోనీయుడైన యోషేబ్-బష్షెబెతు ముగ్గురిలో మొదటివాడు. అతడు ఒకే యుద్ధంలో తన ఈటెతో ఎనిమిదివందల మందిని చంపాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 సమూయేలు 23:8
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

దావీదు ఈ సంగతి విని, యోవాబును శూరుల దండంతటిని పంపెను.


యాజకుడైన సాదోకును యెహోయాదా కుమారుడైన బెనాయాను ప్రవక్తయైన నాతానును షిమీయును రేయీయును దావీదుయొక్క శూరులును అదోనీయాతో కలిసికొనక యుండిరి.


ఇశ్రాయేలీయులకు యెహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును పట్టాభిషేకము చేయుటకై అతని రాజ్యమునందు అతనితోను ఇశ్రాయేలీయులందరితోను కూడి సహాయముచేసిన దావీదునొద్దనున్న పరాక్రమశాలులైన వారిలో ప్రధానులు వీరు.


జనసంఖ్యనుబట్టి ఇశ్రాయేలీయుల పితరుల యింటిపెద్దలు సహస్రాధిపతులు శతాధిపతులు అనువారి లెక్కనుగూర్చినది, అనగా ఏర్పాటైన వంతుల విషయములో ఏటేట నెలవంతున రాజునకు సేవచేసినవారిని గూర్చినది. వీరి సంఖ్య యిరువది నాలుగు వేలు.


మొదటి నెలను మొదటి భాగముమీద జబ్దీయేలు కుమారుడైన యాషాబాము అధిపతిగా ఉండెను; వాని భాగములో ఇరువది నాలుగు వేలమంది యుండిరి.


దావీదు పినతండ్రియైన యోనాతాను వివేకముగల ఆలోచనకర్తయైయుండెను గనుక అతడు శాస్త్రిగా నియమింపబడెను, హక్మోనీ కుమారుడైన యెహీయేలు రాజు కుమారులయొద్ద ఉండుటకు నియమింపబడెను.


అతడు గాడిదయొక్క పచ్చి దవడ యెముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దానిచేత వెయ్యిమంది మనుష్యులను చంపెను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ