Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 సమూయేలు 2:14 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

14 అబ్నేరు లేచి–మన యెదుట యౌవనులు మల్లచేష్టలు చేయుదురా అని యోవాబుతో అనగా యోవాబు–వారు చేయవచ్చుననెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

14 అబ్నేరు “మన యువకులను ముందు ఒకరితో ఒకరు పోరాటం చేయిద్దామా?” అని యోవాబుతో అన్నాడు. యోవాబు “అలాగే చేద్దాం” అన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

14 యోవాబుతో అబ్నేరు, “మన ఇరుపక్షాల యువకులనూ ప్రోత్సహించి వారి మధ్య బలప్రదర్శన ఇక్కడ జరుపుదాము” అన్నాడు. పోటీ నిర్వహించటానికి యోవాబు ఒప్పుకున్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

14 అప్పుడు అబ్నేరు యోవాబుతో, “కొంతమంది సైనికులు మన ముందుకు వచ్చి మల్లయుద్ధం చేస్తారు” అని అన్నాడు. అందుకు యోవాబు, “సరే, చేయనిద్దాం” అన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

14 అప్పుడు అబ్నేరు యోవాబుతో, “కొంతమంది సైనికులు మన ముందుకు వచ్చి మల్లయుద్ధం చేస్తారు” అని అన్నాడు. అందుకు యోవాబు, “సరే, చేయనిద్దాం” అన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 సమూయేలు 2:14
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

లెక్కకు సరిగా సౌలు కుమారుడగు ఇష్బోషెతు సంబంధులైన పన్నిద్దరు మంది బెన్యామీనీయులును దావీదు సేవకులలో పన్నిద్దరు మందియును లేచి మధ్య నిలిచిరి.


ఒక్కొక్కడు తన దగ్గరనున్న వాని తల పట్టుకొని వాని ప్రక్కను కత్తితో పొడువగా అందరు తటాలున పడిరి. అందువలన హెల్కత్హన్సూరీమని ఆ స్థలమునకు పేరు పెట్టబడెను. అది గిబియోనునకు సమీపము.


తరువాత ఆ దినమున ఘోరయుద్ధము జరుగగా అబ్నేరును ఇశ్రాయేలువారును దావీదు సేవకుల యెదుట నిలువలేక పారిపోయిరి.


అంతట అమజ్యా ఇశ్రాయేలురాజైన యెహూకు పుట్టిన యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు నొద్దకు దూతలను పంపి–మనము ఒకరి నొకరము దర్శించునట్లు నన్ను కలియ రమ్మని వర్తమానముచేయగా


చెడుపనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా నున్నది వివేకికి జ్ఞానపరిశ్రమ చేయుట అట్టిదే.


కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట వివాదము అధికము కాకమునుపే దాని విడిచిపెట్టుము.


ఉద్దేశములు ఆలోచనచేత స్థిరపరచబడును వివేకముగల నాయకుడవై యుద్ధము చేయుము.


ఆలోచన లేక వ్యాజ్యెమాడుటకు పోకుము నీ పొరుగువాడు నిన్ను అవమానపరచి–దాని అంత మున ఇక నీవేమి చేయుదువని నీతో అనునేమో.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ