Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 సమూయేలు 2:1 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 ఇది జరిగిన తరువాత–యూదా పట్టణములలోనికి నేను పోదునా అని దావీదు యెహోవాయొద్ద విచారణ చేయగా–పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. –నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా–హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 కొంతకాలం తరువాత దావీదు “నేను యూదా పట్టణాల్లో ప్రవేశించ వచ్చా?” అని యెహోవా దగ్గర విచారణ చేశాడు. “వెళ్ళు” అని యెహోవా అతనితో చెప్పాడు. “ఏ పట్టణానికి వెళ్ళమంటావు?” అని దావీదు అడిగాడు. “హెబ్రోనుకు వెళ్ళు” అని ఆయన చెప్పాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

1 దావీదు యెహోవాకు ప్రార్థన చేసి, “నేను యూదా రాజ్యంలో ఏ నగరానికైనా వెళ్లనా?” అని అడిగాడు. “వెళ్లు” అన్నాడు యెహోవా. “ఎక్కడికి వెళ్లను?” అని దావీదు అడిగితే, “హెబ్రోనుకు” అని యెహోవా సమాధానమిచ్చాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 కొంతకాలం తర్వాత దావీదు యెహోవా దగ్గర విచారణ చేసి, “యూదా పట్టణాలకు నేను వెళ్ల వచ్చా?” అని అడిగాడు. అందుకు యెహోవా, “వెళ్లు” అని చెప్పారు. “ఎక్కడికి వెళ్లాలి?” అని దావీదు అడిగాడు. అందుకు యెహోవా, “హెబ్రోనుకు వెళ్లు” అని చెప్పారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 కొంతకాలం తర్వాత దావీదు యెహోవా దగ్గర విచారణ చేసి, “యూదా పట్టణాలకు నేను వెళ్ల వచ్చా?” అని అడిగాడు. అందుకు యెహోవా, “వెళ్లు” అని చెప్పారు. “ఎక్కడికి వెళ్లాలి?” అని దావీదు అడిగాడు. అందుకు యెహోవా, “హెబ్రోనుకు వెళ్లు” అని చెప్పారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 సమూయేలు 2:1
26 ပူးပေါင်းရင်းမြစ်များ  

అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రేదగ్గరనున్న సింధూరవృక్షవనములోదిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను.


యాకోబు వారిని చూచి–ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహన యీము అను పేరు పెట్టెను.


నాలుగు సంవత్సరములు జరిగినమీదట అబ్షాలోము రాజునొద్దకు వచ్చి–నీ దాసుడనైన నేను సిరియ దేశము నందలి గెషూరునందుండగా–యెహోవా నన్ను యెరూషలేమునకు తిరిగి రప్పించినయెడల నేను ఆయనను సేవించె దనని మ్రొక్కు కొంటిని గనుక, నేను హెబ్రోనునకు పోయి యెహోవాకు నేను మ్రొక్కుకొనిన మ్రొక్కు బడి తీర్చుకొనుటకు నాకు సెలవిమ్మని మనవిచేయగా


దావీదు హెబ్రోనులో యూదావారిమీద ఏలినకాల మంతయు ఏడు సంవత్సరముల ఆరు మాసములు.


దావీదు–నేను ఫిలిష్తీయుల కెదురుగా పోయెదనా? వారిని నా చేతికప్పగింతువా? అని యెహోవా యొద్ద విచారించినప్పుడు–పొమ్ము, నిస్సందేహముగా వారిని నీ చేతికప్పగించుదునని యెహోవా సెలవిచ్చెను.


దావీదు యెహోవాయొద్ద విచారణ చేసెను.


దావీదు ఇశ్రాయేలీయులను ఏలిన కాలము నలువది సంవత్సరములు, హెబ్రోనులో అతడు ఏడు సంవత్సరములును యెరూషలేములో ముప్పది మూడు సంవత్సరములును ఏలెను.


మనః పూర్వకముగా దేవుని మందిరపుపనికి పదివేల మణుగుల బంగారమును ఇరువదివేల మణుగుల బంగారపు ద్రాములను ఇరువదివేల మణుగుల వెండిని ముప్పదియారువేల మణుగుల యిత్తడిని రెండులక్షల మణుగుల యినుమును ఇచ్చిరి.


జొర్యా, అయ్యాలోను, హెబ్రోను అను యూదా బెన్యామీను ప్రదేశములందుండు ప్రాకారపురములను కట్టించి


నీయందు నేను నమ్మిక యుంచియున్నాను ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము నీవైపు నా మనస్సు నే నెత్తికొనుచున్నాను. నేను నడువవలసిన మార్గము నాకు తెలియజేయుము.


యెహోవాయొద్ద ఒక్క వరము అడిగితిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆల యములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవామందిర ములో నివసింప గోరుచున్నాను.


ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా–ఇశ్రాయేలీయులకు నేను ఈలాగుచేయు విషయములో వారిని నాయొద్ద విచారణచేయనిత్తును, గొఱ్ఱెలు విస్తరించునట్లుగా నేను వారిని విస్తరింపజేసెదను.


వారు దక్షిణదిక్కున ప్రయాణముచేసి హెబ్రోనుకు వచ్చిరి. అక్కడ అనాకీయులగు అహీమాను షేషయి తల్మయి అను వారుండిరి. ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయనుకంటె ఏడేండ్లు ముందుగా కట్టబడెను.


యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలువగా అతడు యెహోవా సన్నిధిని ఊరీము తీర్పువలన అతనికొరకు విచారింపవలెను. అతడును అతనితోకూడ ఇశ్రాయేలీయులందరును, అనగా సర్వసమా జము అతని మాటచొప్పున తమ సమస్త కార్యములను జరుపుచుండవలెను.


యెహోవా యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞచొప్పున యూదా వంశస్థులమధ్యను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతును, అనగా అనాకీయుల వంశకర్తయైన అర్బాయొక్క పట్టణమును ఇచ్చెను, అది హెబ్రోను.


యెహోషువ మృతినొందిన తరువాత ఇశ్రాయేలీయులు–కనానీయులతో యుద్ధము చేయుటకు తమలో నెవరు ముందుగా వారి మీదికి పోవలసినది యెహోవా తెలియజేయునట్లు ప్రార్థనచేయగా


కావునవారు–ఇక్కడికి ఇంకొక మనుష్యుడు రావలసియున్నదా అని యెహోవాయొద్ద విచారణచేయగా యెహోవా–ఇదిగో అతడు సామానులో దాగియున్నాడని సెలవిచ్చెను.


అంతట దావీదు–నేను వెళ్లి యీ ఫిలిష్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణచేయగా యెహోవా–నీవు వెళ్లి ఫిలిష్తీయులను హతముచేసి కెయీలాను రక్షించుమని దావీదునకు సెలవిచ్చెను.


దావీదు మరల యెహోవాయొద్ద విచారణ చేసెను–నీవు లేచి కెయీలాకు వెళ్లుము, ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవియ్యగా


హెబ్రోనులోను దావీదును అతని జనులును సంచరించిన స్థలములన్నిటిలోను ఉన్న పెద్దలకు దావీదు పంపించెను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ