2 సమూయేలు 19:43 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)43 అందుకు ఇశ్రాయేలు వారు–రాజులో మాకు పది భాగములున్నవి; మీకంటె మేము దావీదునందు అధిక స్వాతంత్యము గలవారము; రాజును తోడుకొని వచ్చుటనుగురించి మీతో ముందుగా మాటలాడినవారము మేమే గదా మీరు మమ్మును నిర్లక్ష్యము చేసితిరేమి? అని యూదా వారితో పలికిరి. యూదావారి మాటలు ఇశ్రాయేలు వారి మాటలకంటె కఠినముగా ఉండెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201943 ఇశ్రాయేలువారు “రాజులో మాకు పది వంతులు ఉన్నాయి. దావీదులో మీకంటే మాకే ఎక్కువ హక్కు ఉంది. మీరు మమ్మల్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? రాజును తీసుకువచ్చే విషయం గురించి మీతో ముందుగా మాట్లాడినది మేమే గదా” అని యూదావారితో అన్నారు. యూదావారు ఇశ్రాయేలువారి కంటే కఠినంగా మాట్లాడారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్43 అప్పుడు ఇశ్రాయేలీయులు ఇలా అన్నారు “రాజును ఎంపిక చేసుకోవటంలో మేము అత్యధిక సంఖ్యలో పాల్గొన్నాము. దావీదులో మాకు పది భాగాలున్నాయి. కావున దావీదుతో వ్యవహారానికి మీకంటె మాకే ఎక్కువ హక్కు వుంది! కాని మీరు మమ్మల్ని లక్ష్యపెట్టలేదు! ఎందువల్ల? నిజానికి రాజును తిరిగి తీసుకొని రావాలని మేము ముందుగా అనుకున్నాము!” కాని యూదా ప్రజలు ఇశ్రాయేలీయులతో బాగా నిందారోపణ చేస్తూ చెడుగా మాట్లాడారు. యూదా వారి మాటలు ఇశ్రాయేలీయులు అన్నవాటికంటె చాలా తీవ్రంగా వున్నాయి. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం43 అప్పుడు ఇశ్రాయేలీయులు, “రాజులో మాకు పది భాగాలు ఉన్నాయి. కాబట్టి దావీదు మీద మీకంటే మాకే ఎక్కువ హక్కు ఉంది. రాజును తిరిగి తీసుకురావడం గురించి మొదట మాట్లాడింది మేమే గదా! మరి మమ్మల్నెందుకు మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు?” అని యూదా వారితో అన్నారు. అయితే యూదా వారి మాటలు ఇశ్రాయేలువారి మాటలకంటే కఠినంగా ఉన్నాయి. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం43 అప్పుడు ఇశ్రాయేలీయులు, “రాజులో మాకు పది భాగాలు ఉన్నాయి. కాబట్టి దావీదు మీద మీకంటే మాకే ఎక్కువ హక్కు ఉంది. రాజును తిరిగి తీసుకురావడం గురించి మొదట మాట్లాడింది మేమే గదా! మరి మమ్మల్నెందుకు మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు?” అని యూదా వారితో అన్నారు. అయితే యూదా వారి మాటలు ఇశ్రాయేలువారి మాటలకంటే కఠినంగా ఉన్నాయి. အခန်းကိုကြည့်ပါ။ |
కాబట్టి ఇశ్రాయేలువారందరును రాజు తమ విన్నపమును వినలేదని తెలిసికొని రాజుకీలాగు ప్రత్యుత్తరమిచ్చిరి– దావీదులో మాకు భాగమేది? యెష్షయి కుమారునియందు మాకు స్వాస్థ్యము లేదు; ఇశ్రాయేలువారలారా, మీమీ గుడారములకు పోవుడి; దావీదు సంతతివారలారా, మీ వారిని మీరే చూచుకొనుడి అని చెప్పి ఇశ్రాయేలువారు తమ గుడారములకు వెళ్లిపోయిరి.
అప్పుడు యెరుబ్బయలు డెబ్బదిమంది కుమారులకు చేయబడిన ద్రోహఫలము వారిని చంపిన అబీమెలెకను వారి సహోదరుని మీదికిని, అతడు తన సహోదరులను చంపునట్లు అతనిచేతులను బలపరచిన షెకెము యజమానులమీదికిని వచ్చునట్లును, వారు చేసిన ప్రాణహత్య వారిమీద వచ్చునట్లును, దేవుడు అబీమెలెకునకును షెకెము యజమానులకును వైరము కలుగుటకై వారి మీదికి దురాత్మను పంపెను. అప్పుడు షెకెము యజమా నులు అబీమెలెకును వంచించిరి.