2 సమూయేలు 18:18 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 తన పేరు నిలుపుటకు తనకు కుమారులు లేరనుకొని, అబ్షాలోము తాను బ్రదికియుండగా ఒక స్తంభము తెచ్చి దానిని రాజు లోయలో తన పేరట నిలువబెట్టి, అతడు ఆ స్తంభమునకు తన పేరు పెట్టియుండెను. నేటివరకు అబ్షాలోము స్తంభమని దానికి పేరు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 అబ్షాలోము జీవించి ఉన్నప్పుడు తన పేరు నిలబెట్టడానికి తనకు కొడుకులు లేరు గనక అతడు బ్రదికి ఉన్నప్పుడే ఒక స్తంభం తెచ్చి దాన్ని తన పేరట నిలబెట్టి ఆ స్తంభానికి అతని పేరు పెట్టాడు. ఇప్పటికీ అది అబ్షాలోము స్తంభం అని పిలువబడుతూ ఉంది. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్18 అబ్షాలోము బ్రతికివున్న రోజుల్లో రాజు లోయలో, ఒక స్తంభం నిర్మించాడు. అప్పుడు అబ్షాలోము ఇలా అన్నాడు: “నా పేరు చిరస్థాయిగా నిలవటానికి నాకు కుమారుడు లేడు” అందువల్ల ఆ స్తంభానికి తన పేరే పెట్టుకున్నాడు. ఆ స్తంభం ఈనాటికీ “అబ్షాలోము జ్ఞాపక చిహ్నం” అని పిలవబడుతూవుంది. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 “నా పేరును కొనసాగించడానికి నాకు కుమారుడు లేడు” అని ఆలోచించిన అబ్షాలోము తాను బ్రతికి ఉన్నప్పుడే ఒక స్తంభం తీసుకెళ్లి తన పేరిట రాజుల లోయలో నిలబెట్టి, ఆ స్తంభానికి తన పేరు పెట్టుకున్నాడు, అది నేటి వరకు అబ్షాలోము స్థూపం అని పిలువబడుతుంది. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 “నా పేరును కొనసాగించడానికి నాకు కుమారుడు లేడు” అని ఆలోచించిన అబ్షాలోము తాను బ్రతికి ఉన్నప్పుడే ఒక స్తంభం తీసుకెళ్లి తన పేరిట రాజుల లోయలో నిలబెట్టి, ఆ స్తంభానికి తన పేరు పెట్టుకున్నాడు, అది నేటి వరకు అబ్షాలోము స్థూపం అని పిలువబడుతుంది. အခန်းကိုကြည့်ပါ။ |