Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 సమూయేలు 16:8 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

8 ఛీపో, ఛీపో, –నీవేలవలెనని నీవు వెళ్లగొట్టిన సౌలు ఇంటివారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి, యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించియున్నాడు; నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి యున్నావని చెప్పి రాజును శపింపగా

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 రాజైన దావీదు ఇరుపక్కలా ప్రజలు, బలాఢ్యులైన వారంతా ఉన్నప్పటికీ అతడు దావీదు మీదా, అతని సేవకుల మీదా రాళ్లు రువ్వాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

8 “యెహోవా నిన్ను శిక్షిస్తాడు! ఎందువలననగా నీవు సౌలు కుటుంబంలోని మనుష్యులను చంపావు! రాజైన సౌలు స్థానాన్ని నీవు సంగ్రహించావు! కాని యెహోవా ఇప్పుడు రాజ్యాన్ని నీ కుమారుడైన అబ్షాలోముకు ఇచ్చాడు! నీవు చేసిన చెడు కార్యాలన్నీ ఇప్పుడు నీకే జరుగుతున్నాయి! ఎందువల్లననగా నీవొక హంతకుడవు!”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

8 నీవు ఎవరి స్థానంలో పరిపాలించావో, ఆ సౌలు ఇంటివారి రక్తాన్ని నీవు చిందించినందుకు యెహోవా నీకు ప్రతిఫలమిచ్చారు. యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యాన్ని అప్పగించారు. నీవు హంతకుడివి కాబట్టే నీవు పతనానికి దగ్గరలో ఉన్నావు” అని దూషించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

8 నీవు ఎవరి స్థానంలో పరిపాలించావో, ఆ సౌలు ఇంటివారి రక్తాన్ని నీవు చిందించినందుకు యెహోవా నీకు ప్రతిఫలమిచ్చారు. యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యాన్ని అప్పగించారు. నీవు హంతకుడివి కాబట్టే నీవు పతనానికి దగ్గరలో ఉన్నావు” అని దూషించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 సమూయేలు 16:8
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

–నా యేలినవాడా, నేను చేసిన ద్రోహము నామీద మోప కుము; నా యేలినవాడవును రాజవునగు నీవు యెరూషలేమును విడిచిన వేళ నీ దాసుడనగు నేను మూర్ఖించి చేసిన దోషమును జ్ఞాపకమందుంచకుము, మనస్సునందుంచు కొనకుము.


అంతట సెరూయా కుమారుడగు అబీషై–యెహోవా అభిషేకించినవానిని శపించిన యీ షిమీ మరణమునకు పాత్రుడు కాడా అని యనగా


దావీదు కాలమున మూడు సంవత్సరములు విడువకుండ కరవుకలుగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఈలాగున సెలవిచ్చెను–సౌలు గిబియోనీయులను హతముచేసెను గనుక అతనినిబట్టియు, నరహంతకులగు అతని యింటివారినిబట్టియు శిక్షగా ఈ కరవు కలిగెను.


వారు ఈ యేడుగురిని తీసికొనిపోయి కొండమీద యెహోవా సన్నిధిని ఉరితీసిరి. ఆ యేడుగురు ఏకరీతినే చంపబడిరి; కోతకాలమున యవలకోత యారంభమందువారు మరణమైరి.


మరియు బెన్యామీనీయుడైన గెరా కుమారుడును బహూరీము ఊరివాడునైన షిమీ నీయొద్ద నున్నాడు; నేను మహనయీమునకు వెళ్లుచుండగా అతడు నన్ను శపించెను. నన్ను ఎదుర్కొనుటకై అతడు యొర్దాను నదియొద్దకు దిగి రాగా–యెహోవాతోడు కత్తి చేత నేను నిన్ను చంపనని ప్రమాణము చేసితిని.


–దేవుని వలన అతనికి రక్షణ యేమియు దొరకదని నన్నుగూర్చి చెప్పువారు అనేకులు (సెలా.)


నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమాన ముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైనదానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైనవాటిని వెదకెదరు?


నాచేత పాపము జరిగినయెడల నాతో సమాధానముగా నుండినవానికి నేను కీడు చేసినయెడల


రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వానకోయిలయు దిగకుండునట్లు హేతువులేని శాపము తగులకపోవును.


దీనికి వారు పాత్రులే. నీవు ఈలాగు తీర్పుతీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ