2 సమూయేలు 16:13 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 అంతట దావీదును అతని వారును మార్గమున వెళ్లిపోయిరి. వారు వెళ్లిపోవుచుండగా షిమీ అతని కెదురుగా కొండప్రక్కను పోవుచు అతని మీదికి రాళ్లు విసరుచు ధూళి యెగరగొట్టుచునుండెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 తరువాత దావీదు, అతని మనుషులు బయలుదేరి వెళ్ళిపోయారు. వారు వెళ్తుండగా షిమీ దావీదుకు ఎదురుగా కొండ పక్కనే నడుస్తూ అతని పైకి రాళ్లు రువ్వుతూ, దుమ్మెత్తి పోస్తూ ఉన్నాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్13 కావున దావీదు తన మనుష్యులతో కలిసి తన దారిన వెళ్లిపోయాడు. కాని షిమీ దావీదును అనుసరిస్తూనే ఉన్నాడు. కొండ ప్రక్కగా దారికి ఆవలివైపున నడుస్తూ ఉన్నాడు. దారి పొడవునా షిమీ దావీదును దూషిస్తూనే ఉన్నాడు. అంతేగాకుండా దావీదు మీదకు రాళ్లు రువ్వటం, దుమ్ము జల్లటం కూడ చేస్తూనే వున్నాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 దావీదు, అతని మనుష్యులు తమ దారిన ముందుకు వెళ్తుండగా, షిమీ అతనికి ఎదురుగా కొండ ప్రక్క నుండి వెళ్తూ, దావీదును శపిస్తూ, అతని మీదికి రాళ్లు విసురుతూ, అతని మీద దుమ్మెత్తి పోస్తూ ఉన్నాడు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 దావీదు, అతని మనుష్యులు తమ దారిన ముందుకు వెళ్తుండగా, షిమీ అతనికి ఎదురుగా కొండ ప్రక్క నుండి వెళ్తూ, దావీదును శపిస్తూ, అతని మీదికి రాళ్లు విసురుతూ, అతని మీద దుమ్మెత్తి పోస్తూ ఉన్నాడు. အခန်းကိုကြည့်ပါ။ |