Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 సమూయేలు 15:27 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

27 యాజకుడైన సాదోకుతో ఇట్లనెను–సాదోకూ, నీవు దీర్ఘదర్శివి కావా? శుభమొంది నీవును నీ కుమారుడగు అహిమయస్సు అబ్యాతారునకు పుట్టిన యోనాతాను అను మీ యిద్దరు కుమారులును పట్టణమునకు పోవలెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

27 అతడు యాజకుడైన సాదోకుతో ఇంకా ఇలా చెప్పాడు. “దీర్ఘదర్శివైన సాదోకూ, నీకు మంచి జరుగుతుంది. నువ్వు నీ కొడుకు అహిమయస్సునూ, అబ్యాతారుకు కొడుకు యోనాతానునూ వెంటబెట్టుకుని పట్టణం వెళ్ళు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

27 యాజకుడు సాదోకుతో రాజు ఇంకా ఇలా అన్నాడు: “నీవు దీర్ఘదర్శివి. నగరానికి ప్రశాంతంగా వెళ్లు. నీ కుమారుడైన అహిమయస్సును, అబ్యాతారు కుమారుడైన యోనాతానును నీతో తీసుకొని వెళ్లు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

27 రాజు యాజకుడైన సాదోకుతో, “నీవు దీర్ఘదర్శివి గదా! నీవు నా దీవెనతో సమాధానంగా పట్టణానికి తిరిగి వెళ్లు. నీతో పాటు నీ కుమారుడైన అహిమయస్సును, అబ్యాతారు కుమారుడైన యోనాతానును తీసుకెళ్లు. నీవు అబ్యాతారు మీరిద్దరూ మీ ఇద్దరు కుమారులతో తిరిగి వెళ్లండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

27 రాజు యాజకుడైన సాదోకుతో, “నీవు దీర్ఘదర్శివి గదా! నీవు నా దీవెనతో సమాధానంగా పట్టణానికి తిరిగి వెళ్లు. నీతో పాటు నీ కుమారుడైన అహిమయస్సును, అబ్యాతారు కుమారుడైన యోనాతానును తీసుకెళ్లు. నీవు అబ్యాతారు మీరిద్దరూ మీ ఇద్దరు కుమారులతో తిరిగి వెళ్లండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 సమూయేలు 15:27
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

నీవు పట్టణమునకు తిరిగి పోయి–రాజా, యింతవరకు నీ తండ్రికి నేను సేవచేసినట్లు ఇకను నీకు సేవచేసెదనని అబ్షాలోముతో చెప్పినయెడల నీవు నా పక్షపువాడవై యుండి అహీతోపెలుయొక్క ఆలోచనను చెడగొట్ట గలవు.


సాదోకు కుమారుడైన అహిమయస్సు అబ్యాతారు కుమారుడైన యోనాతాను అనువారి ఇద్దరు కుమారులు అచ్చటనున్నారు. నీకు వినబడినదంతయు వారిచేత నాయొద్దకు వర్తమానము చేయుమని చెప్పి అతనిని పంపివేసెను.


తాము పట్టణముతట్టు వచ్చిన సంగతి తెలియబడక యుండునట్లు యోనాతానును అహిమయస్సును ఏన్‌రోగేలు దగ్గర నిలిచియుండగా పని కత్తె యొకతెవచ్చి, హూషై చెప్పిన సంగతిని వారికి తెలియజేయగా వారు వచ్చి రాజైన దావీదుతో దాని తెలియజెప్పిరి.


సాదోకు కుమారుడైన అహిమయస్సు–నేను పరుగెత్తి కొనిపోయి యెహోవా తన శత్రువులను ఓడించి తనకు న్యాయము తీర్చిన వర్తమానము రాజుతో చెప్పెదననగా


ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను


యాజకుడైన అబ్యాతారు కుమారుడైన యోనాతాను వచ్చెను. అదోనీయా – లోపలికి రమ్ము, నీవు ధైర్యవంతుడవు, నీవు శుభసమాచారములతో వచ్చుచున్నావనగా


నఫ్తాలీ దేశమందు అహిమయస్సు ఉండెను; వీడు సొలొమోను కుమార్తెయైన బాశెమతును వివాహము చేసికొనెను.


వీరందరును దేవుని వాక్కువిషయములో రాజునకు దీర్ఘదర్శియగు హేమానుయొక్క కుమారులు. హేమాను సంతతిని గొప్పచేయుటకై దేవుడు హేమానునకు పదునలుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను అనుగ్రహించి యుండెను.


అహీటూబు సాదోకును కనెను, సాదోకు అహిమయస్సును కనెను,


వాడు–ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒక డున్నాడు, అతడు బహుఘనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మనము వెళ్లవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయునేమో అతని యొద్దకు వెళ్లుదము రండని చెప్పెను.


ఇప్పుడు ప్రవక్తయను పేరు నొందువాడు పూర్వము దీర్ఘదర్శి యనిపించుకొనెను. పూర్వము ఇశ్రాయేలీయులలో దేవునియొద్ద విచారణచేయుటకై ఒకడు బయలుదేరినయెడల–మనము దీర్ఘదర్శకుని యొద్దకు పోవుదము రండని జనులు చెప్పుకొనుట వాడుక.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ