Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 సమూయేలు 15:10 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

10 అబ్షాలోము–మీరు బాకానాదము వినునప్పుడు అబ్షాలోము హెబ్రోనులో ఏలుచున్నాడని కేకలు వేయుడని చెప్పుటకై ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటియొద్దకు వేగుల వారిని పంపెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

10 అబ్షాలోము తన గూఢచారులను పిలిచి “మీరు బూర శబ్దం విన్నప్పుడు, ‘అబ్షాలోము హెబ్రోనులో పరిపాలిస్తున్నాడు’ అని కేకలు వేయాలని అన్ని ఇశ్రాయేలీయుల గోత్రాల వారిని సిద్ధపరచండి” అని చెప్పి పంపించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

10 కాని అబ్షాలోము వేగుల వారిని ఇశ్రాయేలు వంశాల వారందరి వద్దకు పంపాడు. వారు వెళ్లి ప్రజలలో, “మీరు బాకా నాదం విన్నప్పుడు అబ్షాలోము హెబ్రోనులో రాజయ్యాడు.!” అని కేకలు పెట్టమన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

10 అబ్షాలోము, “మీరు బూరల ధ్వని వినగానే, ‘హెబ్రోనులో అబ్షాలోము రాజు’ అని కేకలు వేయండి” అని చెప్పడానికి ఇశ్రాయేలీయుల గోత్రాలన్నిటికి రహస్యంగా దూతలను పంపాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

10 అబ్షాలోము, “మీరు బూరల ధ్వని వినగానే, ‘హెబ్రోనులో అబ్షాలోము రాజు’ అని కేకలు వేయండి” అని చెప్పడానికి ఇశ్రాయేలీయుల గోత్రాలన్నిటికి రహస్యంగా దూతలను పంపాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 సమూయేలు 15:10
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

అంతలో అబ్షాలోము తన పనివారిని పిలిచి, అమ్నోను ద్రాక్షారసమువలన సంతోషియై యుండుట మీరు కనిపెట్టియుండి అమ్నోనును హతము చేయుడని నేను మీతో చెప్పునప్పుడు భయపడక అతని చంపుడి, నేను గదా మీకు ఆజ్ఞ ఇచ్చియున్నాను, ధైర్యము తెచ్చుకొని పౌరుషము చూపుడి అని గట్టిగా ఆజ్ఞ ఇచ్చెను.


అబ్షాలోము తన పనివారిని పిలిచి–యోవాబు పొలము నా పొలముదగ్గర నున్నది గదా, దానిలో యవల చేలు ఉన్నవి; మీరు పోయి వాటిని తగులబెట్టుడని వారితో చెప్పెను. అబ్షాలోము పనివారు ఆ చేలు తగుల బెట్టగా


రాజు–సుఖముగా పొమ్మని సెలవిచ్చెను గనుక అతడు లేచి హెబ్రోనునకు పోయెను.


మనమీద మనము రాజుగా పట్టాభిషేకము చేసిన అబ్షాలోము యుద్ధమందు మరణమాయెను. కాబట్టి మనము రాజును మరల తోడుకొని వచ్చుటనుగూర్చి ఏల మాట్లాడక పోతిమి?


ఇది జరిగిన తరువాత–యూదా పట్టణములలోనికి నేను పోదునా అని దావీదు యెహోవాయొద్ద విచారణ చేయగా–పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. –నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా–హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను.


దావీదు హెబ్రోనులో యూదావారిమీద ఏలినకాల మంతయు ఏడు సంవత్సరముల ఆరు మాసములు.


హెబ్రోనులో అతడు యూదా వారందరిమీద ఏడు సంవత్సరముల ఆరు మాసములు, యెరూషలేములో ఇశ్రాయేలు యూదాల వారందరిమీద ముప్పదిమూడు సంవత్సరములు పరిపాలన చేసెను.


అప్పుడు నాతాను సొలొమోను తల్లియైన బత్షెబతో చెప్పిన దేమనగా–హగ్గీతు కుమారుడైన అదోనీయా యేలుచున్న సంగతి నీకు వినబడలేదా? అయితే ఈ సంగతి మన యేలినవాడైన దావీదునకు తెలియకయే యున్నది.


యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును అక్కడ ఇశ్రాయేలీయులమీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిన తరువాత మీరు బాకానాదము చేసి – రాజైన సొలొమోను చిరంజీవి యగునుగాక అని ప్రకటన చేయవలెను.


అంతట వారు అతివేగిరముగా తమతమ వస్త్రములను పట్టుకొని మెట్లమీద అతని క్రింద పరచి బాకా ఊదించి–యెహూ రాజైయున్నాడని చాటించిరి.


ఇశ్రాయేలీయుల పెద్దలందరును హెబ్రోనులోనున్న రాజు నొద్దకురాగా దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధనచేసెను; అప్పుడు వారు సమూయేలుద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును ఇశ్రాయేలీయులమీద రాజుగా అభిషేకము చేసిరి.


యెహోవా నోటిమాట ప్రకారము సౌలుయొక్క రాజ్యమును దావీదుతట్టు త్రిప్పవలెనన్న ప్రయత్నముతో యుద్ధమునకై ఆయుధములను ధరించి అతనియొద్దకు హెబ్రోనునకు వచ్చిన అధిపతుల లెక్కయెంతయనగా


ఇశ్రాయేలులో కడమ వారందరును ఏకమనస్కులై దావీదును రాజుగా నియమింపవలెనని కోరియుండిరి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ