2 పేతురు 3:9 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమునుగూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల దీర్ఘశాంతముగలవాడై యున్నాడు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 కొంతమంది అనుకుంటున్నట్టు ప్రభువు తాను చేసిన వాగ్దానాల విషయంలో ఆలస్యం చేసేవాడు కాదు గానీ అందరూ మారిన మనసుతో తిరిగి రావాలనీ, ఎవ్వరూ నశించ కూడదనీ కోరుతూ మీ పట్ల చాలా ఓర్పుతో ఉన్నాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్9 ప్రభువు ఆలస్యం చేస్తున్నాడని కొందరు అనుకుంటారు. కాని, ఆయన తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవటంలో ఆలస్యం చెయ్యడు. ఎవ్వరూ నాశనం కాకూడదని, అందరూ మారుమనస్సు పొందాలని ఆయన ఉద్దేశ్యం. అందుకే ఆయన మీపట్ల సహనం వహిస్తున్నాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 కొందరు అనుకుంటున్నట్లు ప్రభువు తన వాగ్దానాన్ని నెరవేర్చడంలో ఆలస్యం చేసేవాడు కాడు. ఎవరు నశించకూడదని, అందరు మారుమనస్సు పొందాలని మీ కోసం ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 కొందరు అనుకుంటున్నట్లు ప్రభువు తన వాగ్దానాన్ని నెరవేర్చడంలో ఆలస్యం చేసేవాడు కాడు. ఎవరు నశించకూడదని, అందరు మారుమనస్సు పొందాలని మీ కోసం ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము9 కొందరు అనుకుంటున్నట్లు ప్రభువు తన వాగ్దానాన్ని నెరవేర్చడంలో ఆలస్యం చేసేవాడు కాడు. ఎవరు నశించకూడదని, అందరూ మారుమనస్సు పొందాలని మీ కొరకు ఆయన దీర్ఘశాంతం కలిగివున్నాడు. အခန်းကိုကြည့်ပါ။ |
కాగా వారితో ఇట్లనుము–నా జీవముతోడు దుర్మార్గుడు మరణము నొందుటవలన నాకు సంతోషము లేదు; దుర్మార్గుడు తన దుర్మార్గతనుండి మరలి బ్రదుకుటవలన నాకు సంతో షము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మనస్సు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గతనుండి మరలి మనస్సు త్రిప్పు కొనుడి, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.