Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 సమూయేలు 26:15 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

15 అందుకు దావీదు–నీవు మగవాడవు కావా? ఇశ్రాయేలీయులలో నీ వంటివాడెవడు? నీకు యజమానుడగు రాజునకు నీ వెందుకు కాపు కాయక పోతివి? నీకు యజమానుడగు రాజును సంహరించుటకు జనులలో ఒకడు చేరువకు వచ్చెనే;

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

15 అప్పుడు దావీదు “నీకు ధైర్యం లేదా? ఇశ్రాయేలీయుల్లో నీలాంటి వాడు ఎవరు? నీకు యజమాని అయిన రాజుకు నువ్వెందుకు కాపలా కాయలేకపోయావు? నీకు యజమాని అయిన రాజును చంపడానికి ఒకడు దగ్గరగా వచ్చాడే.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

15 అందుకు దావీదు, “నీవు మగాడివి కదూ! నీవు ఇశ్రాయేలు అంతటిలో చాలా గొప్పవాడివి కదూ! నిజమేనంటావా? అయితే నీవు నీ యజమానుడైన రాజును ఎందుకు కాపాడుకోలేదు? నీ యాజమానియైన రాజును చంపటానికి ఒక సామాన్యుడు నీ గుడారంలోనికి వచ్చాడు!

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

15 అందుకు దావీదు, “అబ్నేరూ, నీవు మగాడివి కావా? ఇశ్రాయేలీయులలో నీలాంటి వారెవరు? నీ ప్రభువైన రాజుకు నీవెందుకు కాపలా కాయలేదు? నీ ప్రభువైన రాజును చంపడానికి ఒకడు దగ్గరకు వచ్చాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

15 అందుకు దావీదు, “అబ్నేరూ, నీవు మగాడివి కావా? ఇశ్రాయేలీయులలో నీలాంటి వారెవరు? నీ ప్రభువైన రాజుకు నీవెందుకు కాపలా కాయలేదు? నీ ప్రభువైన రాజును చంపడానికి ఒకడు దగ్గరకు వచ్చాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 సమూయేలు 26:15
5 ပူးပေါင်းရင်းမြစ်များ  

పిమ్మట రాజు తన సేవకులను పిలిచి వారితో ఈలాగు సెలవిచ్చెను–నేటిదినమున పడిపోయినవాడు ఇశ్రాయేలువారిలో ప్రధానుడనియు పెద్దలలో ఒకడనియు మీకు తెలిసేయున్నది.


అందుకు బెల్తెషాజరను దానియేలు ఒక గంటసేపు అతి విస్మయమునొంది మనస్సునందు కలవరపడగా, రాజు–బెల్తెషాజరూ, యీ దర్శనమువలన గాని దాని భావము వలన గాని నీవు కలవరపడకుము అనెను. అంతట బెల్తె షాజరు–నా యేలినవాడా, యీ దర్శనఫలము తమరిని ద్వేషించు వారికి కలుగునుగాక, దాని భావము తమరి శత్రువులకు చెందునుగాక,


ఆయన మరల శిష్యులయొద్దకు వచ్చి, వారు నిద్రించుట చూచి ఒక గడియయైనను నాతోకూడ మేల్కొనియుండలేరా?


జనులును నేరు కుమారుడైన అబ్నేరును వినునట్లు–అబ్నేరూ, నీవు మాటలాడవా? అని కేక వేయగా అబ్నేరు కేకలువేసి–రాజును నిద్రలేపు నీవెవడ వని అడిగెను.


నీ ప్రవర్తన అను కూలము కాదు, నీవు శిక్షకు పాత్రుడవే; యెహోవాచేత అభిషేకము నొందిన నీ యేలినవానికి నీవు రక్షకముగా నుండలేదు; యెహోవా జీవముతోడు నీవు మరణశిక్షకు పాత్రుడవు. రాజుయొక్క యీటె యెక్కడ నున్నదో చూడుము, అతని తలగడయొద్దనున్న నీళ్లబుడ్డి యెక్కడ నున్నదో చూడుము అని పలికెను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ