Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 సమూయేలు 18:27 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

27 గడువుదాటకమునుపే లేచి తనవారితో పోయి ఫిలిష్తీయులలో రెండువందలమందిని హతముచేసి వారి ముందోళ్లు తీసికొనివచ్చి రాజునకు అల్లుడగుటకై కావలసిన లెక్క పూర్తిచేసి అప్పగింపగా సౌలు తన కుమార్తెయైన మీకాలును అతనికిచ్చి పెండ్లిచేసెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

27 గడువుకంటే ముందుగానే లేచి తన మనుషులతో వెళ్ళి ఫిలిష్తీయుల్లో 200 మందిని చంపి వారి మర్మాంగ చర్మాలు తీసుకువచ్చి, రాజుకు అల్లుడు అయ్యేందుకు అవసరమైన లెక్క పూర్తిచేసి అప్పగించాడు. సౌలు తన కుమార్తె మీకాలును అతనికిచ్చి పెళ్లి చేశాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

27 దావీదు తన సైనికులతో బయలుదేరి వెళ్లి రెండువందల మంది ఫిలిష్తీయులను చంపి, వారి సున్నతి చర్మాలను తీసుకొని వచ్చి సౌలుకు ఇచ్చాడు. రాజుగారి అల్లుడు కావాలని కోరి దావీదు ఇలా చేసాడు. అప్పుడు సౌలు దావీదును తన కుమార్తె మీకాలును పెండ్లి చేసుకోనిచ్చాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

27 దావీదు తన మనుష్యులను తీసుకెళ్లి రెండువందలమంది ఫిలిష్తీయులను చంపి వారి మర్మాంగ చర్మాలు తీసుకువచ్చాడు. రాజుకు అల్లుడు అవ్వడానికి కావలసిన లెక్క పూర్తి చేసి అప్పగించగా సౌలు తన కుమార్తె మీకాలును అతనికిచ్చి పెళ్ళి చేశాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

27 దావీదు తన మనుష్యులను తీసుకెళ్లి రెండువందలమంది ఫిలిష్తీయులను చంపి వారి మర్మాంగ చర్మాలు తీసుకువచ్చాడు. రాజుకు అల్లుడు అవ్వడానికి కావలసిన లెక్క పూర్తి చేసి అప్పగించగా సౌలు తన కుమార్తె మీకాలును అతనికిచ్చి పెళ్ళి చేశాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 సమూయేలు 18:27
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

అయితే నీవు ఒకపని చేయవలెను; నా దర్శనమునకు వచ్చునప్పుడు సౌలు కుమార్తెయగు మీకాలును నా యొద్దకు తోడుకొని రావలెను; లేదా నీకు దర్శనము దొరకదనెను.


మరియు దావీదు సౌలు కుమారుడగు ఇష్బోషెతునొద్దకు దూతలను పంపి–ఫిలిష్తీయులలో నూరుమంది ముందోళ్లను తెచ్చి నేను పెండ్లి చేసికొనిన మీకాలును నాకప్పగింపుమని చెప్పుడనగా


యెహోవా ఆత్మ అతనిమీదికి మరల రాగా అతడు అష్కెలోనుకు పోయి వారిలో ముప్పదిమందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విప్పుడు కథ భావమును చెప్పినవారికి బట్టలనిచ్చెను.


సౌలునకు పుట్టిన కుమారుల పేర్లు ఏవనగా, యోనాతాను ఇష్వీ మెల్కీషూవ; అతని యిద్దరు కుమార్తెల పేర్లు ఏవనగా పెద్దదానిపేరు మేరబు చిన్న దానిపేరు మీకాలు.


కాబట్టి సౌలు అతని తనయొద్ద నుండనియ్యక సహస్రాధిపతిగా చేసెను; అతడు జనులకు ముందువచ్చుచు పోవుచు నుండెను.


సౌలు –నా చెయ్యి వానిమీద పడకూడదు, ఫిలిష్తీయుల చెయ్యి వానిమీద పడును గాక అనుకొని–దావీదూ, నా పెద్దకుమార్తెయైన మేరబును నీకిత్తును; నీవు నా పట్ల యుద్ధ శాలివై యుండి యెహోవా యుద్ధములను జరిగింపవలెననెను.


యెహోవా దావీదునకు తోడుగా నుండుటయు, తన కుమార్తెయైన మీకాలు అతని ప్రేమించుటయు సౌలు చూచి


సౌలు తన కుమార్తెయైన మీకాలు అను దావీదు భార్యను పల్తీయేలను గల్లీమువాడైన లాయీషు కుమారునికి ఇచ్చి యుండెను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ