22 కాబట్టి యుద్ధదినమందు సౌలునొద్దను యోనాతాను నొద్దను ఉన్నజనులలో ఒకని చేతిలోనైనను కత్తియేగాని యీటెయేగాని లేకపోయెను, సౌలునకును అతని కుమారుడైన యోనాతానునకును మాత్రము అవి యుండెను.
22 అందువల్ల యుద్ధం జరిగే సమయంలో సౌలు, యోనాతానుల దగ్గరున్న వారిలో ఒక్కరి చేతిలో కూడా ఒక కత్తిగానీ, యీటెగానీ లేకుండా పోయింది. సౌలు దగ్గర, అతని కుమారుడు యోనాతాను దగ్గర మాత్రమే అవి ఉన్నాయి.
22 కనుక యుద్ధం రోజున సౌలు వెంట ఉన్న ఇశ్రాయేలు సైనికులు ఎవ్వరి వద్దా (ఇనుప) ఖడ్గాలు, ఈటెలు లేవు. సౌలుకు, అతని కుమారుడు యోనాతానుకు మాత్రమే ఇనుప ఆయుధాలు ఉన్నాయి.
22 కాబట్టి యుద్ధం జరిగే రోజున సౌలుతో యోనాతానుతో ఉన్న ప్రజల్లో ఒకరి చేతిలోనూ కత్తి గాని ఈటె గాని లేదు; కేవలం సౌలుకు అతని కుమారుడైన యోనాతానుకు మాత్రమే ఉన్నాయి.
22 కాబట్టి యుద్ధం జరిగే రోజున సౌలుతో యోనాతానుతో ఉన్న ప్రజల్లో ఒకరి చేతిలోనూ కత్తి గాని ఈటె గాని లేదు; కేవలం సౌలుకు అతని కుమారుడైన యోనాతానుకు మాత్రమే ఉన్నాయి.
అప్పుడతడు నాతో ఇట్లనెను–జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే; శక్తిచేతనైనను బలముచేతనైననుకాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? నీవు చదునుభూమి వగుదువు; –కృప కలుగును గాక కృప కలుగునుగాక అని జనులు కేకలువేయగా అతడు పైరాయి తీసికొని పెట్టించును.