1 సమూయేలు 12:17 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 గోధుమ కోతకాలము ఇదే గదా? మీరు రాజును నిర్ణయింపుమని అడిగినందుచేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలిసికొనుటకై యెహోవా ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయనను వేడుకొనుచున్నాను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 ఇది గోదుమ పంట కోసే కాలం గదా. మీ కోసం రాజును నియమించమని కోరుకోవడం ద్వారా యెహోవా దృష్టిలో మీరు ఘోరమైన తప్పిదం చేశారని మీరు గ్రహించి తెలుసుకొనేలా యెహోవా ఉరుములు, వర్షం పంపాలని నేను ఆయనను వేడుకొంటున్నాను.” အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్17 ఇప్పుడు గోధుమ పంట కోతకు వచ్చింది. ఫెళఫెళమనే ఉరుములు, మెరుపులతో వర్షం కురిపించుమని నేను దేవుని ప్రార్థిస్తాను. అప్పుడు మీరు రాజు కావాలని అడిగి, యెహోవాపట్ల ఎంత పాపం చేశారో మీరే తెలుసుకుంటారు,” అని వివరంగా చెప్పాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 గోధుమ కోతకాలం ఇది కాదా? ఉరుములు వర్షం పంపమని నేను యెహోవాను వేడుకుంటున్నాను. అప్పుడు మీరు రాజును ఏర్పాటు చేయమని అడిగి యెహోవా దృష్టిలో ఎంత పెద్ద పాపం చేశారో మీరు గ్రహిస్తారు.” အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 గోధుమ కోతకాలం ఇది కాదా? ఉరుములు వర్షం పంపమని నేను యెహోవాను వేడుకుంటున్నాను. అప్పుడు మీరు రాజును ఏర్పాటు చేయమని అడిగి యెహోవా దృష్టిలో ఎంత పెద్ద పాపం చేశారో మీరు గ్రహిస్తారు.” အခန်းကိုကြည့်ပါ။ |
యెహోవా ఇశ్రాయేలీయుల యెదుట అమోరీయులను అప్పగించిన దినమున, ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను– సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువులమీద పగతీర్చుకొనువరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను. అను మాట యాషారు గ్రంథములో వ్రాయబడి యున్నది గదా.