Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 దిన 26:4 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

4 దేవుడు ఓబేదెదోమును ఆశీర్వదించి అతనికి కుమారులను దయచేసెను; వారెవరనగా షెమయా జ్యేష్ఠుడు, యెహోజాబాదు రెండవవాడు, యోవాహు మూడవవాడు, శాకారు నాల్గవవాడు, నెత నేలు అయిదవవాడు,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

4 దేవుడు ఓబేదెదోమును ఆశీర్వదించి అతనికి కొడుకులను దయ చేశాడు. వాళ్ళెవరంటే, షెమయా పెద్దవాడు, యెహోజాబాదు రెండోవాడు, యోవాహు మూడోవాడు, శాకారు నాల్గోవాడు, నెతనేలు అయిదోవాడు,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

4 ఓబేదెదోము, అతని కుమారులు. ఓబేదెదోము పెద్ద కుమారుడు షెమయా. యెహోజాబాదు అతని రెండవ కుమారుడు. యోవాహు మూడవవాడు. శాకారు అతని నాల్గవ కుమారుడు. నెతనేలు అయిదవవాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

4 ఓబేద్-ఎదోముకు కూడా కుమారులు ఉన్నారు: షెమయా మొదటివాడు, యెహోజాబాదు రెండవవాడు, యోవాహు మూడవవాడు, శాకారు నాలుగవవాడు, నెతనేలు అయిదవవాడు,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

4 ఓబేద్-ఎదోముకు కూడా కుమారులు ఉన్నారు: షెమయా మొదటివాడు, యెహోజాబాదు రెండవవాడు, యోవాహు మూడవవాడు, శాకారు నాలుగవవాడు, నెతనేలు అయిదవవాడు,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 దిన 26:4
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

యెహోవా మందసమును దావీదు పురములోనికి తనయొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటివరకు తీసికొని అచ్చట ఉంచెను.


యెహోవా మందసము మూడునెలలు గిత్తీయుడగు ఓబేదె దోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటివారినందరిని ఆశీర్వదించెను.


దేవుని మందసము ఉండుటవలన యెహోవా ఓబేదెదోము ఇంటివారిని అతనికి కలిగిన దానినంతటిని ఆశీర్వదించుచున్నాడను సంగతి దావీదునకు వినబడగా, దావీదు పోయి దేవుని మందసమును ఓబేదెదోము ఇంటిలోనుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసికొని వచ్చెను.


దేవుని మందసము ఓబేదెదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద మూడు నెలలుండగా యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను.


వీరితోకూడ రెండవ వరుసగానున్న తమ బంధువులైన జెకర్యా బేను యహజీయేలు షెమీరా మోతు యెహీయేలు ఉన్నీ ఏలీయాబు బెనాయా మయ శేయా మత్తిత్యా ఎలీప్లేహు మిక్నేయాహు లనువారిని ద్వారపాలకులగు ఓబేదెదోమును యెహీయేలును పాటకు లనుగా నియమించిరి.


మరియు మత్తిత్యా ఎలీప్లేహు మిక్నేయాహు ఓబేదెదోము యెహీయేలు అజజ్యాహు అనువారు రాగమెత్తుటకును సితారాలు వాయించుటకును నిర్ణయింపబడిరి.


షెబన్యా యెహోషాపాతు నెతనేలు అమాశై జెకర్యా బెనాయా ఎలీయెజెరు అను యాజకులు దేవుని మందసమునకు ముందు బూరలు ఊదువారుగాను, ఓబేదెదోమును యెహీయాయును వెనుకతట్టు కనిపెట్టువారుగాను నియమింపబడిరి.


యెదూతూను కుమారుడైన ఓబేదెదోమును హోసాను ద్వారపాలకులుగా నియమించెను.


వారిలో ఆసాపు అధిపతి, జెకర్యా అతని తరువాతివాడు, యెహీయేలు షెమీరామోతు యెహీయేలు మత్తిత్యా ఏలీయాబు బెనాయా ఓబేదెదోము యెహీయేలు అనువారు స్వరమండలములను సితారాలను వాయించుటకై నియమింపబడిరి, ఆసాపు తాళములను వాయించువాడు.


ఏలాము అయిదవవాడు, యెహోహనాను ఆరవవాడు, ఎల్యో యేనై యేడవవాడు.


అమ్మీయేలు ఆరవవాడు, ఇశ్శాఖారు ఏడవవాడు, పెయుల్లెతై యెనిమిదవవాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ