1 దిన 17:6 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 నేను ఇశ్రాయేలీయులందరిమధ్యను సంచరించిన కాలమంతయు–మీరు నాకొరకు దేవదారుమ్రానులతో ఆలయము కట్ట కుంటిరేమియని, నా జనమును మేపవలసినదని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులలో ఎవరితోనైనను నేనొక మాటయైన పలికియుంటినా? အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 నేను ఇశ్రాయేలీయులందరి మధ్యలో సంచారం చేసిన కాలంలో, మీరు నాకోసం దేవదారు మానులతో ఆలయం ఎందుకు కట్టలేదు? అని నా ప్రజలను కాయడానికి నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయుల న్యాయాధిపతుల్లో ఎవరితోనైనా నేను ఒక్క మాటైనా అన్నానా? အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 ఇశ్రాయేలీయులందరితో నేను ఎక్కడికి వెళ్లినా, నా ప్రజలను కాయుమని నేను ఆజ్ఞాపించిన వారి నాయకుల్లో ఎవరితోనైనా, “నా కోసం దేవదారు కర్రలతో మందిరాన్ని ఎందుకు కట్టించలేదు” అని అడిగానా?’ အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 ఇశ్రాయేలీయులందరితో నేను ఎక్కడికి వెళ్లినా, నా ప్రజలను కాయుమని నేను ఆజ్ఞాపించిన వారి నాయకుల్లో ఎవరితోనైనా, “నా కోసం దేవదారు కర్రలతో మందిరాన్ని ఎందుకు కట్టించలేదు” అని అడిగానా?’ အခန်းကိုကြည့်ပါ။ |
దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమిపొందిక? మనము జీవముగల దేవుని ఆలయమై యున్నాము; అందుకు దేవుడీలాగు సెలవిచ్చుచున్నాడు. –నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును వారు నా ప్రజలైయుందురు. –కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైనదానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. –మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులును కుమార్తెలునై యుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు.