Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




తీతుకు 3:3 - తెలుగు సమకాలీన అనువాదము

3 ఒకప్పుడు మనం కూడా అవివేకులుగా, అవిధేయులుగా, మోసపోయిన వారిగా అన్ని రకాల వ్యామోహాలకు సుఖాలకు బానిసలుగా ఉన్నాం. మనం ఓర్వలేనితనంతో, అసూయతో, ద్వేషింపబడుతూ ఒకరిని ఒకరం ద్వేషిస్తూ జీవించాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 ఎందుకనగా మనము కూడమునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానావిధములైన దురాశలకును భోగములకును దాసులమునైయుండి, దుష్టత్వమునందును అసూయయందును కాలముగడుపుచు, అసహ్యులమై యొకని నొకడు ద్వేషించుచు ఉంటిమి గాని

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 ఎందుకంటే మనం కూడా గతంలో బుద్ధిహీనులుగా, అవిధేయులుగా ఉన్నాం. అటు ఇటు చెదరిపోయి నానా విధాలైన విషయ వాంఛలకు బానిసలుగా దుష్టత్వంలో, అసూయతో జీవిస్తూ, అసహ్యులుగా ద్వేషానికి గురి అవుతూ ద్వేషిస్తూ ఉండేవాళ్ళం.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

3 గతంలో మనం కూడా మూర్ఖంగా, అవిధేయంగా ఉంటిమి. తప్పులు చేస్తూ, మానసిక వాంఛలకు, సుఖాలకు లోనై, అసూయతో యితర్ల చెడును కోరుతూ, ద్వేషిస్తూ, ద్వేషింపబడుతూ జీవించాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 ఒకప్పుడు మనం కూడా అవివేకులుగా, అవిధేయులుగా, మోసపోయిన వారిగా అన్ని రకాల వ్యామోహాలకు సుఖాలకు బానిసలుగా ఉన్నాము. మనం ఓర్వలేనితనంతో, అసూయతో, ద్వేషింపబడుతూ ఒకరిని ఒకరం ద్వేషిస్తూ జీవించాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 ఒకప్పుడు మనం కూడా అవివేకులుగా, అవిధేయులుగా, మోసపోయిన వారిగా అన్ని రకాల వ్యామోహాలకు సుఖాలకు బానిసలుగా ఉన్నాము. మనం ఓర్వలేనితనంతో, అసూయతో, ద్వేషింపబడుతూ ఒకరిని ఒకరం ద్వేషిస్తూ జీవించాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




తీతుకు 3:3
37 ပူးပေါင်းရင်းမြစ်များ  

“అతడు, ‘నేను వెళ్లను’ అని జవాబు ఇచ్చాడు కాని తర్వాత మనస్సు మార్చుకొని వెళ్లాడు.


అందుకు ఆయన, “మీరు మోసగించబడకుండ జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే అనేకులు నా పేరిట వచ్చి, ‘నేనే ఆయనను’ మరియు ‘సమయం సమీపించింది’ అని చెప్తారు. వారిని అనుసరించవద్దు.


యేసు వారితో, “పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడే, అని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.


గతంలో దేవునికి అవిధేయులుగా ఉండి, వారి అవిధేయత ఫలితంగా దేవుని కృపను పొందారు.


కనుక మీ శరీర దుష్ట ఆశలకు మీరు లోబడకుండా ఉండడానికి మరణించే మీ శరీరాన్ని పాపాలచే యేలనివ్వకండి.


ఒకప్పుడు మీరు పాపానికి దాసులుగా ఉన్నప్పటికి, మీకు బోధించిన మాదిరికి మీరు హృదయమంతటితో లోబడ్డారు, కనుక అది ఇప్పుడు మీ విధేయతగా చెప్పబడుతుంది కనుక దేవునికి వందనాలు.


అయితే ఇప్పుడు మీరు పాపం నుండి విడుదల పొంది దేవునికి దాసులు అయ్యారు, దాని వలన మీకు కలుగు ప్రయోజనం ఏంటంటే పరిశుద్ధతలోనికి నడిపించబడతారు. దానికి ఫలంగా నిత్యజీవాన్ని పొందుతారు.


మనమింక పాపానికి బానిసలుగా ఉండకుండా పాపం చేత పాలించబడిన శరీరం నశించునట్లు, మన పాత స్వభావం ఆయనతోపాటు సిలువ వేయబడిందని మనకు తెలుసు.


ఎందుకంటే ఒకవేళ నేను వచ్చినపుడు నేను కోరుకున్నట్లుగా మీరు ఉండకపోవచ్చు, అలాగే మీరు కోరుకున్నట్లుగా నేను ఉండకపోవచ్చు. కలహాలు, అసూయలు, క్రోధాలు, స్వార్థపూరిత ఆశయాలు, అపవాదులు, గుసగుసలు, గర్వం, అల్లరులు అక్కడ ఉంటాయని భయపడుతున్నాను.


ఎవరైనా తాము గొప్పవారు కాకపోయినా గొప్పవారమని భావిస్తే వారు తమను తామే మోసపరచుకొంటారు.


ఒకప్పుడు మీరు దేవుని నుండి దూరం అయ్యారు, మీ దుష్ట ప్రవర్తన వలన మీ మనస్సులో విరోధులయ్యారు.


ఒకప్పుడు మీరు వీటి ప్రకారం నడుచుకొని జీవించారు.


అయితే దుష్టులు, వంచకులు ఇతరులను మోసం చేస్తూ తామే మోసపోతూ మరింతగా చెడిపోతారు.


అలాంటివారు, పాపంతో నిండిన అన్ని రకాల దురాశలకు బానిసలైన మోసపూరిత స్త్రీల ఇళ్లలో చొరబడి వారిని లోబరుచుకుంటారు.


వారు దేవుని నమ్ముతున్నామని చెప్తున్నా, తమ పనుల ద్వారా ఆయనను తిరస్కరిస్తారు. వారు హేయమైనవారు, అవిధేయులు, ఏ మంచిని చేయడానికైనా అనర్హులు.


మనం భక్తిహీనతను ఈ లోక కోరికలను తృణీకరించి, దివ్య నిరీక్షణ కొరకు అనగా, మన గొప్ప దేవుడును రక్షకుడైన యేసు క్రీస్తు తన మహిమతో కనబడతాడనే ఆ దివ్య నిరీక్షణ కలిగి ఎదురుచూస్తూ,


తమ నాలుకను అదుపుచేసుకోకుండా తమ హృదయాలను మోసం చేసుకుంటూ ఎవరైనా తాము భక్తిపరులమని భావిస్తే వారి భక్తి విలువలేనిది అవుతుంది.


మీరు విధేయత కలిగిన బిడ్డలు కనుక, అజ్ఞానంలో ఉన్నప్పుడు మీకు గల చెడ్డకోరికలకు అనుగుణంగా ఉండకండి.


ఆ తరువాత లోకమంతటిని మోసం చేసే ఆ మహా ఘటసర్పం, అనగా సాతాను లేక అపవాది అని పిలువబడే ఆదిసర్పాన్ని వానిని అనుసరించే దూతలందరు వానితో పాటు భూమి మీదకు పడత్రోయబడ్డారు.


రెండవ మృగం మొదటి మృగం పక్షంగా దాని కొరకు అద్బుతాలను చేస్తూ భూనివాసులందరిని మోసగిస్తుంది. ఆ రెండవ మృగం ఖడ్గంతో గాయపడి బ్రతికిన ఆ మొదటి మృగం కొరకు విగ్రహం చేయమని వారిని ఆదేశించింది.


అతడు గొప్ప స్వరంతో ఇలా అన్నాడు, “బబులోను మహా పట్టణం కూలిపోయింది! కూలిపోయింది! ఆమె దయ్యాలకు నిలయంగా, ప్రతి దుష్ట ఆత్మ తిరిగే చోటుగా, ప్రతి అపవిత్ర పక్షి సంచరించే స్థలంగా, ప్రతి మలినమైన అసహ్యమైన క్రూరమృగాలకు నివాస స్థలంగా మారింది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ