Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




తీతుకు 2:2 - తెలుగు సమకాలీన అనువాదము

2 వృద్ధులైన పురుషులకు, వారు తమ కోరికలను అదుపులో ఉంచుకునేవారిగా, గౌరవించదగినవారిగా, స్వీయ నియంత్రణ కలిగినవారిగా విశ్వాసంలో, ప్రేమలో, ఓర్పులో స్థిరంగా ఉండుమని బోధించు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

2 ఏలాగనగా వృద్ధులు మితానుభవముగలవారును, మాన్యులును, స్వస్థబుద్ధిగలవారును, విశ్వాస ప్రేమ సహనములయందు లోపములేనివారునై యుండవలెననియు,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

2 వృద్ధులు నిగ్రహం కలిగి, గౌరవపూర్వకంగా, వివేకంతో మెలుగుతూ విశ్వాసం, ప్రేమ, సహనంలో శుద్ధంగా ఉండాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

2 వృద్ధులకు శాంతంగా ఉండమని, గౌరవంగా జీవించుని, ఆత్మనిగ్రహం, సంపూర్ణమైన విశ్వాసం, ప్రేమ, సహనము కలిగి ఉండమని బోధించు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

2 వృద్ధులైన పురుషులకు, వారు తమ కోరికలను అదుపులో ఉంచుకునేవారిగా, గౌరవించదగినవారిగా, స్వీయ నియంత్రణ కలిగినవారిగా విశ్వాసంలో, ప్రేమలో, ఓర్పులో స్థిరంగా ఉండమని బోధించు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

2 వృద్ధులైన పురుషులకు, వారు తమ కోరికలను అదుపులో ఉంచుకునేవారిగా, గౌరవించదగినవారిగా, స్వీయ నియంత్రణ కలిగినవారిగా విశ్వాసంలో, ప్రేమలో, ఓర్పులో స్థిరంగా ఉండమని బోధించు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




తీతుకు 2:2
33 ပူးပေါင်းရင်းမြစ်များ  

వారు యేసు వద్దకు వచ్చినప్పుడు, సేన దయ్యం పట్టినవాడు, బట్టలు వేసుకొని సరియైన మానసిక స్థితిలో, అక్కడ కూర్చుని ఉండడం చూశారు; వారు భయపడ్డారు.


ప్రజలు ఏమి జరిగిందో చూడడానికి వెళ్లారు. వారు యేసు వద్దకు వచ్చినప్పుడు, దయ్యాలు వదలిన మనుష్యుడు, బట్టలు వేసుకొని సరియైన మానసిక స్థితిలో, యేసు పాదాల దగ్గర కూర్చుని ఉండడం చూశారు; వారు భయపడ్డారు.


పౌలు నీతి గురించి, ఆశానిగ్రహం, రాబోయే తీర్పుల గురించి బోధించిన మాటలు విని ఫెలిక్స్ ఎంతో భయపడి, “ఇప్పటికి ఇది చాలు! నీవు వెళ్లు, మళ్ళీ నాకు అనుకూలంగా ఉన్నప్పుడు నిన్ను పిలిపిస్తాను” అని చెప్పాడు.


నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి మీలో ప్రతి ఒక్కరికీ నేను చెప్పేదేమిటంటే, మీరు ఉండవలసిన దానికన్నా మిమ్మల్ని మీరు ఎక్కువగా భావించవద్దు కాని, దేవుడు మీలో ప్రతి ఒక్కరికి పంచియిచ్చిన విశ్వాసం ప్రకారం మీ గురించి మీరు వివేకం కలిగి అంచనా వేసుకోండి.


మీరు నీతిప్రవర్తన కలిగివుండి పాపం చేయకండి. దేవుడు తెలియనివారు కొందరు మీలో ఉన్నారు కనుక, మిమ్మల్ని సిగ్గుపరచడానికి ఇలా చెప్తున్నాను.


ఆటలలో పాల్గొనే ప్రతివారు కఠినమైన శిక్షణ తీసుకుంటారు. వారు నిత్యం ఉండని కిరీటాన్ని పొందడానికి అంత ప్రయాస పడుతారు, కానీ మనమైతే నిత్యం నిలిచే కిరీటం పొందడం కొరకు ప్రయాస పడుతున్నాము.


కొందరు చెప్పినట్లు, మేము పిచ్చివారమైతే అది దేవుని కొరకు మాత్రమే; మేము వివేకవంతులమైనా అది మీ కొరకు.


మృదుత్వం, స్వీయ నియంత్రణ. ఇలాంటి వాటికి వ్యతిరేకంగా ఏ నియమం లేదు.


చివరిగా, సహోదరీ సహోదరులారా, ఏదైనా యోగ్యమైనదిగా లేదా మంచిగా ఉంటే, సత్యమైన వాటి మీద, గొప్పవాటి మీద, న్యాయమైన వాటి మీద, పవిత్రమైన వాటి మీద, సుందరమైన వాటి మీద, ఘనమైన వాటి మీద మీ మనస్సులను పెట్టండి.


కనుక మనం నిద్రపోతున్న ఇతరుల్లా ఉండకుండా, మెలకువ కలిగి తెలివిగా ఉందాం.


అయితే మనం పగటికి చెందినవారం కనుక తెలివి కలిగి, విశ్వాసం ప్రేమ అనే కవచాన్ని, రక్షణ పొందాలనే ఆ ఆశాభావాన్ని శిరస్త్రాణంగా ధరించుకొంటాము.


లైంగిక అనైతికత కలిగినవారి కొరకు, స్వలింగసంపర్కులకు, బానిస వ్యాపారం చేసేవారికి, అబద్ధాలు చెప్పేవారికి, దొంగ సాక్ష్యం చెప్పేవారికి, స్వచ్ఛమైన బోధకు వ్యతిరేకంగా ఉన్న వారి కొరకు నియమించబడిందని మనకు తెలుసు.


మన ప్రభువు యొక్క కృప, యేసుక్రీస్తులోని ప్రేమ, విశ్వాసం నాపై విస్తారంగా క్రుమ్మరించబడింది.


విశ్వాసంలో నాకు నిజ కుమారుడైన తిమోతికి వ్రాయునది: తండ్రియైన దేవుని నుండి మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి నీకు కృప, కనికరం, సమాధానములు కలుగును గాక.


ఈ ఆజ్ఞ యొక్క లక్ష్యం ప్రేమ; అది స్వచ్ఛమైన హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, యదార్థమైన విశ్వాసం నుండి కలుగుతుంది.


అదే విధంగా, సంఘపరిచారకుల భార్యలు కూడా గౌరవించదగినవారిగా ఉండాలి, ద్వేషంతో మాట్లాడేవారిగా కాకుండా కోరికలను అదుపులో ఉంచుకునేవారిగా ప్రతి విషయంలో నమ్మకమైనవారిగా ఉండాలి.


సంఘపెద్ద నిందలేనివానిగా, ఒకే భార్యకు నమ్మకమైన భర్తగా, కోరికలను అదుపులో ఉంచుకునేవానిగా, స్వీయ నియంత్రణ గలవానిగా, మర్యాదస్థునిగా, ఆతిథ్య ప్రియునిగా, సత్యాన్ని బోధించగల సామర్ధ్యం కలవానిగా ఉండాలి.


అతడు పూర్తిగా గౌరవించదగిన రీతిలో తన కుటుంబాన్ని చక్కగా నడిపించుకొంటూ తన పిల్లలు తనకు లోబడి ఉండునట్లు చూసుకోవాలి.


అదే విధంగా, సంఘ పరిచారకులు కూడా గౌరవించదగినవారిగా, నిష్కపటంగా ఉండాలి, మద్యానికి బానిసగా ఉండకూడదు, అక్రమ సంపాదన ఆశించకూడదు.


వృద్ధుని కఠినంగా గద్దించకుండా, అతన్ని నీ తండ్రిగా భావించి బోధించు. నీ కన్నా చిన్నవారిని నీ సోదరులుగా,


వారి గురించి అతడు చెప్పింది సత్యమే. కనుక విశ్వాసంలో స్థిరంగా ఉండేలా,


దానికి బదులు, అతడు ఆతిథ్యాన్ని ఇచ్చేవానిగా, మంచిని ప్రేమించేవానిగా, స్వీయ నియంత్రణ కలవానిగా, నీతిమంతునిగా, పరిశుద్ధునిగా, క్రమశిక్షణ గలవాడై ఉండాలి.


నీవు ప్రతివిషయంలో వారికి మాదిరిగా జీవిస్తూ, ఏది మంచిదో అదే చేస్తూ, నీ బోధలలో నిజాయితీని, గంభీరతను చూపిస్తూ,


ముసలివాడిని ఇప్పుడు యేసు క్రీస్తు కొరకు ఖైదీగా ఉన్న పౌలు అనే నేను నిన్ను ప్రేమను బట్టి వేడుకుంటున్నాను.


కాబట్టి, మెలకువ కలిగి నిబ్బరమైన బుద్ధిగల మనస్సులతో, యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడే కృప విషయమై సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండండి.


అన్నిటికి అంతం సమీపించింది, కనుక మీరు స్వస్థబుద్ధి కలిగి, మెలకువతో ప్రార్థించండి.


మెలకువతో జాగరూకులై ఉండండి. మీ శత్రువైన సాతాను గర్జించు సింహంలా తిరుగుతూ ఎవరినైన మ్రింగివేయాలని చూస్తున్నాడు.


వివేకానికి స్వీయ నియంత్రణ; స్వీయ నియంత్రణకు సహనాన్ని; సహనానికి దైవ భక్తిని;


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ