Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




రోమా పత్రిక 9:30 - తెలుగు సమకాలీన అనువాదము

30 అయితే దీనిని బట్టి మనం ఏమి చెప్పగలం? నీతిని అనుసరించని యూదేతరులు విశ్వాసాన్ని బట్టి నీతిని పొందుకున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

30-31 అట్లయితే మనమేమందుము? నీతిని వెంటాడని అన్యజనులు నీతిని, అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి; అయితే ఇశ్రాయేలు నీతికారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

30 అలా అయితే మనం ఏమనగలం? న్యాయాన్ని వెదకని యూదేతరులు నీతిని, అంటే విశ్వాసమూలమైన నీతిని పొందారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

30 మరి మనమేమనాలి? నీతిమంతులు కావటానికి ప్రయత్నించని యూదులుకాని ప్రజలు నీతిమంతులయ్యారు. అది వాళ్ళల్లో విశ్వాసం ఉండటం వల్ల సంభవించింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

30 అయితే దీనిని బట్టి మనం ఏమి చెప్పగలం? నీతిని అనుసరించని యూదేతరులు విశ్వాసాన్నిబట్టి నీతిని పొందుకున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

30 అయితే దీనిని బట్టి మనం ఏమి చెప్పగలం? నీతిని అనుసరించని యూదేతరులు విశ్వాసాన్నిబట్టి నీతిని పొందుకున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




రోమా పత్రిక 9:30
28 ပူးပေါင်းရင်းမြစ်များ  

అంటే, మీరు మీ హృదయంలో నమ్మినప్పుడు నీతిమంతులుగా తీర్చబడతారు, మీరు మీ నోటితో మీ విశ్వాసాన్ని ఒప్పుకొన్నప్పుడు రక్షించబడతారు.


యెషయా ఇలా ధైర్యంగా చెప్పాడు, “నన్ను వెదకనివారికి నేను దొరికాను, నన్ను అడగని వారికి నన్ను నేను బయలుపరచుకొన్నాను”


అయితే విశ్వాసం ద్వారా వచ్చే నీతి ఇలా చెప్తుంది: క్రీస్తును క్రిందకు తేవడానికే, “పరలోకంలోకి ఎవరు ఆరోహణమై వెళ్తారు?”


అయితే మన దుర్మార్గాన్ని బట్టి దేవుడు నీతిమంతుడని మరింత స్పష్టమవుతుంటే, మనమేమి చెప్పగలం? దేవుడు తన ఉగ్రతను మన మీద చూపితే ఆయన అన్యాయస్థుడు అవుతాడా? నేను మానవుల వాదన చెప్తున్నాను.


అప్పటికి అతడు ఇంకా సున్నతి చేయబడనివాడై ఉన్నప్పటికీ, అతడు కలిగివున్న విశ్వాసం ద్వారా నీతి ముద్రగా సున్నతి అనే గుర్తును అతడు పొందాడు. కనుక సున్నతి పొందకపోయిన విశ్వసించిన వారందరికి అది నీతిగా ఎంచబడేలా, అబ్రాహాము వారందరికి తండ్రి అయ్యాడు.


అబ్రాహాము ఈ లోకానికి వారసుడు అవుతాడు అనే వాగ్దానాన్ని అతడు అతని సంతానం ధర్మశాస్త్రాన్ని బట్టి పొందుకోలేదు కాని, తాను కలిగివున్న విశ్వాసమూలంగా వచ్చిన నీతి ద్వారా మాత్రమే పొందుకున్నారు.


అందుకే “అది అతనికి నీతిగా యెంచబడింది.”


ఈ ఆశీర్వాదం కేవలం సున్నతి పొందినవారికి మాత్రమేనా లేక సున్నతి పొందని వారికి కూడా వర్తిస్తుందా? అబ్రాహాము యొక్క విశ్వాసం అతనికి నీతిగా యెంచబడిందని మనం చెప్తున్నాం గదా.


మనం విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాము కనుక మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనం సమాధానాన్ని కలిగివున్నాము.


అయితే దీనిని బట్టి మనము ఏమి చెప్పగలం? దేవుడు అన్యాయం చేస్తాడనా? ఎన్నటికి కాదు!


కాని నీతి మార్గంగా ధర్మశాస్త్రాన్ని అనుసరించిన ఇశ్రాయేలు ప్రజలు తమ లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు.


ఒక వ్యక్తి ధర్మశాస్త్రాన్ని ఆచరించడం వల్ల నీతిమంతునిగా తీర్చబడడు, కాని యేసుక్రీస్తులో విశ్వాసముంచడం వల్లనే అని మనకు తెలుసు. అందుకే, మేము కూడా ధర్మశాస్త్ర క్రియలను బట్టి కాక, క్రీస్తులో విశ్వాసముంచడం ద్వారా నీతిమంతులంగా తీర్చబడ్డాం, ఎందుకంటే ధర్మశాస్త్ర క్రియలను బట్టి ఎవ్వరూ నీతిమంతులుగా తీర్చబడలేరు.


అందువల్ల మనం విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీర్చబడేలా క్రీస్తు వచ్చేవరకు ధర్మశాస్త్రం మనకు ఒక సంరక్షకునిగా ఉండింది.


దేవుడు యూదేతరులను వారి విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీరుస్తారని లేఖనంలో ముందుగానే చెప్పబడింది, “నిన్ను బట్టి జనములన్నీ ఆశీర్వదించబడతాయి” అని చెప్పడం ద్వారా అబ్రాహాముకు ముందుగానే సువార్త ప్రకటించబడింది.


నీతిమంతులుగా తీర్చబడాలనే మన నిరీక్షణ నెరవేరాలని మనం విశ్వాసం కలిగి ఆత్మ ద్వారా ఆసక్తితో ఎదురు చూస్తున్నాం.


ఆ సమయంలో మీరు క్రీస్తు నుండి వేరుగా ఉన్నారు, ఇశ్రాయేలులో పౌరసత్వం లేనివారిగా, వాగ్దాన నిబంధనలకు పరదేశులుగా, నిరీక్షణ లేనివారిగా, లోకంలో దేవుడు లేనివారిగా ఉండేవారు.


క్రీస్తును సంపాదించుకుని, ధర్మశాస్త్రం వలన కలిగే నా నీతిని కాకుండా, క్రీస్తులోని విశ్వాసాన్ని బట్టి దేవుడు దయ చేసిన నీతిని కలిగి ఆయనలో కనబడాలని,


అయితే దైవజనుడవైన నీవు, వీటి నుండి పారిపోయి నీతి, భక్తి, విశ్వాసం, ప్రేమ, సహనం, మంచితనం అనే వాటిని వెంబడించు.


విశ్వాసం ద్వారానే నోవహు, తాను ఇంకా చూడని వాటి గురించి హెచ్చరించబడినప్పుడు, పవిత్ర భయం కలిగి తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఒక ఓడను నిర్మించాడు. తన విశ్వాసం వల్లనే అతడు లోకాన్ని ఖండించాడు, విశ్వాసంతో కొనసాగుతూ నీతికి వారసుడయ్యాడు.


ఎందుకంటే, మీరు గతకాలంలో యూదేతరులుగా జీవించారు, సిగ్గుమాలిన వారై, వ్యభిచారులుగా, త్రాగుబోతులుగా, అల్లరితో కూడిన ఆటపాటలు, అసహ్యకరమైన విగ్రహారాధనలు చేస్తూ జీవించారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ