Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




రోమా పత్రిక 6:23 - తెలుగు సమకాలీన అనువాదము

23 పాపం వలన వచ్చే జీతం మరణం, అయితే దేవుని కృపావరం వలన మన ప్రభువైన యేసుక్రీస్తులో నిత్యజీవం లభిస్తుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

23 ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

23 ఎందుకంటే పాపానికి జీతం మరణం. అయితే దేవుని కృపావరం మన ప్రభువైన క్రీస్తు యేసులో శాశ్వత జీవం.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

23 పాపం మరణాన్ని ప్రతి ఫలంగా ఇస్తుంది. కాని దేవుడు యేసు క్రీస్తు ప్రభువు ద్వారా అనంత జీవితాన్ని బహుమానంగా ఇస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

23 పాపం వలన వచ్చే జీతం మరణం, అయితే దేవుని కృపావరం వలన మన ప్రభువైన యేసు క్రీస్తులో నిత్యజీవం లభిస్తుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

23 పాపం వలన వచ్చే జీతం మరణం, అయితే దేవుని కృపావరం వలన మన ప్రభువైన యేసు క్రీస్తులో నిత్యజీవం లభిస్తుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




రోమా పత్రిక 6:23
41 ပူးပေါင်းရင်းမြစ်များ  

“అప్పుడు వారు నిత్య శిక్షలోనికి ప్రవేశిస్తారు, కాని నీతిమంతులు నిత్య జీవంలోనికి ప్రవేశిస్తారు.”


నేను వాటికి నిత్యజీవాన్ని ఇస్తాను, కనుక అవి ఎన్నడు నశించవు; వాటిని నా చేతిలో నుండి ఎవరు అపహరించలేరు.


నీవు నీ కుమారునికి అప్పగించిన వారందరికి నిత్యజీవం అనుగ్రహించడానికి ప్రజలందరి మీద ఆయనకు అధికారం ఇచ్చావు.


కుమారుని యందు నమ్మకముంచువారికి నిత్యజీవం కలుగుతుంది, అయితే కుమారుని తృణీకరించినవాని మీద దేవుని ఉగ్రత నిలిచి ఉంటుంది కనుక వాడు జీవాన్ని చూడడు.


కానీ నేనిచ్చే నీళ్ళను త్రాగే వారికి ఇక ఎప్పటికీ దాహం వేయదు. నిజానికి, నేనిచ్చే నీళ్ళు వారికి నిత్యజీవానికి నీటి ఊటగా ఉంటుంది” అన్నారు.


పంటను కోసేవాడు తన జీతం తీసుకొని, పంటను విత్తినవాడు మరియు కోసేవాడు ఇద్దరూ సంతోషించేలా, పంట అంతా కోసి నిత్యజీవం కొరకు కూర్చుకొంటాడు.


“నా మాటలను విని నన్ను పంపినవానిని నమ్మువాడు, నిత్యజీవం గలవాడు మరియు అతడు మరణం నుండి జీవంలోనికి దాటాడు కనుక అతనికి తీర్పు ఉండదని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.


మీరు పాడైపోయే ఆహారం కొరకు ప్రయాసపడకండి కానీ మనుష్యకుమారుడు మీకిచ్చే నిరంతరం నిలిచివుండే ఆహారం కొరకు ప్రయాసపడండి. ఎందుకంటే తండ్రియైన దేవుడు దానిని మీకు ఇవ్వడానికే ఆయనపై తన ఆమోద ముద్ర వేసారు” అని చెప్పారు.


కుమారుని వైపు చూసి ఆయనను నమ్మిన ప్రతి ఒక్కరు నిత్యజీవాన్ని పొందుకోవాలని, వారిని చివరి రోజున జీవంతో నేను లేపాలని నా తండ్రి చిత్తమై ఉంది.”


అందుకు సీమోను పేతురు ఆయనతో, “ప్రభువా, మేము ఎవరి దగ్గరకు వెళ్లాలి? నిత్యజీవపు మాటలను నీవే కలిగివున్నావు.


ఇలాంటి పనులు చేసినవారు మరణానికి పాత్రులవుతారు అనే దేవుని నీతిశాసనం గురించి తెలిసి కూడా వారు అవే పనులు చేయడమే కాక వాటిని చేస్తున్నవారిని కూడా అంగీకరించారు.


ఎవరైతే పట్టువదలకుండా మంచిని చేస్తూ మహిమను, ఘనతను, నిత్యత్వాన్ని వెదకుతారో వారికి ఆయన నిత్యజీవాన్ని ఇస్తారు.


ఒక్క మనుష్యుని ద్వారా ఈ లోకంలోనికి పాపం, పాపం ద్వారా మరణం ఎలా ప్రవేశించాయో, అలాగే అందరూ పాపం చేశారు, కనుక మరణం ప్రజలందరికి వచ్చింది.


ఒకవేళ ఒక మనుష్యుని అతిక్రమం వల్ల, ఆ ఒక్క మనుష్యుని ద్వారా మరణం రాజ్యం చేసినట్లైతే, దేవుని కృపాసమృద్ధిని నీతి అనే వరాన్ని పొందినవారు యేసు క్రీస్తు అనే ఒకని ద్వారా ఇంకెంత ఎక్కువగా జీవంలో రాజ్యం చేస్తారు!


కనుక, పాపం మరణంలో రాజ్యం చేసినట్లుగానే, మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా నిత్యజీవాన్ని తేవడానికి నీతి ద్వారా కృప రాజ్యం చేస్తుంది.


మిమ్మల్ని మీరు ఎవరికైనా విధేయుడైన దాసునిగా ఉండడానికి అప్పగించుకుంటే మీరు వారికి లోబడి ఉండాల్సిన దాసులు అవుతారు అని మీకు తెలియదా? అయితే మీరు మరణానికి నడిపించే పాపానికి దాసులుగా ఉంటారా లేక నీతివైపు నడిపించే విధేయతకు దాసులుగా ఉంటారా?


మీరు ఇప్పుడు సిగ్గుపడునట్లుగా ఉన్న గతకాలంలో మీరు చేసిన పనుల వల్ల మీకు కలిగిన ప్రయోజనమేమిటి? ఆ పనుల ఫలం మరణమే గదా!


మీరు శరీరానుసారంగా జీవిస్తే, మీరు మరణిస్తారు, కాని ఒకవేళ ఆత్మ ద్వారా శరీర సంబంధమైన చెడ్డక్రియలను చంపివేస్తే, మీరు బ్రతుకుతారు.


మరణమైనా జీవమైనా, దేవదూతలైనా దయ్యాలైనా, నేడైనా రేపైనా, ఎటువంటి శక్తులైనా,


ఎత్తైనా లోతైనా, సృష్టిలో ఉన్న ఏదైనా మన ప్రభువైన క్రీస్తుయేసులో ఉన్న దేవుని ప్రేమ నుండి మనలను వేరుచేయలేవని నేను ఒప్పుకుంటున్నాను.


శరీరంచే పాలించబడే మనస్సు మరణము, కాని ఆత్మచే పాలించబడే మనస్సు జీవం మరియు సమాధానమై ఉన్నది.


ధర్మశాస్త్ర క్రియలపై ఆధారపడే వారందరూ శాపగ్రస్తులు, ఎలాగంటే లేఖనాల్లో వ్రాయబడిన ప్రకారం: “ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ప్రతీదానిని పాటించనివారు శాపగ్రస్తులు.”


దేవుని సేవకుడు యేసు క్రీస్తు అపొస్తలుడనైన పౌలు అనే నేను, మనమందరం నమ్ముతున్న ఒకే విశ్వాసాన్ని బట్టి నాకు నిజ కుమారుడైన తీతుకు వ్రాయునది,


కోరిక గర్భాన్ని ధరించి పాపానికి జన్మనిస్తుంది, ఆ పాపం పూర్తిగా పెరిగినప్పుడు అది మరణానికి జన్మనిస్తుంది.


ఇదే క్రీస్తు మనకు వాగ్దానం చేసిన నిత్యజీవం.


అయితే పిరికివారు, అవిశ్వాసులు, దుష్టులు, హంతకులు, లైంగిక నైతికత లేనివారు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరు అగ్ని గంధకాలతో మండుతున్న సరస్సు పాలవుతారు. ఇది వారికి రెండవ మరణం” అని చెప్పాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ