Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




రోమా పత్రిక 3:25 - తెలుగు సమకాలీన అనువాదము

25 దేవుడు క్రీస్తును, ఆయన యొక్క రక్తాన్ని చిందించడం ద్వారా ప్రాయశ్చిత్త బలిగా సమర్పించాడు; విశ్వాసం ద్వారా దానిని పొందుకోవాలి. ఆయన తన నీతిని చూపించడానికి ఇలా చేశారు, ఎందుకంటే ఆయన తన సహనాన్ని బట్టి పూర్వం చేయబడిన పాపాలను శిక్ష విధించకుండా వదిలేసారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

25 పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమివలన ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనువరచవలెనని

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

25 క్రీస్తు యేసు రక్తంలో విశ్వాసం ద్వారా పాప పరిహారం పొందేలా దేవుడు తన కోపాగ్నిని తొలగించే పాప పరిహారార్ధ బలిగా ఆయనను కనుపరిచాడు. అందులో దేవుని ఉద్దేశం తన న్యాయాన్ని ప్రదర్శించడమే. ఎందుకంటే, గతంలోని పాపాలను దేవుడు సహనంతో దాటిపోయాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

25 దేవుడు ఇదివరలో ప్రజలు చేసిన పాపాల్ని లెక్క చెయ్యకుండా సహనం వహించాడు. ఆయన తన నీతిని నిరూపించాలని యేసు క్రీస్తు రక్తాన్ని విశ్వసించే ప్రజలకోసం ఆయనను కరుణాపీఠంగా చేసాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

25 క్రీస్తు రక్తాన్ని చిందించడం ద్వారా దేవుడు ఆయనను ప్రాయశ్చిత్త బలిగా సమర్పించారు; విశ్వాసం ద్వారా దానిని పొందుకోవాలి. ఆయన తన నీతిని చూపించడానికి ఇలా చేశారు, ఎందుకంటే ఆయన సహనంతో పూర్వం చేసిన పాపాలను శిక్ష విధించకుండా వదిలేశారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

25 క్రీస్తు రక్తాన్ని చిందించడం ద్వారా దేవుడు ఆయనను ప్రాయశ్చిత్త బలిగా సమర్పించారు; విశ్వాసం ద్వారా దానిని పొందుకోవాలి. ఆయన తన నీతిని చూపించడానికి ఇలా చేశారు, ఎందుకంటే ఆయన సహనంతో పూర్వం చేసిన పాపాలను శిక్ష విధించకుండా వదిలేశారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




రోమా పత్రిక 3:25
51 ပူးပေါင်းရင်းမြစ်များ  

నమ్మినవాడే నిత్యజీవాన్ని కలిగి ఉంటాడని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.


గతంలో, ఆయన అన్ని దేశాల ప్రజలను తమ సొంత మార్గాలలో వెళ్లనిచ్చాడు.


చేస్తున్న ప్రభువు చెప్తున్నాడు.’


గతంలో మానవుని అజ్ఞానాన్ని దేవుడు చూసి చూడనట్లు ఉన్నాడు, కాని ఇప్పుడు ప్రజలందరు ప్రతిచోట పశ్చాత్తాపం పొందాలని ఆయన ఆజ్ఞాపించారు.


దేవుడు తన భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం యేసుక్రీస్తును మీకు అప్పగించారు; అయితే మీరు, దుష్టుల సహాయంతో, ఆయనను సిలువకు మేకులు కొట్టి చంపారు.


అయితే దేవుడు తన క్రీస్తు తప్పక హింసించబడతాడని ప్రవక్తలందరి ద్వారా ముందుగానే తెలియపరచిన దానిని దేవుడు ఈ విధంగా నెరవేర్చారు.


ఏమి జరగాలని నీ శక్తి మరియు నీ చిత్తం ముందుగానే నిర్ణయించిందో అలాగే వారు చేశారు.


దేవుని దయ మిమ్మల్ని పశ్చాత్తాపం వైపు నడిపించడానికి ఉద్దేశించినదని గ్రహించకుండా, కనికరం, ఓర్పు, దయాసంపన్నత పట్ల అలక్ష్యాన్ని చూపిస్తున్నారా?


ఆయన ఈ ప్రస్తుత కాలంలో తన నీతిని కనుపరచడానికి, ఆయన నీతిమంతుడై ఉండి యేసులో విశ్వాసముంచిన వారిని నీతిమంతులుగా తీర్చేవానిగా ఉండడానికి ఇలా చేశారు.


మనం విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాము కనుక మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనం సమాధానాన్ని కలిగివున్నాము.


ఇది మాత్రమే కాకుండా మనల్ని సమాధానపరచిన మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఇప్పుడు మనం దేవునిలో అతిశయిస్తున్నాం.


అదేరీతిగా ఒకని ఆజ్ఞాతిక్రమం ఫలితంగా ప్రజలందరికి శిక్ష విధించబడినట్లే ఒకని నీతివంతమైన చర్య వలన ప్రజలందరూ నీతిమంతులుగా తీర్చబడి జీవాన్ని కలిగివున్నారు.


ఇప్పుడైతే మనం ఆయన రక్తం చేత నీతిమంతులంగా తీర్చబడియున్నాం, అలాంటప్పుడు మనం ఇంకెంతగా ఆయన ద్వారా దేవుని ఉగ్రత నుండి రక్షించబడతాం!


క్రీస్తు అనే మన పస్కా గొర్రెపిల్ల మీ కొరకు వధింపబడి ప్రాయశ్చిత్తం చేశాడు కనుక మీరు పులియని క్రొత్త పిండి ముద్దగా ఉండడానికి పులిసిన పాత పిండిని పారవేయండి.


మనం ఆయనలో దేవుని నీతిగా అయ్యేలా, పాపమెరుగని ఆయనను మన కొరకు పాపంగా చేశారు.


దేవుని కృపా ఐశ్వర్యానికి అనుగుణంగా ఆయనలో మనం ఆయన రక్తం ద్వారా విడుదల, పాపక్షమాపణ కలిగియున్నాము.


ఒకప్పుడు దూరంగా ఉన్న మీరు ఇప్పుడు క్రీస్తు యేసు రక్తాన్ని బట్టి దేవునికి దగ్గరయ్యారు.


క్రీస్తు యేసు పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చారనే మాట నమ్మదగింది పూర్తిగా అంగీకరించదగింది. అలాంటి పాపులలో నేను అతి దుష్టుడను.


ఎద్దుల మేకల రక్తానికి పాపాలను తొలగించడం అసాధ్యం.


అలాంటి విషయాలు చెప్పే ప్రజలు తమ స్వదేశం కొరకు చూస్తున్నారని స్పష్టం చేస్తారు.


దేవుడు అబ్రాహామును పరీక్షించినపుడు, విశ్వాసం ద్వారానే అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించాడు. “ఇస్సాకు వల్లనే నీ వంశం అభివృద్ధి చెందుతుంది” అని దేవుడు అతనితో చెప్పినప్పటికి,


విశ్వాసం ద్వారానే నోవహు, తాను ఇంకా చూడని వాటి గురించి హెచ్చరించబడినప్పుడు, పవిత్ర భయం కలిగి తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఒక ఓడను నిర్మించాడు. తన విశ్వాసం వల్లనే అతడు లోకాన్ని ఖండించాడు, విశ్వాసంతో కొనసాగుతూ నీతికి వారసుడయ్యాడు.


అనేకుల పాపాలను తొలగించడానికి క్రీస్తు కూడా ఒక్కసారే బలిగా అర్పించబడ్డాడు; పాపాన్ని భరించడానికి కాకుండా, తన కొరకై వేచివున్న వారిని రక్షించడానికి ఆయన రెండవ సారి వస్తారు.


ఈ పెట్టె పైన మహిమ గల కెరూబులు తమ రెక్కలతో ప్రాయశ్చిత్త పీఠంను కాపాడుతూ ఉన్నాయి. అయితే ఈ సంగతుల గురించి వివరంగా ఇప్పుడు మనం చర్చించలేము.


మనం పాపం చేయలేదని చెప్పుకొంటే, మనం ఆయనను అబద్ధికుని చేస్తాము; మనలో ఆయన వాక్యం లేదు.


ఆయనే మన పాపాలకు ప్రాయశ్చిత్త బలి, మనకొరకు మాత్రమే కాదు కాని లోకమంతటి పాపాల కొరకు కూడా.


ఇదే ప్రేమ: మనం దేవుడిని ప్రేమించామని కాదు, కాని ఆయనే మనలను ప్రేమించి మన పాపాలకు ప్రాయశ్చిత్త బలిగా తన కుమారుని పంపారు.


నమ్మకమైన సాక్షిగా, మృతులలో నుండి అందరికంటే మొదటిగా జీవంతో తిరిగి లేచి, భూరాజులందరిని పరిపాలిస్తున్న యేసు క్రీస్తు నుండి మీకు కృపా సమాధానం కలుగును గాక! ఆయనే మనల్ని ప్రేమిస్తూ తన రక్తం ద్వారా మన పాపాల నుండి మనల్ని విడిపించి,


భూనివాసులందరు భూమి పునాది వేయబడక ముందే వధించబడిన గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేర్లు వ్రాయబడని వారందరు ఆ మృగాన్ని పూజిస్తారు.


జీవగ్రంథంలో పేరు వ్రాయబడనివారిని ఈ అగ్నిసరస్సులో పడవేసారు.


వారు ఒక క్రొత్త పాటను పాడారు, “చుట్టబడి ఉన్న ఆ గ్రంథపు చుట్టను తీసుకొని, దాని ముద్రలను తెరవడానికి నీవే యోగ్యుడవు! ఎందుకంటే ప్రతి గోత్రం నుండి, ప్రతి భాష మాట్లాడేవారి నుండి, ప్రతి జాతిలో నుండి, ప్రతి దేశంలోని ప్రజలను, దేవుని కొరకు విడిపించడానికి నీవు వధింపబడి నీ రక్తంతో కొన్నావు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ