Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




రోమా పత్రిక 2:16 - తెలుగు సమకాలీన అనువాదము

16 నా సువార్తలో చెప్పిన ప్రకారం, దేవుడు యేసు క్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యాలను తీర్పుతీర్చే దినాన ఇలా జరుగుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

16 దేవుడు నా సువార్త ప్రకారము యేసు క్రీస్తుద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఈలాగు జరుగును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

16 నా సువార్త ప్రకారం దేవుడు యేసు క్రీస్తు ద్వారా మానవుల రహస్యాలను విచారించే రోజున ఈ విధంగా జరుగుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

16 ఆ రోజు దేవుడు మానవుల రహస్య ఆలోచనలపై యేసు క్రీస్తు ద్వారా తీర్పు చెపుతాడు. నేను ప్రజలకు అందించే సువార్త ఈ విషయాన్ని తెలియజేస్తుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

16 నా సువార్తలో చెప్పిన ప్రకారం, దేవుడు యేసు క్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యాలను తీర్పు తీర్చే దినాన ఇలా జరుగుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

16 నా సువార్తలో చెప్పిన ప్రకారం, దేవుడు యేసు క్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యాలను తీర్పు తీర్చే దినాన ఇలా జరుగుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




రోమా పత్రిక 2:16
31 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఎందుకంటే మనుష్యకుమారుడు తన తండ్రి మహిమతో తన దూతలతో కూడ రాబోతున్నాడు. అప్పుడు ఆయన ప్రతివానికి వాని వాని పనుల ప్రకారం ప్రతిఫలం ఇస్తాడు.


ఎందుకంటే మరుగున ఉంచినదేది బయటపడక ఉండదు, దాచిపెట్టబడినదేది తెలియకుండా లేక బహిర్గతం కాకుండ ఉండదు.


నన్ను తిరస్కరించి నా మాటలను స్వీకరించని వాని కొరకు ఒక న్యాయాధిపతి ఉన్నాడు; నేను పలికిన ఈ మాటలే చివరి రోజున వానిని తీర్పు తీరుస్తాయి.


దేవుడు ఆయననే సజీవులకు, మృతులకు తీర్పు తీర్చేవానిగా నియమించారని ప్రజలకు ప్రకటించి, సాక్ష్యం ఇవ్వుమని ఆయన మమ్మల్ని ఆజ్ఞాపించారు.


ఎందుకనగా, లోకమంతటికి ఆయన నియమించిన వ్యక్తి ద్వారా నీతితో తీర్పు తీర్చడానికి ఆయన ఒక రోజును నిర్ణయించాడు. దేవుడు ఆయనను మరణం నుండి సజీవంగా లేపి ప్రతి ఒక్కరికి దీనిని రుజువుపరిచాడు.”


యూదేతరులంతా విశ్వాసానికి విధేయులు కావాలని, అనాది కాలం నుండి రహస్యంగా దాచబడి, ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మం, నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారం వ్రాయబడిన ప్రవచనాత్మక లేఖనాల ద్వారా ఇప్పుడు వారికి తెలియపరచబడింది. ఆ మర్మానికి అనుగుణంగా నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు గురించిన సువార్త ప్రకారం మిమ్మల్ని స్థిరపరచగల సమర్థుడును ఏకైక జ్ఞానవంతుడునైన దేవునికి యేసు క్రీస్తు ద్వారా శాశ్వత మహిమ కలుగును గాక! ఆమేన్.


అయితే మీ మొండితనం, పశ్చాత్తాపంలేని హృదయాన్ని బట్టి దేవుని న్యాయమైన తీర్పు వెల్లడిచేయబడే దేవుని ఉగ్రత దినాన దేవుని ఉగ్రతను నీకు నీవే కూర్చుకుంటున్నావు.


ఖచ్చితంగా కాదు! ఒకవేళ అలా అయితే, దేవుడు లోకానికి ఎలా తీర్పు తీర్చగలడు?


సహోదరీ సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీరు స్వీకరించి నేర్చుకొని, దానిలో నిలిచి ఉండాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను.


అందుకే నిర్ణీత సమయం రాకముందే తీర్పు తీర్చవద్దు, ప్రభువు వచ్చేవరకు ఆగాలి. చీకటిలో దాచబడిన రహస్యాలను వెలుగులోకి తెచ్చి హృదయంలోని ఉద్దేశాలను ఆయనే బయలుపరుస్తారు. ఆ సమయంలో ప్రతి ఒక్కరు దేవుని నుండి తమ ఘనతను పొందుకొంటారు.


ఎందుకంటే, మనలో ప్రతి ఒక్కరు తాము శరీరంలో ఉండగా చేసిన వాటికి, అవి మంచివైనా చెడ్డవైనా, తగిన ప్రతిఫలాన్ని పొందడానికి మనమందరం క్రీస్తు న్యాయసింహాసనం యెదుట ఖచ్చితంగా కనబడాలి.


సహోదరీ సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మానవుని నుండి వచ్చింది కాదని మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను.


దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమను గురించిన సువార్తకు అనుగుణమైనదే, ఈ స్వచ్ఛమైన బోధ.


మహారాజైన దావీదు సంతానంగా పుట్టిన యేసు క్రీస్తు మృతులలో నుండి సజీవంగా లేచారని గుర్తుంచుకో. యిదే నేను ప్రకటించిన సువార్త.


నేను దేవుని యెదుట, తాను వచ్చినప్పుడు తన రాజ్యంలో సజీవులకు మృతులకు తీర్పు తీర్చబోయే యేసు క్రీస్తు యెదుట నీకు ఇచ్చే ఆజ్ఞ యిదే:


కనుక నీతిమంతుడు న్యాయాధిపతియైన ప్రభువు ఆ రోజున నాకు బహుమతిగా ఇవ్వబోయే నీతి కిరీటం నా కొరకు దాచబడివుంది. ఈ బహుమానం నాకు మాత్రమే కాదు ఆయన ప్రత్యక్షత కొరకు ప్రేమతో ఎదురు చూస్తున్న వారందరికి అనుగ్రహిస్తారు.


మనుష్యులు ఒక్కసారే చనిపోవాలని, ఆ తరువాత తీర్పును పొందాలని నియమించబడిన ప్రకారం,


కాని వారు దేవుని యెదుట సమాధానం చెప్పాల్సివుంది. ఆయన సజీవులకు, మృతులకు తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు.


అదే నిజమైతే, భక్తులను శ్రమలలో నుండి ఎలా విడిపించాలో ప్రభువుకు తెలుసు, అలాగే తీర్పు దినాన దుష్టులను ఎలా శిక్షించాలో కూడా ఆయనకు తెలుసు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ