Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




రోమా పత్రిక 16:21 - తెలుగు సమకాలీన అనువాదము

21 నా సహపనివాడైన తిమోతి అలాగే నాతోటి యూదులైన లూకియా, యూసోను, సోసిపత్రు అనేవారు మీకు తమ వందనాలు తెలియజేస్తున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

21 నా జతపనివాడగు తిమోతి నా బంధువులగు లూకియ యాసోను, సోసిపత్రు అనువారును మీకు వందనములు చెప్పుచున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

21 నా సహ పనివాడు తిమోతి, నా బంధువులు లూకియ, యాసోను, సోసిపత్రు మీకు అభివందనాలు చెబుతున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

21 నాతో కలిసి సేవ చేస్తున్న తిమోతి మీకు వందనములు తెలుపుతున్నాడు. నా బంధువులు, లూకియ, యాసోను, సోసిపత్రు కూడా మీకు వందనాలు తెలుపుతున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

21 నా సహపనివాడైన తిమోతి అలాగే నా తోటి యూదులైన లూకియా, యూసోను, సోసిపత్రు అనేవారు మీకు తమ వందనాలు తెలియజేస్తున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

21 నా సహపనివాడైన తిమోతి అలాగే నా తోటి యూదులైన లూకియా, యూసోను, సోసిపత్రు అనేవారు మీకు తమ వందనాలు తెలియజేస్తున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




రోమా పత్రిక 16:21
24 ပူးပေါင်းရင်းမြစ်များ  

అంతియొకయ సంఘంలో ప్రవక్తలు మరియు బోధకులు ఉన్నారు. వారిలో కొందరు: బర్నబా, నీగెర అనబడే సుమెయోను, కురేనీకి చెందిన లూకియ, చతుర్ధాధిపతి హేరోదుతో పాటు పెరిగిన మనయేను, సౌలు.


కనుక విశ్వాసులు వెంటనే పౌలును అక్కడి నుండి సముద్రతీరానికి పంపించారు, కానీ సీల తిమోతిలు బెరయాలోనే ఉండిపోయారు.


కానీ ఆ బోధను నమ్మని ఇతర యూదులు అసూయపడ్డారు; వారు సంతవీధులలోని పోకిరివారిని తమ వెంటపెట్టుకుని గుంపుగా చేరి పట్టణంలో అల్లరిని సృష్టించారు. వారు పౌలు సీలలను ప్రజల మధ్యకు తీసుకురావాలని వారిని వెదకడానికి యాసోను ఇంటి మీద దాడి చేశారు.


సీల తిమోతిలు మాసిదోనియ ప్రాంతం నుండి వచ్చినప్పుడు, పౌలు యేసే క్రీస్తు అని యూదులకు ప్రకటించడానికి, సాక్ష్యమివ్వడానికి తనను తాను ప్రత్యేకంగా అంకితం చేసుకున్నాడు.


అతడు తిమోతి ఎరస్తు అనే ఇద్దరు తన తోటి పరిచారకులను మాసిదోనియాకు పంపి, అతడు ఆసియా ప్రాంతంలో కొంత కాలం ఉండిపోయాడు.


అతనితో బెరయా పట్టణస్థుడు పుర్రు కుమారుడైన సోపత్రు, థెస్సలొనీక పట్టణస్థుడైన అరిస్తర్కు మరియు సెకుందు, దెర్బే పట్టణస్థుడైన గాయి, తిమోతి, తుకికు మరియు ఆసియా ప్రాంతం నుండి త్రోఫిము అనేవారు ఉన్నారు.


నాతోటి యూదుడైన హెరొదియోనుకు వందనాలు తెలియజేయండి. నార్కిస్సు కుటుంబంలో ప్రభువులో ఉన్నవారందరికి వందనాలు తెలియజేయండి.


నాతో పాటు చెరసాలలో ఉన్న నాతోటి యూదులైన అంద్రొనీకు యూనీయలకు వందనాలు తెలియజేయండి.


నా సొంత జాతి వారైన, ఇశ్రాయేలీయుల కొరకు క్రీస్తు నుండి విడిపోయి శపించబడిన వానిగా ఉండాలని కోరుకుంటాను.


పౌలు, దేవుని చిత్తం బట్టి క్రీస్తు యేసు అపొస్తలుడు మన సోదరుడు తిమోతి, కొరింథీలోని దేవుని సంఘానికి, అకయ ప్రాంతమంతటిలోని దేవుని పరిశుద్ధులందరికి కలిపి వ్రాయునది:


ఎందుకంటే, సిల్వాను ద్వారా, తిమోతి ద్వారా, నా ద్వారా మీకు బోధించబడిన, దేవుని కుమారుడైన యేసు క్రీస్తు అవునని చెప్పి, కాదనేవాడు కాడు. అవుననే వాడు.


క్రీస్తు యేసు సేవకులైన పౌలు మరియు తిమోతి, క్రీస్తు యేసునందు ఫిలిప్పీలో ఉన్న దేవుని పవిత్ర ప్రజలకు, సంఘ పరిచారకులకు, సంఘ పెద్దలకు శుభమని చెప్పి వ్రాయునది:


దేవుని చిత్తాన్ని బట్టి క్రీస్తు యేసు అపొస్తలుడైన పౌలు, మన సహోదరుడైన తిమోతి శుభమని చెప్పి వ్రాయునది:


తండ్రియైన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తుకు చెందిన థెస్సలొనీకయుల సంఘానికి, పౌలు, సిల్వాను, తిమోతి అనే మేము వ్రాయునది: మీకు కృపా సమాధానములు కలుగును గాక.


మా సహోదరుడు దేవుని పరిచర్యయైన యేసు క్రీస్తు సువార్తను ప్రకటించడంలో మా తోటిపనివాడైన తిమోతిని, మీ విశ్వాసంలో మిమ్మల్ని ప్రోత్సహించి బలపరచడానికి పంపించాము,


అయితే ఇప్పుడే తిమోతి మీ నుండి మా దగ్గరకు వచ్చి, మీ విశ్వాసం గురించి, మీరు చూపిన ప్రేమ గురించి మంచి వార్తను మాకు అందించాడు. మీరు మమ్మల్ని ఎల్లప్పుడూ మాకు సంబంధించిన మంచి జ్ఞాపకాలతో జ్ఞాపకం చేసుకుంటూ, మేము మిమ్మల్ని చూడాలని ఎలా ఆరాటపడుతున్నామో అలాగే మీరు కూడా మమ్మల్ని చూడాలని ఆరాటపడుతున్నారని అతడు మాతో చెప్పాడు.


తండ్రియైన దేవునికి యేసు క్రీస్తు ప్రభువుకు చెందిన థెస్సలొనీకయ సంఘానికి, పౌలు, సిల్వాను, తిమోతి అనే మేము వ్రాయునది:


విశ్వాసంలో నాకు నిజ కుమారుడైన తిమోతికి వ్రాయునది: తండ్రియైన దేవుని నుండి మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి నీకు కృప, కనికరం, సమాధానములు కలుగును గాక.


అయితే దైవజనుడవైన నీవు, వీటి నుండి పారిపోయి నీతి, భక్తి, విశ్వాసం, ప్రేమ, సహనం, మంచితనం అనే వాటిని వెంబడించు.


తిమోతీ, నీకు అప్పగించబడిన బోధను జాగ్రత్తగా పాటించు. దుష్టమైన వట్టి మాటలకు, జ్ఞానమని తప్పుగా పిలువబడే విరుద్ధమైన ఆలోచనలకు దూరంగా ఉండుము.


నా ప్రియ కుమారుడైన తిమోతికి వ్రాయునది: మన తండ్రియైన దేవుని నుండి మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి నీకు కృప, కనికరం, సమాధానములు కలుగును గాక.


మన సహోదరుడైన తిమోతి చెరసాల నుండి విడుదల అయ్యాడని మీరు తెలుసుకోవాలని కోరుతున్నాను. అతడు త్వరగా వస్తే, నేను మిమ్మల్ని చూడడానికి అతనితో కలిసి వస్తాను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ