Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




రోమా పత్రిక 16:18 - తెలుగు సమకాలీన అనువాదము

18 ఎందుకంటే అలాంటివారు మన ప్రభువైన క్రీస్తును సేవించరు కాని తమ సొంత ఆకలినే తీర్చుకొంటారు. వారు మృదువైన మాటలతో పొగడ్తలతో అమాయకులైనవారి మనస్సులను మోసం చేస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

18 అట్టి వారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు; వారు ఇంపైన మాటలవలనను ఇచ్చకములవలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

18 అలాటివారు ప్రభు యేసు క్రీస్తుకు కాదు, తమ కడుపుకే దాసులు. వారు వినసొంపైన మాటలతో, ఇచ్చకాలతో అమాయకులను మోసం చేస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

18 అలాంటివాళ్ళు యేసు క్రీస్తు ప్రభువు సేవ చెయ్యరు. దానికి మారుగా వాళ్ళు తమ కడుపులు నింపుకొంటారు. మంచి మాటలు ఆడుతూ, ముఖస్తుతి చేస్తూ అమాయకుల్ని మోసం చేస్తూ ఉంటారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

18 ఎందుకంటే అలాంటివారు మన ప్రభువైన క్రీస్తును సేవించరు కాని తమ ఆకలినే తీర్చుకుంటారు. వారు మృదువైన మాటలతో పొగడ్తలతో అమాయకులైనవారి మనస్సులను మోసం చేస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

18 ఎందుకంటే అలాంటివారు మన ప్రభువైన క్రీస్తును సేవించరు కాని తమ ఆకలినే తీర్చుకుంటారు. వారు మృదువైన మాటలతో పొగడ్తలతో అమాయకులైనవారి మనస్సులను మోసం చేస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




రోమా పత్రిక 16:18
54 ပူးပေါင်းရင်းမြစ်များ  

అప్పుడు అనేక అబద్ధ ప్రవక్తలు వచ్చి ఎంతో మందిని మోసపరుస్తారు.


ఎందుకంటే అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి దేవుడు ఎన్నుకొన్న వారిని సహితం మోసం చేయడానికి సూచక క్రియలను, అద్బుతాలను చేస్తారు.


“ఎవ్వరూ ఇద్దరు యజమానులకు సేవచేయలేరు. వారు ఒకరిని ద్వేషించి మరొకరిని ప్రేమిస్తారు లేక ఒక యజమానికి అంకితమై మరొకనిని తృణీకరిస్తారు. మీరు దేవుణ్ణి, ధనాన్ని రెండింటిని ఒకేసారి సేవించలేరు.


“అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండండి. వారు గొర్రెతోలు కప్పుకొని మీ దగ్గరకు వస్తారు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు.


నన్ను సేవించేవారు నన్ను వెంబడించాలి; అప్పుడు నేను ఎక్కడ ఉన్నానో నా సేవకులు అక్కడ ఉంటారు. ఇలా నన్ను సేవించే వానిని నా తండ్రి ఘనపరుస్తాడు.


కాబట్టి ఇలా క్రీస్తుకు సేవ చేసేవారు దేవుని సంతోషపరుస్తారు, మానవుల అంగీకారాన్ని పొందుతారు.


మీ విధేయత గురించి ప్రతి ఒక్కరు విన్నారు కనుక మిమ్మల్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. అయితే మీరు మంచి విషయంలో జ్ఞానులుగా, చెడు విషయంలో నిర్దోషులుగా ఉండాలని నేను కోరుతున్నాను.


అయితే, సర్పం తన కుయుక్తితో హవ్వను మోసగించినట్లు, క్రీస్తులో మీకున్న నిజాయితీ, పవిత్రత నుండి ఏదో ఒక విధంగా మీ మనస్సులు తొలగిపోతాయేమోనని నేను భయపడుతున్నాను.


మేము దేవుని వాక్యాన్ని స్వలాభం కొరకు అమ్మేవారం కాదు, మేము దేవుని వాక్యాన్ని నిజాయితీగా క్రీస్తు అధికారంతో ఆయన యెదుట బోధిస్తున్నాము. దేవుడు మమ్మల్ని చూస్తున్నాడని మాకు తెలుసు.


అయితే రహస్యమైన సిగ్గుపడాల్సిన పనులను విడిచిపెట్టాము; మోసాన్ని చేయడం లేదు, దేవుని వాక్యాన్ని నాశనం చేయం. దానికి విరుద్ధంగా, సత్యాన్ని స్పష్టంగా ప్రకటించడం ద్వారా దేవుని దృష్టిలో ప్రతివాని మనస్సాక్షికి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం.


నేను ఇప్పుడు మనుషుల ఆమోదం పొందటానికి ప్రయత్నిస్తున్నానా, లేదా దేవుని ఆమోదమా? లేక నేను ప్రజలను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నానా? ఒకవేళ నేను ఇంకా ప్రజలను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటే, నేను క్రీస్తుకు సేవకునిగా ఉండలేను.


ప్రతి ఒక్కరు తమ సొంత పనులపైనే ఆసక్తి చూపిస్తున్నారు, కాని యేసు క్రీస్తు పనులపై కాదు.


వారి గమ్యం నాశనం, వారి కడుపే వారికి దేవుడు, తాము సిగ్గుపడవలసిన వాటిలో వారు గర్వపడుతున్నారు. భూసంబంధమైన వాటిపైనే తమ మనస్సు ఉంచుతున్నారు.


ఇంపైన మాటలతో ఎవరూ మిమ్మల్ని మోసపరచకూడదని దీనిని మీకు చెప్తున్నాను.


మీరు ప్రభువు నుండి స్వాస్థ్యాన్ని ప్రతిఫలంగా పొందుకుంటారని మీకు తెలుసు కనుక మీరు ప్రభువైన క్రీస్తునే సేవిస్తున్నారు.


అతడు నశించువారిని అన్ని విధాలుగా దుష్టత్వంతో మోసగిస్తాడు, వారు రక్షణ పొందడానికి గాని సత్యాన్ని ప్రేమించడానికి నిరాకరించారు కనుక వారు నశిస్తారు.


దుష్ట ఆలోచనలు కలిగిన ప్రజల మధ్యలో తరచూ ఘర్షణలు జరుగుతాయి, అలాంటివారు సత్యం నుండి తొలగిపోయి, దైవభక్తి అనేది ఆదాయం తెచ్చే ఒక మార్గమని భావిస్తారు.


దేవునికి ప్రభువైన యేసుక్రీస్తుకు సేవకుడనైన, యాకోబు, వివిధ దేశాలకు చెదిరిపోయిన పన్నెండు గోత్రాల వారికి వ్రాయునది: మీకు శుభాలు.


ఈ బోధకులు పేరాశ గలవారైవుండి, కట్టుకథలు చెప్పి మిమ్మల్ని దోచుకుంటారు, వారి తీర్పు వారి మీదికే వస్తుంది, వారి నాశనం ఆలస్యం కాదు.


యేసు క్రీస్తు సేవకుడు యాకోబు సహోదరుడైన యూదా, దేవునిచే పిలువబడి, తండ్రియైన దేవునిలో ప్రేమ కలిగి యేసు క్రీస్తు కొరకు సంరక్షించబడుతున్న వారికి శుభమని చెప్పి వ్రాయునది:


వీరు మీ ప్రేమ విందులలో, వినోదాలలో సిగ్గు విడిచి తింటూ, త్రాగుతూ మాయని మచ్చలుగా ఉన్నారు, వారు కేవలం తమను తాము పోషించుకొనే కాపరుల్లా ఉన్నారు. వారు గాలికి కొట్టుకుపోయే, వాన కురవని మబ్బుల వంటివారు. ఆకురాలు కాలంలో, ఫలాలులేకుండా పెల్లగింపబడి రెండుసార్లు చనిపోయిన చెట్లవంటివారు.


వారు ఎల్లప్పుడు సణుగుతూ ఇతరులలో తప్పులు వెదుకుతారు; వారు తమ చెడు కోరికలనే అనుసరిస్తారు; వారు తమ గురించి తామే పొగడుకొంటారు, స్వలాభం కొరకు ఇతరులను పొగడ్తలతో ముంచెత్తుతారు.


త్వరలో సంభవించబోయే వాటి గురించి దేవుడు తన సేవకులకు కనుపరచడానికి యేసుక్రీస్తుకు ఇచ్చిన ప్రత్యక్షత. ఆయన తన దూతను తన సేవకుడైన యోహాను దగ్గరకు పంపి ఈ సంగతులను తెలియజేసారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ