Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




రోమా పత్రిక 15:14 - తెలుగు సమకాలీన అనువాదము

14 నా సహోదరీ సహోదరులారా, మీరందరు మంచితనంతో నిండినవారై, జ్ఞానం కలిగి ఒకరికి ఒకరు బోధించుకోడానికి సమర్ధులని నేను నమ్ముతున్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

14 నా సహోదరులారా, మీరు కేవలము మంచివారును, సమస్త జ్ఞానసంపూర్ణులును, ఒకరికి ఒకరు బుద్ధిచెప్ప సమర్థులునై యున్నారని నామట్టుకు నేనును మిమ్మునుగూర్చి రూఢిగా నమ్ముచున్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

14 సోదరులారా, మీరు మంచివారు, సంపూర్ణ జ్ఞాన సంపన్నులు, ఒకరినొకరు ప్రోత్సహించుకోగల సమర్థులని నేను గట్టిగా నమ్ముతున్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

14 సోదరులారా, మీలో మంచితనముందని, సంపూర్ణమైన జ్ఞానం మీలో ఉందని, పరస్పరం బోధించుకోగల సామర్థ్యం మీలో ఉందని నాకు నమ్మకం ఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

14 నా సహోదరీ సహోదరులారా, మీరందరు మంచితనంతో నిండినవారై, జ్ఞానం కలిగి ఒకరికి ఒకరు బోధించుకోడానికి సమర్ధులని నేను నమ్ముతున్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

14 నా సహోదరీ సహోదరులారా, మీరందరు మంచితనంతో నిండినవారై, జ్ఞానం కలిగి ఒకరికి ఒకరు బోధించుకోడానికి సమర్ధులని నేను నమ్ముతున్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




రోమా పత్రిక 15:14
25 ပူးပေါင်းရင်းမြစ်များ  

దేవుడు క్రీస్తు గురించి మా సాక్ష్యాన్ని మీ మధ్య స్థిరపరస్తున్నారు కనుక,


ఒకరికి ఆత్మ ద్వారా జ్ఞాన సందేశం ఇవ్వబడింది, అదే ఆత్మ ద్వారా మరొకరికి విజ్ఞత సందేశం ఇవ్వబడింది.


నేను ప్రవచన వరాన్ని కలిగినా, అన్ని రహస్యాలను అర్థం చేసికోగలిగినా, సమస్త జ్ఞానం కలిగివున్నా, పర్వతాలను కూడా కదిలించగల గొప్ప విశ్వాసాన్ని కలిగివున్నా, నాలో ప్రేమ లేకపోతే నేను వ్యర్థమే.


విగ్రహాలకు అర్పించబడిన ఆహారాన్ని గురించి: “మనమందరం జ్ఞానం కలిగి ఉన్నాం” అని మనకు తెలుసు. అయితే జ్ఞానం అతిశయపడేలా చేస్తుంది కాని, ప్రేమ అభివృద్ధి కలుగజేస్తుంది.


ఎందుకంటే మీకున్న జ్ఞానంతో విగ్రహ ఆలయంలో నీవు తినడం బలహీనమైన మనస్సాక్షిగలవారు చూస్తే, వారు విగ్రహాలను అర్పించిన వాటిని తినడానికి ధైర్యం తెచ్చుకొంటారు గదా?


అయితే ఈ జ్ఞానం అందరికీ లేదు. కొందరు ఇప్పటికీ విగ్రహాలను ఆరాధించే వారు బలి అర్పించిన ఆహారాన్ని తిన్నప్పుడు తాము ఒక దేవతకు అర్పించింది తింటున్నామని భావిస్తున్నారు. అలా వారి మనస్సాక్షి బలహీనంగా ఉన్నందుకు అది అపవిత్రమవుతుంది.


అయితే మీరు విశ్వాసంలో, వాక్యంలో, జ్ఞానంలో, ఆసక్తిలో, మాపై మీకు గల ప్రేమలో శ్రద్ధలో అన్నిటిలో సమృద్ధిగలవారే, కనుక మీరు ధారాళంగా ఇవ్వడంలో కూడా సమృద్ధి గలవారుగా ఉండేలా చూసుకోండి.


ఎందుకంటే వెలుగు ఫలం సమస్త మంచితనాన్ని, నీతిని, సత్యాన్ని కలిగివుంటుంది.


నేను సంకెళ్ళలో ఉన్నా లేదా సువార్త గురించి వాదించడంలో దానిని స్ధిరపరచడంలో మీరందరు నాతో కూడా ఈ కృపలో భాగస్థులుగా ఉన్నారు, కనుక మీరు నా హృదయంలో ఉన్నారు. అందువల్ల మీ అందరి గురించి ఇలా భావించడం నాకు న్యాయమే.


సంగీతంతో, కీర్తనలతో, ఆత్మ సంబంధమైన పాటలతో సమస్త జ్ఞానంతో ఒకరికి ఒకరు బోధించుకుంటూ, హెచ్చరించుకుంటూ మీ హృదయాల్లో కృతజ్ఞతతో దేవుని గురించి పాటలు పాడుతూ, క్రీస్తు సువార్తను మీ మధ్యలో సమృద్ధిగా నివసింపనివ్వండి.


కనుక మీరిప్పుడు చేస్తున్నట్లుగానే ఒకరిని ఒకరు ప్రోత్సహించుకొంటూ ఒకరిని ఒకరు బలపరచుకోండి.


సహోదరీ సహోదరులారా, సోమరులను హెచ్చరించుమని, క్రుంగిపోయినవారిని ప్రోత్సాహించుమని, బలహీనులకు సహాయం చేయమని, ప్రతి ఒక్కరితో సహనం కలిగి ఉండుమని మేము మిమ్మల్ని వేడుకొంటున్నాము.


దీన్ని హృదయంలో ఉంచుకొని, మన దేవుడు మీకిచ్చిన పిలుపుకు మిమ్మల్ని ఆయన యోగ్యులుగా చేయాలని, ఆయన తన శక్తి చేత మీ ప్రతి ఉత్తమమైన కోరికను ఫలింపచేయాలని, మీ ప్రతి పని విశ్వాసం వలన జరగాలని మేము మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాం.


నీలో ఉన్న యదార్థమైన విశ్వాసాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నాను, అది మొదట నీ అమ్మమ్మ లోయిలోను తరువాత నీ తల్లియైన యునీకేలో ఉండింది. ఆ విశ్వాసమే ఇప్పుడు నీలో కూడా ఉందని నేను నమ్ముతున్నాను.


నేను అడిగిన దానికంటే ఎక్కువగా నీవు చేస్తావని తెలిసే, నీ విధేయత మీద నమ్మకంతో నేను నీకు వ్రాస్తున్నాను.


నిజానికి, ఈ సమయానికి మీరు బోధకులై ఉండాల్సింది, కాని ఇప్పటికి మీకు మరొకరు దేవుని వాక్యంలోని ప్రాథమిక సత్యాలను బోధించాల్సిన అవసరం ఉంది. బలమైన ఆహారం కాదు, మీకు పాలు అవసరం.


అయితే ప్రియమైనవారలారా, మేము ఇలా మాట్లాడుతున్నప్పటికి, మీ రక్షణ గురించి మంచి సంగతులు ఉన్నాయని మేము నిశ్చయంగా ఉన్నాం.


కనుక, మీకు తెలిసినవే అయినప్పటికి, మీరు అంగీకరించిన సత్యంలో స్థిరంగా ఉన్నప్పటికి నేను ఈ విషయాలను గురించి మీకు ఎల్లప్పుడు జ్ఞాపకం చేస్తాను.


మీకు సత్యం తెలియదని నేను మీకు వ్రాయడం లేదు కాని, సత్యం మీకు తెలుసు, సత్యం నుండి అబద్ధం పుట్టదని మీకు తెలుసు కనుకనే నేను మీకు వ్రాస్తున్నాను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ