Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




రోమా పత్రిక 14:18 - తెలుగు సమకాలీన అనువాదము

18 కాబట్టి ఇలా క్రీస్తుకు సేవ చేసేవారు దేవుని సంతోషపరుస్తారు, మానవుల అంగీకారాన్ని పొందుతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

18 ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైనవాడు దేవునికి ఇష్టుడును మనుష్యుల దృష్టికి యోగ్యుడునై యున్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

18 ఈ విధంగా క్రీస్తుకు సేవ చేసేవాడు దేవుని దృష్టికి ఇష్టమైన వాడు, మనుషుల దృష్టికి యోగ్యుడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

18 ఈ విధంగా క్రీస్తు సేవ చేసినవాణ్ణి దేవుడు మెచ్చుకొంటాడు. ఇతర్లు కూడా మెచ్చుకొంటారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

18 ఎందుకంటే క్రీస్తుకు సేవ చేసేవారు దేవునికి ఇష్టులును మానవుల దృష్టికి యోగ్యులుగా ఉన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

18 ఎందుకంటే క్రీస్తుకు సేవ చేసేవారు దేవునికి ఇష్టులును మానవుల దృష్టికి యోగ్యులుగా ఉన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




రోమా పత్రిక 14:18
29 ပူးပေါင်းရင်းမြစ်များ  

అది తన ఇల్లు విడిచి దూరదేశం వెళ్తున్న ఒక మనిషిని పోలి ఉంది: అతడు సేవకులకు అధికారం ఇచ్చి, ప్రతీ సేవకునికి వారి వారి పనులను అప్పగించి, ద్వారం దగ్గర ఉన్న వానికి కాపలా కాయమని చెప్తాడు.


నన్ను సేవించేవారు నన్ను వెంబడించాలి; అప్పుడు నేను ఎక్కడ ఉన్నానో నా సేవకులు అక్కడ ఉంటారు. ఇలా నన్ను సేవించే వానిని నా తండ్రి ఘనపరుస్తాడు.


కానీ ప్రతీ జనాల్లో ఆయనకు భయపడుతూ సరియైనది చేసేవారిని ఆయన స్వీకరిస్తారని నేను ఇప్పుడు స్పష్టంగా తెలుసుకున్నాను.


అత్యాసక్తి చూపడంలో ఎన్నడూ వెనుకబడవద్దు కాని మీరు ఆత్మీయ ఉత్సాహం కలిగి దేవుని సేవించండి.


మరొకరి సేవకుడికి తీర్పు తీర్చడానికి నీవు ఎవరు? ఆ సేవకుడు నిలిచివుండాలన్నా లేక పడిపోవాలన్నా అది అతని సొంత యజమాని చూసుకుంటాడు. ప్రభువు వారిని నిలబెట్టడానికి శక్తిగలవాడు కనుక వారు నిలబడతారు.


ఎందుకంటే అలాంటివారు మన ప్రభువైన క్రీస్తును సేవించరు కాని తమ సొంత ఆకలినే తీర్చుకొంటారు. వారు మృదువైన మాటలతో పొగడ్తలతో అమాయకులైనవారి మనస్సులను మోసం చేస్తారు.


అయితే ఇప్పుడు మీరు పాపం నుండి విడుదల పొంది దేవునికి దాసులు అయ్యారు, దాని వలన మీకు కలుగు ప్రయోజనం ఏంటంటే పరిశుద్ధతలోనికి నడిపించబడతారు. దానికి ఫలంగా నిత్యజీవాన్ని పొందుతారు.


ప్రభువులో విశ్వాసం ఉంచడానికి పిలువబడిన దాసులు, ప్రభువు వలన స్వాతంత్ర్యం పొందినవారు; అదే విధంగా, స్వతంత్రునిగా ఉండి పిలువబడిన వారు క్రీస్తుకు దాసులు.


అయితే రహస్యమైన సిగ్గుపడాల్సిన పనులను విడిచిపెట్టాము; మోసాన్ని చేయడం లేదు, దేవుని వాక్యాన్ని నాశనం చేయం. దానికి విరుద్ధంగా, సత్యాన్ని స్పష్టంగా ప్రకటించడం ద్వారా దేవుని దృష్టిలో ప్రతివాని మనస్సాక్షికి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం.


అయితే, ప్రభువుకు భయపడడం అంటే ఏమిటో మాకు తెలుసు, కనుక ఇతరులకు నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తాం. మనమేమైయున్నామో దేవునికి స్పష్టంగా తెలుసు, మీ మనస్సాక్షికి కూడ స్పష్టంగా తెలుసని నా నిరీక్షణ.


కాబట్టి మనం ఈ శరీరంలో ఉన్నా లేక దానికి దూరంగా ఉన్నా, ఆయనను సంతోషపెట్టడమే లక్ష్యంగా ఉందాం.


కాని, మేము దేవుని సేవకులంగా మాకు మేమే అన్ని విధాలుగా పొగడుకుంటాము: గొప్ప సహనంలో, సమస్యల్లో, కష్టాల్లో దుఃఖాల్లో;


కేవలం ప్రభువు దృష్టిలో మాత్రమే గాక, మనుష్యుల దృష్టికి కూడా మంచిది అనిపించిందే చేయాలని మేము బాధలు అనుభవిస్తున్నాము.


నేను సమృద్ధిగా పూర్తిగా పొందాను. మీరు పంపిన కానుకలు ఎపఫ్రొదితు నుండి అందుకున్నాను. అవి దేవునికి ఇష్టమైన పరిమళ అర్పణ, అంగీకారమైన త్యాగం.


చివరిగా, సహోదరీ సహోదరులారా, ఏదైనా యోగ్యమైనదిగా లేదా మంచిగా ఉంటే, సత్యమైన వాటి మీద, గొప్పవాటి మీద, న్యాయమైన వాటి మీద, పవిత్రమైన వాటి మీద, సుందరమైన వాటి మీద, ఘనమైన వాటి మీద మీ మనస్సులను పెట్టండి.


మీరు ప్రభువు నుండి స్వాస్థ్యాన్ని ప్రతిఫలంగా పొందుకుంటారని మీకు తెలుసు కనుక మీరు ప్రభువైన క్రీస్తునే సేవిస్తున్నారు.


ఇలాంటివి మంచివి; మన రక్షకుడైన దేవునికి ప్రీతికరమైనవి.


కాని ఏ విధవరాలికైన పిల్లలు గాని మనుమలు గాని ఉంటే, ఆ పిల్లలు ముందుగా తమ కుటుంబం పట్ల శ్రద్ధ వహించడం, తమ తల్లిదండ్రులను వారి తల్లిదండ్రులను గౌరవించడం ద్వారా తాము పాటించే ధర్మాన్ని ఆచరణలో పెట్టడం నేర్చుకోవాలి, ఇది దేవుని సంతోషపరుస్తుంది.


యూదులు కాని మిమ్మల్ని ఏ విషయాల్లో దూషిస్తున్నారో ఆ విషయాల్లో మీరు మంచి ప్రవర్తన కలవారై ఉండాలి. మీ సత్కార్యాలను వారు గుర్తించి, దేవుడు మనల్ని దర్శించే రోజున వారు దేవుని మహిమపరచగలరు.


ఎలాగంటే, పాపం చేసినందుకు ప్రతిఫలంగా వచ్చే శిక్షను ఓర్పుతో భరిస్తే దానిలో ఏం గొప్పతనం ఉన్నది? కాని మంచినే చేసి దాని కొరకు బాధను అనుభవించాల్సి వచ్చినపుడు ఓర్పుతో భరిస్తే, దేవుడు దానికై మిమ్మల్ని ఆశీర్వదిస్తారు.


మీరు సజీవమైన రాళ్లవలె ఆత్మీయ మందిరంగా నిర్మించబడుతున్నారు. యేసు క్రీస్తు ద్వారా, ప్రీతికరమైన ఆత్మీయ బలులను దేవునికి అర్పించడానికి మీరు పవిత్రమైన యాజకులుగా చేయబడ్డారు.


మీ మనస్సాక్షిని నిర్మలంగా ఉంచుకోండి, ఎలాగంటే, మిమ్మల్ని ఎవరైన దూషిస్తే, అప్పుడు క్రీస్తులో ఉన్న మీ మంచి ప్రవర్తన గురించి చెడుగా మాట్లాడేవారు తమ మాటలకు తామే సిగ్గుపడతారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ