Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




రోమా పత్రిక 1:6 - తెలుగు సమకాలీన అనువాదము

6 యేసుక్రీస్తుకు చెందినవారిగా ఉండడానికి పిలువబడిన యూదేతరుల మధ్య మీరు కూడా ఉన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 ఈయన నామం నిమిత్తం అన్ని జాతుల ప్రజలు విశ్వాసానికి విధేయులయ్యేలా ఈయన ద్వారా మేము కృప, అపొస్తలత్వం పొందాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

6 యేసు క్రీస్తుకు చెందిన వారవుటకు పిలువబడినవాళ్ళలో మీరు కూడా ఉన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 యేసు క్రీస్తుకు చెందినవారిగా ఉండడానికి పిలువబడిన ఆ ప్రజలతో పాటు మీరు కూడా ఉన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 యేసు క్రీస్తుకు చెందినవారిగా ఉండడానికి పిలువబడిన ఆ ప్రజలతో పాటు మీరు కూడా ఉన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




రోమా పత్రిక 1:6
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

అనగా యూదుల నుండి మాత్రమే కాకుండా యూదేతరుల నుండి కూడా ఆయనచే పిలువబడినవారమైన మనకొరకు తన మహిమైశ్వర్యాలను తెలియపరిస్తే ఏంటి?


తన కుమారుడు మన ప్రభువైన యేసు క్రీస్తు సహవాసంలోనికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు.


మీ గురించి నేను ఆశ్చర్యపడుతున్నాను ఎందుకంటే, క్రీస్తు కృపలో బ్రతుకడానికి మిమ్మల్ని పిలిచిన వానిని మీరు ఇంత త్వరగా వదిలివేసి, వేరొక సువార్త వైపుకు తిరుగుతున్నారు.


దేవుడు తన చిత్తప్రకారమైన సంకల్పాన్ని బట్టి, క్రీస్తులో ముందుగా నిరీక్షించిన మనము, తన మహిమకు కీర్తి తీసుకురావాలని నిర్ణయించి, ఆయన మనలను తన వారసులుగా ఏర్పరచుకున్నారు.


ఒకప్పుడు మీరు దేవుని నుండి దూరం అయ్యారు, మీ దుష్ట ప్రవర్తన వలన మీ మనస్సులో విరోధులయ్యారు.


అదే విధంగా, మీరు సువార్తను విని, దేవుని కృప గురించి నిజంగా గ్రహించిన రోజు నుండి అది మీ మధ్యలో ఫలించి వృద్ధి చెందుతున్న ప్రకారమే, ఈ సువార్త లోకమంతా ఫలిస్తూ వృద్ధి చెందుతుంది.


మిమ్మల్ని తన రాజ్యంలోనికి, మహిమలోనికి పిలిచే దేవునికి తగినట్లుగా మీరు జీవించాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తూ, ఆదరిస్తూ వేడుకొంటున్నాను.


మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు మహిమలో పాలుపొందేలా మా సువార్త ద్వారా దేవుడు మిమ్మల్ని పిలిచాడు.


దేవుడు మనల్ని రక్షించి, పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి పిలిచిన పిలుపు, మనం చేసిన మంచి పనులను బట్టి కాదు గాని, ఆయన ప్రణాళిక మరియు కృపను బట్టియే. ఆ కృప సృష్టి ఆరంభానికి ముందే క్రీస్తు యేసు మూలంగా మనకు ఇవ్వబడింది,


కనుక, పరలోక పిలుపులో భాగస్థులైన పరిశుద్ధ సహోదరీ సహోదరులారా, మన అపొస్తలునిగా ప్రధాన యాజకునిగా మనం అంగీకరించిన యేసు మీద మీ ఆలోచనలను ఉంచండి.


దీని కొరకే దేవుడు మిమ్మల్ని పిలిచాడు, ఎలాగంటే క్రీస్తే మీ కొరకు బాధపడి, ఆయన అడుగుజాడల్లో మీరు నడవడానికి ఒక మాదిరిని ఏర్పరిచారు.


కాని మీరైతే చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన దేవుని మంచితనాన్ని ప్రకటించడానికి ఎన్నుకోబడిన ప్రజలు, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని ప్రత్యేకమైన సొత్తైయున్నారు.


కాబట్టి, సహోదరీ సహోదరులారా, మీ పిలుపును ఎన్నికను నిశ్చయం చేసుకోవడానికి కృషి చేయండి. ఒకవేళ మీరు వీటిని చేస్తే, ఎన్నడూ త్రొట్రిల్లరు


యేసు క్రీస్తు సేవకుడు యాకోబు సహోదరుడైన యూదా, దేవునిచే పిలువబడి, తండ్రియైన దేవునిలో ప్రేమ కలిగి యేసు క్రీస్తు కొరకు సంరక్షించబడుతున్న వారికి శుభమని చెప్పి వ్రాయునది:


ఈ రాజులందరు మృగంతో పాటు కలిసి గొర్రెపిల్లకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తారు కాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు కనుక ఆయన వారందరి మీద విజయం పొందుతాడు. ఆయనతోపాటు ఆయనచే పిలువబడిన వారు, ఎన్నుకోబడినవారు ఆయనను నమ్మకంగా వెంబడించినవారు ఉంటారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ