Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




రోమా పత్రిక 1:3 - తెలుగు సమకాలీన అనువాదము

3 ఆయన శరీరరీత్య దావీదు వంశస్థుడు,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 మన తండ్రి అయిన దేవుని నుండీ, ప్రభు యేసు క్రీస్తు నుండీ కృప, సమాధానం మీకు కలుగు గాక.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

3 ఈ సువార్త దేవుని కుమారుడును మన ప్రభువును అయిన యేసు క్రీస్తును గురించి. ఆయన దావీదు వంశంలో మానవునిగా జన్మించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 ఆయన కుమారుని విషయానికి వస్తే, శరీరానుసారంగా ఆయన దావీదు సంతానానికి చెందినవారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 ఆయన కుమారుని విషయానికి వస్తే, శరీరానుసారంగా ఆయన దావీదు సంతానానికి చెందినవారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




రోమా పత్రిక 1:3
66 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఇది అబ్రాహాము సంతానమైన దావీదు సంతానం నుండి వచ్చిన మెస్సీయ యేసు వంశావళి:


యాకోబు కుమారుడు మరియకు భర్తయైన యోసేపు, యేసు అని పిలువబడిన క్రీస్తుకు తల్లి మరియ.


యెష్షయి కుమారుడు దావీదు, అతడు ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించిన రాజు. దావీదు కుమారుడు సొలొమోను, అతని తల్లి అంతకు ముందు ఊరియాకు భార్య,


కనుక ప్రజలందరు ఆశ్చర్యపడి, “ఈయనే దావీదు కుమారుడా?” అని చెప్పుకొన్నారు.


అక్కడ నివసించే ఒక కనాను స్త్రీ ఆయన దగ్గరకు వచ్చి, “ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించు! నా కుమార్తెకు దయ్యం పట్టి చాలా బాధపడుతోంది” అని కేకలు వేసింది.


అయితే యేసు మౌనంగా ఉన్నారు. అందుకు ప్రధాన యాజకుడు ఆయనతో, “జీవంగల దేవుని తోడని నిజం చెప్పు: ఒకవేళ నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే మాతో చెప్పు” అన్నాడు.


వీడు దేవుని నమ్మాడు. ‘నేను దేవుని కుమారుడనని’ చెప్పుకొన్నాడు కదా, దేవునికి ఇష్టమైతే దేవుడే ఇతన్ని తప్పిస్తాడు” అన్నారు.


మరియు పరలోకం నుండి ఒక స్వరం: “ఈయన నా కుమారుడు, నేను ప్రేమించే వాడు; ఈయన యందు నేను ఎంతో ఆనందిస్తున్నాను” అని చెప్పడం వినబడింది.


అక్కడి నుండి యేసు వెళ్తున్నప్పుడు ఇద్దరు గ్రుడ్డివారు “దావీదు కుమారుడా! మమ్మల్ని కరుణించు” అని కేకలువేస్తూ ఆయనను వెంబడించారు.


అందుకు ఆ దూత, “పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొంటుంది. కనుక పుట్టబోయే పవిత్ర శిశువు దేవుని కుమారుడని పిలువబడతాడు.


దేవుడు ముందుగానే తన పవిత్ర ప్రవక్తల ద్వారా పలికించినట్లు, తన సేవకుడైన దావీదు వంశంలో మనకొరకు రక్షణ కొమ్మును మొలిపించారు.


ఆ వాక్యం శరీరాన్ని ధరించుకొని మన మధ్య నివసించింది. మనం ఆయన మహిమను చూశాము, కృపాసత్య సంపూర్ణుడై, తండ్రి దగ్గర నుండి వచ్చిన, ఏకైక కుమారుని మహిమను చూశాము.


నేను చూసాను గనుక ఈయనే దేవుని కుమారుడని సాక్ష్యం ఇస్తున్నాను.”


అప్పుడు నతనయేలు, “రబ్బీ, నీవు దేవుని కుమారుడవు; నీవు ఇశ్రాయేలుకు రాజువు” అని సమాధానం ఇచ్చాడు.


నేను నా తండ్రి ఏకమై ఉన్నాం” అన్నారు.


తండ్రి తన స్వంతవానిగా ప్రత్యేకపరచుకొని లోకానికి పంపినవాని సంగతేమిటి? ‘నేను దేవుని కుమారుడను’ అని చెప్పినందుకు, దైవదూషణ అని నాపైన నేరం ఎందుకు మోపుతున్నారు?


తోమా ఆయనతో, “నా ప్రభువా, నా దేవా!” అన్నాడు.


అయితే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మడానికి, ఆయన నామంను నమ్మడం ద్వారా మీరు జీవాన్ని పొందుకోవాలని ఈ సంగతులను వ్రాసాను.


మరణించినవారు దేవుని కుమారుని స్వరం వినే సమయం వస్తుంది, అది ఇప్పుడు వచ్చే ఉంది. ఆయన స్వరాన్ని విన్న వారు తిరిగి జీవిస్తారని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.


క్రీస్తు దావీదు కుటుంబంలో నుండి మరియు దావీదు నివసించిన బేత్లెహేమనే ఊరి నుండి వస్తాడని లేఖనాలలో వ్రాయబడలేదా?” అని చెప్పుకొంటున్నారు.


అతడు ఒక ప్రవక్త మరియు దేవుడు అతని సంతానంలోని ఒకనిని అతని సింహాసనం మీద కూర్చోపెడతానని ఒట్టుపెట్టుకొని తనకు ప్రమాణం చేశాడని దావీదుకు తెలుసు.


మన పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు, అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచారు. మీరు ఆయనను చంపబడటానికి అప్పగించారు, పిలాతు ఆయనను విడుదల చేయాలని నిర్ణయించుకొన్నప్పటికి, మీరు అతని ముందు క్రీస్తును తిరస్కరించారు.


వారు దారిలో వెళ్తునప్పుడు, నీళ్ళువున్న చోటికి వారు వచ్చారు, అప్పుడు ఆ నపుంసకుడు, “చూడండి, ఇక్కడ నీళ్ళున్నాయి కదా, నేను బాప్తిస్మం పొందడానికి ఇక ఆటంకం ఏమిటి?” అని అడిగాడు. [


యేసే దేవుని కుమారుడని సమాజమందిరాలలో ప్రకటించడం మొదలుపెట్టాడు.


నేను నిరంతరం నా ప్రార్థనలలో మిమ్మల్ని గుర్తు చేసుకుంటాను అనడానికి, తన కుమారుని గురించిన సువార్తను ప్రకటిస్తూ నా ఆత్మలో నేను ఎవరిని సేవిస్తున్నానో ఆ దేవుడే సాక్షి.


అయితే శరీరరీతిగా మన పూర్వికుడైన అబ్రాహాము ఈ విషయంలో ఏమి తెలుసుకున్నాడు అని మనం అనవచ్చు?


నా సొంత జాతి వారైన, ఇశ్రాయేలీయుల కొరకు క్రీస్తు నుండి విడిపోయి శపించబడిన వానిగా ఉండాలని కోరుకుంటాను.


పితరులు వారి వారే, అందరికి దేవుడైన క్రీస్తు మానవ వంశావళి వారిలో నుండే గుర్తించబడింది. నిత్యం స్తుతింపబడునుగాక! ఆమేన్.


తన కుమారుడు మన ప్రభువైన యేసు క్రీస్తు సహవాసంలోనికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు.


ఇశ్రాయేలు ప్రజలారా చూడండి: బలి అర్పించిన వాటిని తిన్నవారు బలిపీఠంలో భాగస్థులు కారా?


అయితే నియమించబడిన కాలం పూర్తి అయినప్పుడు, దేవుడు తన కుమారున్ని, ధర్మశాస్త్ర ఆధీనంలో, ఒక స్త్రీ ద్వారా జన్మింపజేసారు,


మరణం నుండి ఆయన లేపిన, రాబోయే ఉగ్రత నుండి మనల్ని కాపాడబోవుచున్న, పరలోకం నుండి రాబోతున్న ఆయన కుమారుడైన యేసు కొరకు మీరు ఎంతగా ఎదురుచూస్తున్నారో వారే చెప్తున్నారు.


ఎందుకంటే, దేవుడు ఒక్కడే; క్రీస్తు యేసు ఒక్కడే మానవునిగా ఉండి, దేవునికి మానవులకు మధ్యలో ఒక మధ్యవర్తిగా ఉన్నారు.


నిస్సందేహంగా నిజమైన దైవభక్తిని గురించిన మర్మం గొప్పది, అది ఏంటంటే: ఆయన శరీరంతో ప్రత్యక్షమయ్యారు, పవిత్రాత్మ ఆయనను నీతిమంతుడని నిరూపించాడు, దేవదూతలు ఆయనను చూసారు, ఆయన గురించి భూరాజ్యాలన్నిటిలో ప్రజలు ప్రకటించారు, ఆయన గురించి లోకమంతా నమ్మింది, ఆయనను దేవుడు మహిమలోనికి తీసుకొనివెళ్ళారు.


మహారాజైన దావీదు సంతానంగా పుట్టిన యేసు క్రీస్తు మృతులలో నుండి సజీవంగా లేచారని గుర్తుంచుకో. యిదే నేను ప్రకటించిన సువార్త.


తండ్రితో కుమారుడైన యేసుక్రీస్తుతో మాకు గల సహవాసంలో మీరు కూడ మాతో చేరేలా, మేము చూచిన వాటిని విన్నవాటిని మీకు ప్రకటిస్తున్నాము.


ఆయన ఆజ్ఞ ఇదే: ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నామంలో విశ్వాసం ఉంచి, ఆయన మనకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి.


సాతాను మొదటి నుండి పాపం చేస్తున్నాడు, కనుక పాపం చేసేవారు సాతాను సంబంధులు, సాతాను కార్యాలను నాశనం చేయడానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యారు.


యేసు దేవుని కుమారుడని ఎవరు ఒప్పుకుంటారో, వారిలో దేవుడు, వారు దేవునిలో జీవిస్తారు.


యేసే క్రీస్తు అని విశ్వసించే ప్రతి ఒక్కరు దేవుని మూలంగా పుట్టినవారే. తండ్రిని ప్రేమించే ప్రతి ఒక్కరు ఆయన కుమారుని కూడా ప్రేమిస్తారు.


మనం సత్యవంతుడైన వానిని తెలుసుకునేలా చేయడానికి, దేవుని కుమారుడు వచ్చాడని, మనకు తెలివిని ఇచ్చారని మనకు తెలుసు. ఆయన కుమారుడైన యేసు క్రీస్తునిలో ఉండుట ద్వారా సత్యవంతునిలో మనం ఉన్నాం. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవం.


లోకాన్ని ఎవరు జయించగలరు? యేసు దేవుని కుమారుడని నమ్మినవారు మాత్రమే కదా.


ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, యేసు క్రీస్తు మానవ శరీరంతో వచ్చారని ఒప్పుకొనని చాలామంది మోసగాళ్ళు లోకంలో బయలుదేరారు. అలాంటి వాడు మోసగాడు, క్రీస్తు విరోధి.


“తుయతైరలో ఉన్న సంఘ దూతకు వ్రాసే సందేశం: అగ్ని జ్వాలల్లాంటి కళ్ళు, తళతళ మెరుస్తున్న కంచును పోలిన పాదాలు గల దేవుని కుమారుడు ఈ మాటలు చెప్తున్నాడు:


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ