Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




రోమా పత్రిక 1:1 - తెలుగు సమకాలీన అనువాదము

1 పౌలు అనే, క్రీస్తు యేసు దాసుడనైన నేను, అపొస్తలునిగా ఉండడానికి పిలువబడి దేవుని సువార్త కొరకు ప్రత్యేకపరచబడ్డాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 యేసు క్రీస్తు దాసుడును, అపొస్తలుడుగా నుండు టకు పిలువబడినవాడును,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 యేసు క్రీస్తు దాసుడు, అపోస్తలుడుగా పిలుపు పొందినవాడు, దేవుని సువార్త కోసం ప్రభువు ప్రత్యేకించుకున్న

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

1 యేసు క్రీస్తు సేవకుడైన పౌలు నుండి: దేవుడు తన అపొస్తలునిగా పని చేయటానికి రమ్మని నన్ను పిలిచినాడు. దేవుని సువార్తను ప్రకటించటానికి నన్ను ప్రత్యేకించినాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 అపొస్తలునిగా ఉండడానికి పిలువబడి దేవుని సువార్త కోసం ప్రత్యేకపరచబడిన పౌలు అనే నేను క్రీస్తు యేసు దాసుడను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 అపొస్తలునిగా ఉండడానికి పిలువబడి దేవుని సువార్త కోసం ప్రత్యేకపరచబడిన పౌలు అనే నేను క్రీస్తు యేసు దాసుడను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




రోమా పత్రిక 1:1
73 ပူးပေါင်းရင်းမြစ်များ  

యోహాను చెరసాలలో వేయబడిన తర్వాత, యేసు దేవుని సువార్తను ప్రకటిస్తూ, గలిలయకు వెళ్లారు.


నన్ను సేవించేవారు నన్ను వెంబడించాలి; అప్పుడు నేను ఎక్కడ ఉన్నానో నా సేవకులు అక్కడ ఉంటారు. ఇలా నన్ను సేవించే వానిని నా తండ్రి ఘనపరుస్తాడు.


నేను మిమ్మల్ని సేవకులని ఇక పిలువను. ఎందుకంటే ఏ సేవకునికైనా తన యజమానుడు చేసే పనులు తెలియవు. నేనైతే మిమ్మల్ని స్నేహితులనే పిలిచాను. ఎందుకంటే నేను నా తండ్రి నుండి విన్న విషయాలన్నింటిని మీకు తెలియజేసాను.


నేను మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసికొండి: ‘ఏ సేవకుడు తన యజమాని కన్నా గొప్పవాడు కాడు,’ వారు నన్ను హింసిస్తే, మిమ్మల్ని కూడా హింసిస్తారు. వారు నా బోధకు లోబడి ఉంటే, వారు మీ బోధకు కూడా లోబడుతారు.


అప్పుడు పౌలు అనబడే సౌలు పరిశుద్ధాత్మతో నింపబడి, ఎలీమాస్ వైపు నేరుగా చూస్తూ,


అయినా కాని, నా జీవితం నాకు విలువైనది కాదని నేను భావిస్తున్నాను; ప్రభువైన యేసు నా ముందు ఉంచిన పరుగు పందెంను పూర్తి చేసి, దేవుని కృపను గురించిన సువార్తను ప్రకటించాలని ఆయన నాకు ఇచ్చిన పనిని పూర్తి చేయడమే నా ఏకైక లక్ష్యంగా ఉంది.


అధిపతి అనుమతితో, పౌలు మెట్ల మీద నిలబడి ప్రజలకు సైగ చేశాడు. వారందరు నిశ్శబ్దంగా వున్నప్పుడు, హెబ్రీ భాషలో వారితో మాట్లాడడం మొదలుపెట్టాడు.


“అప్పుడు ప్రభువు నాతో, ‘నీవు వెళ్లు, నేను నిన్ను వీరి నుండి దూరంగా యూదేతరుల దగ్గరకు పంపిస్తాను’ అని చెప్పారు.”


నేను నేల మీద పడి ఒక స్వరం నాతో, ‘సౌలా, సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు?’ అనడం విన్నాను.


అప్పుడు అగ్రిప్ప రాజు పౌలుతో, “నీ సమాధానం చెప్పుకోవడానికి నిన్ను అనుమతిస్తున్నాను” అన్నాడు. కనుక పౌలు తన చేయి చాపి సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు:


అప్పుడు మేమందరం నేల మీద పడిపోయాం, అప్పుడు హెబ్రీ భాషలో నాతో, ‘సౌలా, సౌలా, నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు? మునికోలకు ఎదురు తన్నడం నీకు కష్టం’ అని ఒక స్వరం చెప్పడం విన్నాను.


నేను ఎవరికి చెందిన వాడినో, నేను ఎవరిని సేవిస్తున్నానో ఆ దేవుని దూత నిన్న రాత్రి నా ప్రక్కన నిలబడి,


అయితే ప్రభువు అననీయతో, “వెళ్లు! ఇతడు ఇశ్రాయేలీయులకు మరియు యూదేతరులకు మరియు వారి రాజులకు నా నామంను ప్రకటించడానికి నేను ఏర్పరచుకున్న నా సాధనం.


సువార్త గురించి నేను సిగ్గుపడను, ఎందుకంటే, నమ్మిన ప్రతివారికి అనగా మొదట యూదులకు తరువాత యూదేతరులకు రక్షణ కలుగచేయడానికి సువార్త దేవుని శక్తి.


యూదేతరులనందరిని ఆయన నామం కొరకు, విశ్వాసం నుండి వచ్చే విధేయతలోకి పిలువడానికి ఆయన ద్వారా మేము కృపను అపొస్తలత్వాన్ని పొందాము.


నేను నిరంతరం నా ప్రార్థనలలో మిమ్మల్ని గుర్తు చేసుకుంటాను అనడానికి, తన కుమారుని గురించిన సువార్తను ప్రకటిస్తూ నా ఆత్మలో నేను ఎవరిని సేవిస్తున్నానో ఆ దేవుడే సాక్షి.


యూదేతరులైన మీతో నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే యూదేతరులకు అపొస్తలునిగా నేను ఉన్నాను కనుక నా పరచర్యలో నేను గర్వపడుతూ,


పరిశుద్ధాత్మచేత పరిశుద్ధపరచబడి దేవునికి అంగీకారయోగ్యమైన అర్పణగా యూదేతరులు మారేలా దేవుని సువార్తను ప్రకటించడమనే యాజక ధర్మాన్ని ఆయన నాకు ఇచ్చారు.


నేను మీ దగ్గరకు వచ్చేటప్పుడు క్రీస్తు యొక్క పరిపూర్ణమైన దీవెనలతో వస్తానని నాకు తెలుసు.


ఎందుకంటే అలాంటివారు మన ప్రభువైన క్రీస్తును సేవించరు కాని తమ సొంత ఆకలినే తీర్చుకొంటారు. వారు మృదువైన మాటలతో పొగడ్తలతో అమాయకులైనవారి మనస్సులను మోసం చేస్తారు.


యూదేతరులంతా విశ్వాసానికి విధేయులు కావాలని, అనాది కాలం నుండి రహస్యంగా దాచబడి, ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మం, నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారం వ్రాయబడిన ప్రవచనాత్మక లేఖనాల ద్వారా ఇప్పుడు వారికి తెలియపరచబడింది. ఆ మర్మానికి అనుగుణంగా నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు గురించిన సువార్త ప్రకారం మిమ్మల్ని స్థిరపరచగల సమర్థుడును ఏకైక జ్ఞానవంతుడునైన దేవునికి యేసు క్రీస్తు ద్వారా శాశ్వత మహిమ కలుగును గాక! ఆమేన్.


దేవుని చిత్తం ద్వారా క్రీస్తు యేసుని అపొస్తలునిగా ఉండడానికి పిలువబడిన పౌలు, మన సహోదరుడైన సొస్తెనేసు,


నేను స్వతంత్రున్ని కానా? నేను అపొస్తలుడను కానా? మన ప్రభువైన యేసును నేను చూడలేదా? ప్రభువులో నేను చేసిన పనికి ఫలితం మీరు కారా?


పౌలు, దేవుని చిత్తం బట్టి క్రీస్తు యేసు అపొస్తలుడు మన సోదరుడు తిమోతి, కొరింథీలోని దేవుని సంఘానికి, అకయ ప్రాంతమంతటిలోని దేవుని పరిశుద్ధులందరికి కలిపి వ్రాయునది:


“శ్రేష్ఠులైన అపొస్తలుల” కంటే నేను ఏ మాత్రం తక్కువ కాదని నేను అనుకుంటున్నాను.


దేవుని సువార్తను మీకు ఉచితంగా బోధించి, మిమ్మల్ని గొప్పవారిని చేయడానికి నన్ను నేను తగ్గించుకొని పాపం చేసానా?


నన్ను నేనే అవివేకిగా చేసుకున్నాను, కాని నన్ను అలా నడిపించింది మీరే. నేను మీ నుండి మెప్పుపొందాల్సింది, ఎందుకంటే, నేను వ్యర్థుడనైనా మీ “శ్రేష్ఠమైన అపొస్తలుల” కంటె ఏ విధంగాను తీసిపోను.


క్రీస్తుని గురించిన సువార్తను బోధించడానికి నేను త్రోయకు చేరినప్పుడు ప్రభువు నా పనికి అప్పటికే అక్కడ మార్గం సిద్ధపరచి ఉంచారని తెలుసుకున్నాను.


ఎందుకంటే, మేము బోధిస్తుంది మా గురించి కాదు, కాని యేసు క్రీస్తు ప్రభువని, యేసు కొరకు మేము మీ సేవకులమని బోధిస్తున్నాము.


పౌలు, అనే నేను మనుష్యుల నుండి గాని లేక ఒక వ్యక్తి వలన గాని పంపబడలేదు, కాని యేసు క్రీస్తు, ఆయనను మరణం నుండి తిరిగి లేపిన తండ్రియైన దేవుని వలన అపొస్తలునిగా పంపబడ్డాను.


దేవుని చిత్తాన్ని బట్టి క్రీస్తు యేసు అపొస్తలుడైన పౌలు, ఎఫెసులో ఉన్న క్రీస్తు యేసునందు నమ్మకస్థులైన, దేవుని పరిశుద్ధ ప్రజలకు వ్రాయునది:


మీరు కూడా సత్య వాక్యాన్ని అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తులో విశ్వాసం ఉంచినప్పుడు వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మచేత ముద్రించబడి యున్నారు.


మనం విశ్వాసంలో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఐక్యతను పొందేవరకు, క్రీస్తు యొక్క పరిపూర్ణతకు సమానమైన పరిపూర్ణత గల వారం అయ్యేవరకు క్రీస్తు శరీరమైన సంఘం కట్టబడునట్లు తన ప్రజలను పరిచర్య కొరకు సిద్ధపరచడానికి, క్రీస్తే అపొస్తలులను, ప్రవక్తలను, సువార్తికులను, కాపరులను, బోధకులను అనుగ్రహించారు.


క్రీస్తు యేసు సేవకులైన పౌలు మరియు తిమోతి, క్రీస్తు యేసునందు ఫిలిప్పీలో ఉన్న దేవుని పవిత్ర ప్రజలకు, సంఘ పరిచారకులకు, సంఘ పెద్దలకు శుభమని చెప్పి వ్రాయునది:


ప్రతి నాలుక యేసు క్రీస్తే ప్రభువని ఒప్పుకుంటుంది, తండ్రియైన దేవునికి మహిమ కలుగును గాక.


దేవుని చిత్తాన్ని బట్టి క్రీస్తు యేసు అపొస్తలుడైన పౌలు, మన సహోదరుడైన తిమోతి శుభమని చెప్పి వ్రాయునది:


మీకు దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా తెలియజేయడానికి, దేవుడు నాకు అప్పగించిన బాధ్యతను బట్టి సంఘానికి సేవకుడినయ్యాను.


మీకు తెలిసినట్టే, మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి దౌర్జన్యాన్ని అనుభవించాము కాని మన దేవుని సహాయంతో తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతున్నా ధైర్యంతో ఆయన సువార్తను మీకు అందజేసాం


మేమైతే మిమ్మల్ని చూసుకున్నాము. మిమ్మల్ని ఎంతో ప్రేమించాము, కాబట్టి మీతో దేవుని సువార్తను పంచుకోవడమే కాకుండా మా జీవితాలను కూడా మీతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాము.


సహోదరీ సహోదరులారా! మేము పడ్డ మా ప్రయాసాన్ని మా కష్టాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, మేము ఎవరికి భారంగా ఉండకూడదని దేవుని సువార్తను మీ మధ్య ప్రకటించినప్పుడు, మేము రాత్రింబవళ్ళు పని చేసి మమ్మల్ని మేము పోషించుకున్నాము.


మన రక్షకుడైన దేవుని, మన నిరీక్షణయైన క్రీస్తు యేసు ఆజ్ఞ వలన క్రీస్తు యేసు యొక్క అపొస్తలుడైన పౌలు,


దీని కోసమే నేను ప్రకటించేవానిగా, అపొస్తలునిగా యూదేతరులకు నమ్మకమైన బోధకునిగా ఉండడానికి నియమించబడ్డాను, నేను చెప్పేది నిజం నేను అబద్ధం చెప్పడం లేదు.


ఈ సువార్తను ప్రకటించడానికి, బోధించడానికి అపొస్తలునిగా నేను నియమించబడ్డాను.


దేవుడు ఎన్నుకొన్నవారి విశ్వాసాన్ని, నిత్యజీవం గురించిన నిరీక్షణలో ఉండే దైవభక్తిలోనికి నడిపించే, వారి సత్యజ్ఞానాన్ని బలపరచడానికి,


ఈ గౌరవాన్ని ఎవరు తమంతట తాము పొందలేరు, కాని అహరోను ఎలా పిలువబడ్డాడో అలాగే దేవుని చేత పిలువబడినప్పుడు వారు దానిని పొందుకుంటారు.


పరిశుద్ధుడు, నిందారహితుడు, పవిత్రుడు, పాపుల నుండి ప్రత్యేకించబడినవాడు, ఆకాశాల కంటే పైగా హెచ్చించబడినవాడై వుండి మన అవసరాలను తీర్చగల ప్రధాన యాజకుడు.


దేవునికి ప్రభువైన యేసుక్రీస్తుకు సేవకుడనైన, యాకోబు, వివిధ దేశాలకు చెదిరిపోయిన పన్నెండు గోత్రాల వారికి వ్రాయునది: మీకు శుభాలు.


తీర్పు మొదలయ్యే సమయం ఆసన్నమైనది; దేవుని ఇంటివారే ముందుగా తీర్పు తీర్చబడతారు, అది మనతోనే మొదలైతే దేవుని సువార్తను నమ్మనివారి గతి ఏంటి?


యేసు క్రీస్తు సేవకుడు అపొస్తలుడైన సీమోను పేతురు, మన దేవుడు రక్షకుడైన యేసు క్రీస్తు నీతిని బట్టి మావలె అమూల్యమైన విశ్వాసం పొందినవారికి వ్రాయునది.


యేసు క్రీస్తు సేవకుడు యాకోబు సహోదరుడైన యూదా, దేవునిచే పిలువబడి, తండ్రియైన దేవునిలో ప్రేమ కలిగి యేసు క్రీస్తు కొరకు సంరక్షించబడుతున్న వారికి శుభమని చెప్పి వ్రాయునది:


త్వరలో సంభవించబోయే వాటి గురించి దేవుడు తన సేవకులకు కనుపరచడానికి యేసుక్రీస్తుకు ఇచ్చిన ప్రత్యక్షత. ఆయన తన దూతను తన సేవకుడైన యోహాను దగ్గరకు పంపి ఈ సంగతులను తెలియజేసారు.


అప్పుడు ఆ దేవదూత నాతో, “ఈ మాటలు నమ్మదగినవి సత్యమైనవి. ప్రవక్తల ఆత్మలను ప్రేరేపించే ప్రభువైన దేవుడు తన సేవకులకు త్వరలో జరుగబోయే సంగతులను చూపించడానికి తన దూతను పంపాడు” అని చెప్పాడు.


కాని అతడు నాతో, “నీవు అలా చేయవద్దు! ఈ గ్రంథపు చుట్టలో వ్రాయబడిన మాటలను పాటించేవారిలా, నీ తోటి ప్రవక్తల్లా నేను కూడా నీ తోటి సేవకుడనే. కనుక దేవున్నే ఆరాధించు!” అని చెప్పాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ