Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ప్రకటన 7:2 - తెలుగు సమకాలీన అనువాదము

2 అప్పుడు నేను మరొక దేవదూత జీవంగల దేవుని ముద్రను కలిగి తూర్పు దిక్కు నుండి మీదికి రావడం చూసాను. ఆ దేవదూత భూమికి సముద్రానికి హాని కలిగించే అనుమతిని పొందిన ఆ నలుగురు దూతలతో బిగ్గరగా,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

2 మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగజేయుటకై అధికారముపొందిన ఆ నలు గురు దూతలతో

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

2 మరొక దూత తూర్పు దిక్కు నుండి పైకి లేవడం నేను చూశాను. అతనికి సజీవ దేవుని సీలు ఉంది. భూమికీ సముద్రానికీ హని చేయడానికి అనుమతి ఉన్న మొదటి నలుగురు దూతలతో అతడు బిగ్గరగా

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

2 అతడు వారిని పిలిచాడు. ఈ నలుగురి దూతలకు భూమికి, సముద్రానికి హాని చేయగల శక్తి ఉంది. మరొక దూత తూర్పునుండి రావటం చూసాను. అతని దగ్గర చిరంజీవి అయిన దేవుని ముద్ర ఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

2 అప్పుడు నేను మరొక దేవదూత జీవంగల దేవుని ముద్రను కలిగి తూర్పుదిక్కు నుండి పైకి రావడం చూశాను. ఆ దేవదూత భూమికి సముద్రానికి హాని కలిగించడానికి అనుమతిని పొందిన ఆ నలుగురు దూతలతో బిగ్గరగా,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

2 అప్పుడు నేను మరొక దేవదూత జీవంగల దేవుని ముద్రను కలిగి తూర్పుదిక్కు నుండి పైకి రావడం చూశాను. ఆ దేవదూత భూమికి సముద్రానికి హాని కలిగించడానికి అనుమతిని పొందిన ఆ నలుగురు దూతలతో బిగ్గరగా,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ప్రకటన 7:2
29 ပူးပေါင်းရင်းမြစ်များ  

అందుకు సీమోను పేతురు, “నీవు క్రీస్తువు, సజీవుడైనా దేవుని కుమారుడవు” అని చెప్పాడు.


అయితే యేసు మౌనంగా ఉన్నారు. అందుకు ప్రధాన యాజకుడు ఆయనతో, “జీవంగల దేవుని తోడని నిజం చెప్పు: ఒకవేళ నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే మాతో చెప్పు” అన్నాడు.


మీరు పాడైపోయే ఆహారం కొరకు ప్రయాసపడకండి కానీ మనుష్యకుమారుడు మీకిచ్చే నిరంతరం నిలిచివుండే ఆహారం కొరకు ప్రయాసపడండి. ఎందుకంటే తండ్రియైన దేవుడు దానిని మీకు ఇవ్వడానికే ఆయనపై తన ఆమోద ముద్ర వేసారు” అని చెప్పారు.


ఆయనే తన ముద్రను మనపై వేసి మనల్ని తన వారిగా ప్రకటించారు. ఆయన మనకిచ్చిన వాటిని ధృవపరచడానికి మన హృదయాల్లో పవిత్రాత్మను అనుగ్రహించరు.


మీరు కూడా సత్య వాక్యాన్ని అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తులో విశ్వాసం ఉంచినప్పుడు వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మచేత ముద్రించబడి యున్నారు.


విమోచన దినం కొరకు మీరు ఎవరితో ముద్రించబడ్డారో ఆ దేవుని పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకండి.


ఎందుకంటే మీరు మాకు ఇచ్చిన ఆతిథ్యం ఎలాంటిదో వారే సాక్ష్యమిస్తున్నారు. సజీవుడైన నిజమైన దేవుణ్ని సేవించడానికి మీరు విగ్రహాలను విడిచిపెట్టి ఎలా దేవుని వైపుకు తిరిగారో,


అయితే దేవుని యొక్క పునాది స్థిరంగా నిలిచివుండి, దానిపై ఈ విధంగా ముద్ర వేయబడివుంది: “తన వారు ఎవరో ప్రభువుకు తెలుసు, ప్రభువు నామాన్ని ఒప్పుకొనే ప్రతివారు దుష్టత్వం నుండి తొలగిపోవాలి.”


అయితే మీరు సీయోను పర్వతానికి, సజీవ దేవుని పట్టణమైన పరలోకపు యెరూషలేముకు వచ్చారు. మీరు సంతోషకరమైన సభలో వేలాదిమంది దేవదూతల దగ్గరకు వచ్చారు.


సమయం సమీపంగా ఉంది కనుక ఈ ప్రవచన వాక్యాలను బిగ్గరగా చదివేవారు ధన్యులు, దానిలో వ్రాయబడిన వాటిని విని వాటి ప్రకారం నడుచుకొనేవారు ధన్యులు.


బలమైన మరొక దేవదూత మేఘాన్ని ధరించుకొని, తన తల మీద వానవిల్లు కలిగి పరలోకం నుండి దిగి రావడం నేను చూసాను. ఆ దేవదూత ముఖం సూర్యునిలా, కాళ్ళు అగ్ని స్తంభాల్లా ఉన్నాయి.


ఆ ఏడు ఉరుముల గర్జనలను విన్న నేను వాటి గురించి వ్రాస్తు ఉన్నప్పుడు పరలోకం నుండి ఒక స్వరం నాతో, “ఈ గర్జనలను గురించి వ్రాయకు, వాటిని గుప్తంగా ఉంచాలి” అని చెప్పడం విన్నాను.


ఆరో దేవదూత యూఫ్రటీసు అనే మహానది మీద తన పాత్రను కుమ్మరించినప్పుడు, తూర్పు నుండి రాజులు వచ్చేలా మార్గం సిద్ధపరచడానికి ఆ నది పూర్తిగా ఎండిపోయింది.


అప్పుడు ఒక శక్తిగల దేవదూత బిగ్గరగా, “చుట్టబడి ఉన్న ఈ ముద్రలను విప్పి గ్రంథపు చుట్టను తెరవగలిగే యోగ్యుడు ఎవరు?” అని ప్రకటన చేస్తుంటే నేను చూసాను.


ధూపం వేసే బంగారు పాత్రను పట్టుకొన్న మరొక దేవదూత వచ్చి బలిపీఠం దగ్గర నిలబడ్డాడు. సింహాసనం ముందు ఉన్న బంగారు బలిపీఠం మీద దేవుని ప్రజలందరి ప్రార్థనలతో కలిపి అర్పించడానికి గొప్ప పరిమాణంలో ధూపద్రవ్యాలు అతనికి ఇవ్వబడ్డాయి.


ఆ స్వరం బూర ఊదిన ఆ ఆరో దేవదూతతో, “యూఫ్రటీసు అనే మహానది దగ్గర బంధించబడి ఉన్న నలుగురు దూతలను విడిపించు” అని చెప్పాడు.


భూమి మీద మొలిచే గడ్డికి కాని, పచ్చని మొక్కలకు కాని, చెట్లకు కాని హాని చేయకూడదు కాని ఏ మనిషి నుదుటి మీద దేవుని ముద్ర లేదో వానికే హాని చేయాలని వాటికి ఆజ్ఞ ఇవ్వబడింది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ