Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ప్రకటన 6:9 - తెలుగు సమకాలీన అనువాదము

9 ఆ వధించబడిన గొర్రెపిల్ల ఐదవ ముద్రను విప్పినప్పుడు, దేవుని వాక్యం బట్టి, తాము ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వధించబడిన వారి ఆత్మలను ఒక బలిపీఠం క్రింద చూసాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 ఆయన అయిదవ ముద్రను విప్పినప్పుడు, దేవుని వాక్యము నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడినవారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 ఆయన అయిదవ సీలు తెరచినప్పుడు దేవుని వాక్కు కోసమూ, తమ సాక్ష్యం కారణంగానూ హతమైన వారి ఆత్మలను ఒక బలిపీఠం కింద చూశాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

9 ఆ గొఱ్ఱెపిల్ల ఐదవ ముద్రను తీసినప్పుడు, వధింపబడిన ఆత్మల్ని బలిపీఠం క్రింద చూసాను. వీళ్ళు దేవుని సందేశాన్ని బోధించటంవల్ల మరియు సాక్ష్యం చెప్పటంవల్ల వధింపబడినవాళ్ళు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 ఆ వధించబడిన గొర్రెపిల్ల అయిదవ ముద్రను విప్పినప్పుడు, దేవుని వాక్యం బట్టి తాము ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వధించబడిన వారి ఆత్మలను ఒక బలిపీఠం క్రింద చూశాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 ఆ వధించబడిన గొర్రెపిల్ల అయిదవ ముద్రను విప్పినప్పుడు, దేవుని వాక్యం బట్టి తాము ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వధించబడిన వారి ఆత్మలను ఒక బలిపీఠం క్రింద చూశాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ప్రకటన 6:9
21 ပူးပေါင်းရင်းမြစ်များ  

వారు మిమ్మల్ని సమాజమందిరంలో నుండి వెలివేస్తారు; నిజానికి, మిమ్మల్ని చంపినవారు, దేవుని కొరకు మంచి పని చేస్తున్నామని భావించే ఒక సమయం వస్తుంది.


కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మనం సంపూర్ణ నమ్మకం కలిగి ఈ శరీరానికి దూరంగా ఉండి, ప్రభువుతో ఆయన ఇంట్లో ఉండాలని ఎంతగానో ఇష్టపడుతున్నాము.


ఈ రెండింటికి మధ్య నేను నలిగిపోతున్నాను. నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి క్రీస్తుతో కూడా ఉండాలని నా ఆశ, అది నాకు చాలా మంచిది.


మీ విశ్వాస యాగంలో సేవలో పానార్పణగా నేను పోయబడినప్పటికి, మీతో కలిసి సంతోషించి ఆనందిస్తాను.


కనుక నీవు మన ప్రభువు కొరకు సాక్ష్యమివ్వడానికి గాని ఆయన కొరకు బంధీనై ఉన్న నా గురించి కాని సిగ్గుపడకు. దానికి బదులు దేవుని శక్తిని బట్టి సువార్త కొరకు నాతో పాటు కలిసి శ్రమలను అనుభవించడానికి సిద్ధపడు.


ఇప్పటికే నేను దేవుని యెదుట పానార్పణగా పోయబడుతున్నాను. నేను వెళ్ళవలసిన సమయం దగ్గరలోనే ఉంది.


పరలోకంలో పేర్లు వ్రాయబడిన ఉన్న దేవుని జ్యేష్ఠ సంతానమనే సంఘానికి మీరు వచ్చారు. మనుష్యులందరికి న్యాయాధిపతియైన దేవుని దగ్గరకు, నిర్దోషులుగా తీర్చబడిన నీతిమంతుల్లా పరిపూర్ణత పొందిన ఆత్మల దగ్గరకు మీరు వచ్చారు.


అతడు దేవుని వాక్యం గురించి, యేసు క్రీస్తు సాక్ష్యం గురించి తాను చూసిన వాటన్నిటిని గురించి సాక్ష్యమిస్తున్నాడు.


యోహాను అనే నేను మీ సహోదరున్ని, యేసులో మనకు కలిగే శ్రమ, రాజ్యం, దీర్ఘ సహనంలో మీతో పాలిభాగస్థుడనైన నేను దేవుని వాక్యం కొరకు, యేసు సాక్ష్యం కొరకు పత్మాసు ద్వీపంలో బంధీగా ఉన్నాను.


మరో దేవదూత బలిపీఠం నుండి వచ్చాడు. అతనికి బలిపీఠం మీద ఉన్న అగ్నిపై అధికారం ఉంది. అతడు పదునైన కొడవలి గలవానితో బిగ్గరగా, “భూమి మీద ఉన్న ద్రాక్షపండ్లు పండిపోయాయి గనుక నీ పదునైన కొడవలితో ద్రాక్షపండ్ల గుత్తులను కోయుము” అని చెప్పాడు.


అప్పుడు బలిపీఠం ఈ విధంగా బదులిచ్చింది, “అవును, ఓ సర్వశక్తిమంతుడా ప్రభువైన దేవా, నీ తీర్పులు సత్యమైనవి న్యాయమైనవి.”


అప్పుడు అతన్ని ఆరాధించడానికి నేను ఆ దేవదూత పాదాల ముందు సాగిలపడ్డాను. కాని అతడు నాతో, “వద్దు! ఇలా చేయకు! నేను ఇతర విశ్వాసుల వలె యేసు కొరకు సాక్ష్యమిచ్చే నీలాంటి సేవకుడనే. దేవునినే పూజించు! ఎందుకంటే యేసును గురించిన సాక్ష్యం కలిగివుండడమే ప్రవచించే ఆత్మ” అని నాతో చెప్పాడు.


సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు నివసిస్తున్నావని నాకు తెలుసు. నా నామానికి నిజంగా కట్టుబడి ఉన్నావు. సాతాను నివసించే నీ పట్టణంలో నా నమ్మకమైన సాక్షి అంతిప అనేవాడు హతసాక్షిగా చంపబడిన దినాలలో కూడ నాలో నీ విశ్వాసాన్ని వదలకుండా ఉన్నావు.


అప్పడు తీర్పు తీర్చడానికి అధికారం ఇవ్వబడినవారు కూర్చునివున్న సింహాసనాలను నేను చూసాను. యేసును గురించి సాక్ష్యాన్ని బట్టి దేవుని వాక్యాన్ని బట్టి తలలు నరికివేయబడి హతులైన వారి ఆత్మలను నేను చూసాను. వారు ఆ మృగాన్ని కాని వాని విగ్రహాన్ని కాని పూజించలేదు, వారు దాని ముద్రను తమ నుదుటి మీద కాని చేతి మీద కాని వేయించుకోలేదు. వారు బ్రతికివచ్చి క్రీస్తుతో పాటు వెయ్యి సంవత్సరాలు పరిపాలించారు.


ధూపం వేసే బంగారు పాత్రను పట్టుకొన్న మరొక దేవదూత వచ్చి బలిపీఠం దగ్గర నిలబడ్డాడు. సింహాసనం ముందు ఉన్న బంగారు బలిపీఠం మీద దేవుని ప్రజలందరి ప్రార్థనలతో కలిపి అర్పించడానికి గొప్ప పరిమాణంలో ధూపద్రవ్యాలు అతనికి ఇవ్వబడ్డాయి.


ఆరో దూత బూర ఊదినప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్న బంగారు బలిపీఠపు నాలుగు కొమ్ముల నుండి ఒక స్వరం నాకు వినిపించింది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ