Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ప్రకటన 3:4 - తెలుగు సమకాలీన అనువాదము

4 అయినా సార్దీసులో నీ దగ్గర ఉన్న కొందరు తమ వస్త్రాలను మురికి చేసుకోలేదు. వారు యోగ్యులు కనుక వారు తెల్లని వస్త్రాలను ధరించుకొని నాతో పాటు నడుస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

4 అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్‍లో నీయొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతోకూడ సంచరించెదరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

4 అయితే సార్దీస్ లో నీ దగ్గర ఉన్నవారిలో కొందరు తమ బట్టలు మురికి చేసుకోలేదు. వారు యోగ్యులు. కాబట్టి వారు తెల్లటి బట్టలు వేసుకుని నాతో కలసి నడుస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

4 “మలినంకాని కొందరు వ్యక్తులు అక్కడ సార్దీసులో నీ దగ్గరున్నారు. వాళ్ళు యోగ్యులు కనుక, తెల్లని దుస్తులు ధరించి నాతో సహా నడుస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

4 అయినా సార్దీసులో నీ దగ్గర ఉన్న కొందరు తమ వస్త్రాలను మురికి చేసుకోలేదు. వారు యోగ్యులు కాబట్టి వారు తెల్లని వస్త్రాలను ధరించుకొని నాతో పాటు నడుస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

4 అయినా సార్దీసులో నీ దగ్గర ఉన్న కొందరు తమ వస్త్రాలను మురికి చేసుకోలేదు. వారు యోగ్యులు కాబట్టి వారు తెల్లని వస్త్రాలను ధరించుకొని నాతో పాటు నడుస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ప్రకటన 3:4
31 ပူးပေါင်းရင်းမြစ်များ  

మీరు ఏ పట్టణంలో లేక ఏ గ్రామంలో ప్రవేశించినా దానిలో యోగ్యులెవరో అడిగి తెలుసుకొని, వెళ్లే వరకు వారి ఇంట్లోనే బసచేయండి.


వారు ఆ సమాధిలోనికి వెళ్లినప్పుడు, తెల్లని అంగీ వేసుకొని ఉన్న ఒక యవ్వనస్థుడు కుడి ప్రక్కన కూర్చొని ఉండడం చూసి, చాలా భయపడ్డారు.


మృతుల పునరుత్థానం పొంది రానున్న యుగానికి యోగ్యులుగా ఎంచబడేవారు పెళ్ళి చేసుకోరు, పెళ్ళికివ్వబడరు.


కనుక జరగబోయే వాటన్నిటి నుండి తప్పించుకొని, మనుష్యకుమారుని ముందు నిర్దోషిగా నిలబడగలిగేలా అన్ని సమయాల్లో మెలకువగా ఉండి ప్రార్థించండి” అని చెప్పారు.


ఇంచుమించు నూట ఇరవై మంది విశ్వాసులు ఒక్కచోట చేరినప్పుడు పేతురు వారి మధ్యలో నిలబడి,


దీన్ని బట్టి దేవుడు ఇచ్చిన తీర్పు న్యాయమైనదని తెలియజేయడానికి రుజువుగా, మీరు అనుభవించిన శ్రమల వలన మీరు దేవుని రాజ్యానికి అర్హులు అవుతారు.


అగ్నిగుండం నుండి బయటకు లాగినట్లు ఇతరులను రక్షించండి. మరికొందరిపై భయంతో కూడిన కనికరం చూపండి. అయితే శరీర అపవిత్రతతో మరకపడిన వారి దుస్తులను కూడా ద్వేషించండి.


ఆ స్వరం, “నీవు చూసినవాటిని ఒక గ్రంథపు చుట్టలో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియ, లవొదికయ అనే ఏడు సంఘాలకు పంపించు” అని చెప్పడం విన్నాను.


సరిగ్గా అదే గంటలో ఒక పెద్ద భూకంపం వచ్చి ఆ పట్టణ పదవ భాగం కూలిపోయింది. ఏడు వేలమంది ప్రజలు చనిపోయారు, అయితే మిగిలిన వారికి భయం కలిగి పరలోకం నుండి పరిపాలిస్తున్న దేవుని మహిమపరిచారు.


వీరు, ఏ స్త్రీతో తమను అపవిత్రపరచుకోకుండా పవిత్రంగా జీవించారు. గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్తే అక్కడికి వారు దాన్ని అనుసరించారు. వారు మానవుల నుండి దేవునికి, గొర్రెపిల్లకు తొలిఫలంగా అర్పించడానికి కొనబడ్డవారు.


తెల్లని, పవిత్రమైన సున్నిత నార వస్త్రాలను ధరించి తెల్లని గుర్రాల మీద సవారీ చేస్తున్న పరలోక సైన్యాలు ఆయనను వెంబడిస్తున్నాయి.


ఆమె ధరించడానికి, ప్రకాశమైన శుద్ధమైన సున్నితమైన నార వస్త్రాలు ఆమెకు ఇవ్వబడ్డాయి.” సున్నితమైన నార వస్త్రాలు అనగా దేవుని పరిశుద్ధ ప్రజలు చేసిన నీతి క్రియలు అని అర్థం.


నీవు ధనవంతునివి అయ్యేలా అగ్నిలో పుటం వేసిన బంగారాన్ని, అవమానకరమైన నీ దిగంబరత్వం కనబడకుండా ధరించుకోవడానికి తెల్లని వస్త్రాన్ని, నీకు చూపు కలుగడానికి నీ కళ్ళకు మందును నా దగ్గర కొనుక్కో అని నేను నీకు సలహా ఇస్తున్నాను.


జయించువారు వారిలా తెల్లని వస్త్రాలు ధరించుకొంటారు. వాని పేరును నేను జీవగ్రంథంలో నుండి ఎన్నడు తుడిచివేయను నా తండ్రి ముందు, ఆయన దూతల ముందు వాని పేరును ఒప్పుకుంటాను.


ఆ సింహాసనం చుట్టూ మరో ఇరవైనాలుగు సింహాసనాలు, వాటి మీద ఇరవైనలుగురు పెద్దలు కూర్చునివున్నారు వారు తెల్లని వస్త్రాలు ధరించుకొని తలల మీద బంగారు కిరీటాలు కలిగివున్నారు.


అప్పుడు వారిలో ప్రతి ఒక్కరికి తెల్లని వస్త్రాలను ఇచ్చి, “మీలాగే ఇంకా హతులైన మీ తోటి సేవకుల, సహోదరీ సహోదరుల సంఖ్య పూర్తయేవరకు ఇంకా కొంత కాలం వేచి ఉండాలి” అని వారికి చెప్పబడింది.


ఈ సంగతుల తరువాత ఒక గొప్ప జనసమూహం లెక్కపెట్టడానికి అసాధ్యమైనంత మంది ప్రజలు ప్రతి దేశం నుండి, ప్రతి గోత్రం నుండి, ప్రతి జాతి నుండి, ప్రతి భాష మాట్లాడేవారి నుండి వచ్చినవారు తెల్లని వస్త్రాలను ధరించి ఖర్జూర మట్టలు చేత పట్టుకొని సింహాసనం ముందు వధించబడిన గొర్రెపిల్ల ముందు నిలబడి ఉండడం నేను చూసాను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ