Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ప్రకటన 21:21 - తెలుగు సమకాలీన అనువాదము

21 పన్నెండు ద్వారాలు పన్నెండు ముత్యాలు, ప్రతి ద్వారం ఒక ముత్యంతో చేయబడింది. ఆ పట్టణపు ప్రధాన వీధి బంగారంతో చేయబడి, గాజులా స్వచ్ఛముగా ఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

21 దాని పండ్రెండు గుమ్మములు పండ్రెండు ముత్యములు; ఒక్కొక గుమ్మము ఒక్కొక ముత్యముతో కట్టబడియున్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలియున్నది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

21 దాని పన్నెండు ద్వారాలూ పన్నెండు ముత్యాలు. ఒక్కో ద్వారాన్నీ ఒక్కో ముత్యంతో కట్టారు. పట్టణపు రాజవీధి స్వచ్ఛమైన స్ఫటికం లాంటి మేలిమి బంగారం.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

21 ఆ పన్నెండు ద్వారాలు పన్నెండు ముత్యాలతో చేయబడి ఉన్నాయి. ఒక్కొక్క ద్వారం ఒక్కొక్క ముత్యంతో చేయబడి ఉంది. ఆ పట్టణపు వీధులు మేలిమి బంగారంతో చేయబడి ఉన్నాయి. అవి గాజువలె స్వచ్ఛంగా ఉన్నాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

21 పన్నెండు ద్వారాలు పన్నెండు ముత్యాలు, ప్రతి ద్వారం ఒక ముత్యంతో చేయబడింది. ఆ పట్టణపు ప్రధాన వీధి బంగారంతో చేయబడి, గాజులా స్వచ్ఛంగా ఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

21 పన్నెండు ద్వారాలు పన్నెండు ముత్యాలు, ప్రతి ద్వారం ఒక ముత్యంతో చేయబడింది. ఆ పట్టణపు ప్రధాన వీధి బంగారంతో చేయబడి, గాజులా స్వచ్ఛంగా ఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ప్రకటన 21:21
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఆ స్త్రీ ఊదా, ఎరుపు రంగు వస్త్రాలను ధరించి, మెరిసే బంగారం, విలువైన రాళ్ళు, ముత్యాలతో అలంకరించబడి ఉంది. ఆమె తన చేతితో ఒక బంగారు పాత్ర పట్టుకొని ఉంది. ఆ పాత్ర ఆమె చేసిన అసహ్యమైన పనులు, వ్యభిచారమనే మురికితో నిండి ఉంది.


బిగ్గరగా ఇలా రోదించారు, “ ‘ఓ మహా పట్టణమా, నీకు విపత్తు, విపత్తు. సున్నితమైన నారబట్టలు, ఊదారంగు బట్టలు, ఎరుపు రంగు బట్టలు ధరించుకొని, బంగారంతో, విలువైన రాళ్ళతో, ముత్యాలతో అలంకరించుకొని మెరుస్తున్నదానా,


నాతో మాట్లాడిన ఆ దేవదూత చేతిలో పట్టణాన్ని, దాని ద్వారాలను దాని గోడలను కొలవడానికి ఒక బంగారు కొలతకర్ర ఉంది.


ఆ గోడ సూర్యకాంత మణులతో కట్టబడింది. ఆ పట్టణం స్వచ్ఛమైన బంగారంతో చేయబడి గాజులా స్వచ్ఛముగా ఉంది.


ఆ నది ఆ పట్టణపు ప్రధాన వీధి మధ్యన ప్రవహిస్తుంది. ఆ నదికి ఇరువైపుల జీవవృక్షం ఉంది. అది ప్రతి నెల ఫలాన్ని ఇస్తూ పన్నెండు పంటలను ఇస్తుంది. ఇంకా ఆ చెట్టు ఆకులు జనాల స్వస్థతకొరకు ఉన్నాయి.


ఆ సింహాసనం ముందు స్ఫటికం లాంటి ఒక గాజు సముద్రం ఉంది. మధ్యభాగంలో, ఆ సింహాసనం చుట్టూ నాలుగు ప్రాణులు ఉన్నాయి. ఆ ప్రాణులు ముందు వెనుక కళ్ళతో నిండి ఉన్నాయి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ